ప్రశ్నే సమాధానం - 2
సాహితీమిత్రులారా!
ప్రశ్ననే సమాధానంమైన దాన్ని ప్రశ్న ఉత్తరం - ప్రశ్నోత్తరం అంటాం
తెలుగులోని ఈ ప్రశ్నోత్తర చిత్రం గమనించగలరు-
ఎద్దీశునకశ్వంబగు?
గ్రద్దన నేదడవి తిరుగు ఖరకంటకియై?
హద్దుగ నేవాడు ఘనుడు?
పద్దుగ నుత్తరము లిందె పడయంగానౌ!
ప్రశ్న :- ఎద్దీశునకు (ఎద్ది + ఈశునకు) అశ్వంబగు?
జవాబు: - ఎద్దు ఈశునకు అశ్వమగును
ప్రశ్న :- ఏదడవిలో (ఏది + అడవిలో)ముండ్లతో తిరుగును?
జవాబు: - ఏదు(పంది) అడవిలో ముండ్లతో తికుగును
ప్రశ్న :- హద్దుగా ఎవడు గొప్పవాడు?
జవాబు : - (తన) హద్దును ఎరిగినవాడు గొప్పవాడు
(గ్రద్దన = శీఘ్రంగా, ఖర = వాడియైన, ఏదు = ఏదుపంది)
No comments:
Post a Comment