Monday, August 23, 2021

గురజాడ కన్యాశుల్కం

గురజాడ కన్యాశుల్కం

సాహితీమిత్రులారా!కన్యాశుల్కము ప్రథమాంకంలో
గిరీశం - యీ వ్యవహార మొహటి ఫైసలైంది.
            ఈ రాత్రికి మధురవాణికి సార్టింగ్
            విజిట్ యివ్వంది పోకూడదు.
      నీ సైటు నాడిలైటు
      నిన్ను మిన్న
       కానకున్న
       క్వైటు రెచడ్ ఫ్లైటు
       మూనులేని నైటు


బంట్రోతు -
ఫుల్లుమూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా!  టా!


పంచమాంకంలో
పూజారి - మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను
           రాణా, డైమండ్ రాణీ
       రాణా, యిస్పేటు రాణి రాణికళావ
       ఱ్ఱాణా, ఆఠీన్రాణీ
       రాణియనన్మధురవాణె, రాజులరాణి


దీనిలో ఎక్కువభాగం ఇంగ్లీషు పదాలను
తక్కువగా తెలుగు పదాలను వాడాడు.

12 comments:

కాంత్ said...

అడిదం సూరకవి అయితే "...మధురవాణి రాణి కాక,
ఈ రాణులు రాణులా పెను తరవాణులు కాక ధరాతలంబునన్" అని చెప్పి ఉండేవారేమో?

శ్యామలీయం said...
This comment has been removed by the author.
కాంత్ said...

అయ్యా శ్యామలీయంగారు,

రెంటికి మరో రెండు (నాలుగు) ముక్కలు. మీకు హ్యూమరసానికీ, ఛందోబద్ధానికీ తేడా తెలియదనుకుంటాను. మీరు మీ బ్లాగులలో వ్యాఖ్యలు, జోకులు కూడా ఛందోబద్ధంగా ఉండాలనుకుంటే అది మీ ఇష్టం. కాని ఇంకొకరి బ్లాగులోని వ్యాఖ్యలలో వ్యాకరణదోషాలు ఎత్తి చూపడం మీకు తగదు. ఈ ఛందోరహిత వ్యాఖ్య ద్వారా మీకు అవమానం కలిగిస్తే క్షంతవ్యుడిని.

శ్యామలీయం said...
This comment has been removed by the author.
Anonymous said...

అయ్యా శ్యామలీయం గారూ,
మీరు కామెంట్ పెట్టిన తర్వాత దానికి రిప్లై మీకు నెగటివ్ గా వస్తే గబుక్కున మీ కామెంట్ ని ఉపసంహరించడం, కట్టుబడి ఉండే ధైర్యం లేకుండా ఉండటం ఎంతవరకు సబబు? దానర్ధం అక్కడ మీ తప్పు ఉన్నట్లు మీరు ఒప్పుకోవడమేగా? మీరేమో ఊరందరి తప్పులు బహు ఘనంగా ఎత్తెత్తి చూపుతుంటారు అదే మిమ్మల్ని ఎవరన్నా పల్లెత్తు మాట అంటే వెంటనే తోక ముడుస్తారు. మీరేం పండితులండీ
బాబూ? తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు - మహాత్ములు అలా ఊర్కెనే వ్రాశారా, ప్చ్?
ఇంకోటి కూడా - ఏదో తోక వంకర అంటారనుకుంటాను! అరెరే మరొక్కటి కూడా గుర్తొస్తోంది "అనువు గాని చోట -----
అయినా మీకివన్నీ తెలియని సంగతులా ఏమిటి, ఏదో నా పిచ్చ గానీ!

శ్యామలీయం said...

అయ్యా అనామకుల వారూ,
మీరు నేరుగా తప్పు ఎత్తిచూపుతున్నారు కాబట్టి వ్రాయక తప్పటంలేదు. అంతే కాని మనస్ఫూర్తిగా వ్రాస్తున్నది కాదు. నాకు దైర్యం లేదా తప్పు ఒప్పుకుంటున్నారా అంటూ‌ ప్రశ్నిస్తున్నారు. అవునండీ వాదాలతో సమయం వృధాచేసుకొనే తీరిక ఓపిక మీరనే ధైర్యమూ లేవు సరేనా. ఇక నేను చేసిన తప్పిదం ఒకటే - అసలు ఈవృథాప్రసంగానికి నాంది పలకటం. అంతే కాని నేను వ్రాసిన మాటల్లో తప్పు ఏమీ‌లేదు. ఈ‌బ్లాగరు గారు భాషాదోషాలూ ఛందోదోషాలూ అప్పుడప్పుడు లక్షణదోషాలూ సరిచూసుకొనకుండా ప్రచురిస్తూ ఉంటారనటంలో సందేహం అక్కరలేదు. ఇకపోతే మీరో మరొకరో సూరకవిగారి మీద పెట్టి వ్రాసినది ఛందోయుక్తంగా లేకపోవటం చింత్యం అనటమూ సత్యదూరం కాదు. మీ బాధ ఏమిటీ? మీర్ నన్ను వెక్కిరంచదలచుకుంటే అలాగే కానివ్వండి. మీరిన్న చెప్పారే, పడ్డవారంతాఅ చెడ్డవారు కాదని మీకు తెలియదని అనుకోలేను కాదా. ఇకపోతే మీరు ఇంకేమన్నా అనదలచుకుంటే నిరాక్షేపణీయంగ సెలవియ్యండి. నాకు సమాధానం ఇవ్వటానికి ఓపికా తీరికా లేవు. అసక్తి అంతకంటే లేదు. మీలాంటి మహాత్ముల సౌకర్యార్ధం ఈ వ్యాఖ్యను తొలగించను లెండి. అసలు అనియంత్రితమూ అసందర్బమూ ఐన ఇలాంటి చోట్ల వ్రాయటం అనేదే పెద్దతప్పు అని తెలిసినా అప్పుడప్పుడు ఏదో పొరబడుతున్నాను. అది నిగ్రహించుకోవాలి నేను. ధన్యవాదాలు.

శ్యామలీయం said...

అయ్యా అనామకుల వారూ, ఒక్క ముక్క మనవి చెయటం మరచిపోయాను. "మీరేం పండితులండీ బాబూ?" అంటున్నారే, నేను ఎన్నడైనా పండితుడని అని చెప్పుకున్నానా? లేదు. ఎన్నడూ‌ అలా చెప్పుకోలేదు. దయచేసి గమనించ గలరు.

Anonymous said...

అయ్యా శ్యామలీయం గారూ, మీరు చెప్పుకున్నా చెప్పుకోక పోయినా మీరు బ్లాగ్లోకంలో ఉన్నకొద్దీ మందిలో పండితులే. "అనియంత్రితమూ అసందర్బమూ ఐన ఇలాంటి చోట్ల వ్రాయటం అనేదే పెద్దతప్పు అని తెలిసినా అప్పుడప్పుడు ఏదో పొరబడుతున్నాను. అది నిగ్రహించుకోవాలి నేను" - ఈ మాట మీరు ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నా, చేస్తూనే ఉన్నారు. అయ్యో మీలాంటి పండితులకు ఇదేం తప్పు పరిస్థితి అని వ్యాకుల పడటం తప్ప నా స్పందనలో వెక్కిరింతేమ్ లేదు. నమ్మడం పోవడం అన్నది మీ మనఃస్థితి. అలాగే మీరు ఒప్పుకోకపోయినా సరే మీ కామెంట్ తొలగించడం అన్నది మాత్రం మిక్కిలి అపసవ్యం.

Anonymous said...

కొందరు తమకన్నా ప్రతిభావంతులపై ద్వేష భావం, తమకన్నా తక్కువ విషయమున్న వారిపై ఏహ్య భావం కలిగి ఉంటారు. కాక దాన్ని పదే పదే బయట పెట్టుకుంటూ ఉంటారు, సందర్భం దొరికిందనుకున్నప్పుడల్లా. వాళ్లకదో మానసిక రుగ్మత. ఎందుకో తెలియదు కానీ నాకిది కూడా వ్రాయాలనిపించింది.

కాంత్ said...

అయ్యా శ్యామలీయంగారూ,

మీరన్నారు "ఈ‌బ్లాగరు గారు భాషాదోషాలూ ఛందోదోషాలూ అప్పుడప్పుడు లక్షణదోషాలూ సరిచూసుకొనకుండా ప్రచురిస్తూ ఉంటారనటంలో సందేహం అక్కరలేదు". మీరు ఏ కాంత్‌ని చూసి ఏ కాంత్ అనుకుని పొరబడుతున్నారో తెలీదు. నేనెప్పుడూ తెలుగు పద్యాలు/చందోబద్ధ కవిత్వాలు రచించలేదు, ఏ బ్లాగుల్లోనూ ప్రచురించలేదు. అయినా నేను బ్లాగరునని మీకెవరు చెప్పారు? నేనిక్కడ సరదాకేదో ఒక వాక్యంతో వ్యాఖ్య పెడితే, అదేదో సమస్యా పూరణకోసం, నాలుగు పాదాల ఉత్పలమాల రాసినట్టు మీరంతలా 'feel' అయిపోయి నేను ఎల్లవేళలా అఛందోబధ్ధంగా బ్లాగుతున్నట్లు కామెంటాలా? ముగించబోయేముందు ఒక చిన్న ప్రశ్న. అడిదం సూరకవిలాంటి కవులు ఎప్పుడూ ఒక వాక్యంలో చతురోక్తంగా మాట్లాడరా? అదికూడా చందోబద్ధంగా ఉండాలన్న రూలు ఏమైన వారు పెట్టుకుంటారా? ఇదే నా ఆఖరి వ్యాఖ్య.

Anonymous said...

ఏమోయ్ కాంతూ
ఏవిటా ధూర్తాలాపనలు గురువుగారిపైన ?
చెంపలేసుకో

శ్యామలీయం said...

మిత్రులు కాంత్ గారు,

మన్నించాలి. మీరు కొంచెం అపోహపడుతున్నారు. ఏదైనా టపా క్రింది వ్యాఖ్యలో 'బ్లాగరు గారు' అని సంబోధించటం అనేది సదరు టపావ్రాసిన బ్లాగరు గారిని ఉద్దేశించే జరుగుతుంది కాని అన్యథా కాదు. 'ఈ చిత్రకవితాప్రపంచం బ్లాగరు గారు' అని ఉంటే ఇలా అపోహ పడే వారు కాదేమో. నిజంగానే చిత్రకవితాప్రపంచం బ్లాగుటపాల్లోని పద్యాల్లో అసంఖ్యాకంగా అక్షరదోషాలూ లక్షణదోషాలూ కనిపిస్తాయండి. అతిశయోక్తి లేదు. ఒక ఇ-మెయిల్ ఇంగ్లీషులో వ్రాసినప్పుడు వందసార్లు స్పెల్లింగ్ చెక్ చేసుకుంటారు జనం కాని తెలుగులో వ్యాసం వ్రాసినప్పుడు శుధ్ధంగా ఉందో లేదో ప్రతిని సరిచూచుకోనక్కర లేదా చెప్పండి?

సూరకవి గురించి అడుగుతూ మీరు, వారు ఛందోబధ్ధంగా ఉండాలన్న రూలు పెట్టుకుంటారా అంటే, అవునన్నట్లే తోస్తుందండి. దీనికి మూడు ఉదాహరణలు ఇవ్వనా.

మొదటిది. ఒకసారి సూరకవిగారు ఎక్కడినుండో‌ స్వగ్రామానికి వస్తూ‌ దారిలో అటే వస్తూ కనిపించిన ఒకామెను పలుకరిస్తే ఆమె అదపాక పోయి వస్తున్నానన్నదట. అప్పుడు కవిగారు 'అదపాకా అత్త ఊరు, ఔనా పాపా' అన్నారు (కందపద్యపాదంలో)

రెండవది. కవులకు ఊరిపెద్దలు వార్షికాలు ఇస్తూ ఉండే వారు. సూరకవిగారికి అలా ఇచ్చే ఒక వ్యాపారి సరవయ్య శెట్టి ఎందుకనో ఇవ్వక తిప్పిస్తున్నా ఆయన ఓపిగ్గా వెల్ళి అడుగుతూ ఉండే వాడు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు ఆతడు అరుగుమీద కూర్చుని ఉన్నాడు. కవి మీద విసుగుతో ఈబాపడు మళ్లావచ్చాడు వీణ్ణి పాం గరవ అన్నాడు. ఆముక్కలు చెవిన పడి సూరకవి కటకటపడి ఉగ్రుడై 'ఆపామే నిన్ను కరవ అయ్యో సరవా' అన్నాడట. ఇదీ ఒక కందపద్యపాదమే.

మూడవది. సూరకవిగారి కొడుకు బాలభాస్కరుడు. బాచి అని పిలిచే వారు. కొంచెం‌ ఎత్తుపళ్ళవాడు. ఒకసారి కవిగారి భార్య అన్నది కదా అందరిమీదా ఎప్పుడూ పద్యాలు చెప్తారు కాని మన బాచిమీద చెప్పచ్చు కదా ఒకటి అన్నది. అందుకు ఆయన నవ్వుతూ

కం. బాచా? బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి! పంద్లుం దానున్!
బూచనిన రాత్రి వెఱతురు -
బాచన్నను చూచి పట్టపగలే వెఱతుర్!!

అని చెప్పాడట. చూసారా? అయన ఇంత్లో ఛలోక్తి విసిరినా అది పద్యంలోనే వచ్చింది కదా!

ఇలా సూరకవి నోరు తెరిస్తే పద్యమే. ఐతే ఆయన అల్లాటప్పా పద్యగాడు అనుకోకం డోహో. ఒకసారి అందరు రాజులూ కూర్చున్న సభలో సూరకవి గారు తమ ప్రభువైన పూసపాటి విజయరామ గజపతి గారి ప్రశస్తిని చాటి చెప్పుతూ

ఉ। రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా
రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతర సీమవర్తి వి
భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాలుడు రాజు గాని యీ
రాజులు రాజులే‌ పెనుతరాజులు కాక ధరాతలంబునన్

అని ధాటీగా పద్యం చెప్పి సభారంజనం చేసారు అక్షరలక్షల కన్నా విలువైన గొప్ప పద్యంతో. అదీ సూరకవి అంటే!!