ప్రేయసీ - ప్రియుల సంవాద పద్యం
సాహితీమిత్రులారా!
ప్రేయసి ప్రియుల మాటలు ఎంత సరసంగా ఉంటాయో
చెప్పడానికి ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది.
ఇది చాటుధరాచమత్కారసారమనే దానిలోనిది.
శ్లో. కఠిన కుచౌ తవ బాలే, చటుల చకోరాక్షి తావకే నయనే
కుటిల సుకే శ్యలకా స్తే మిథ్యావాదిన్లతాంగి తవ మథ్యమ్
ప్రేయసి - కఠిన! (ఓ కఠినుడా!)
ప్రియుడు - కుచౌ తవ బాలే
(ఓ బాలికాతిలకమా నీకుచములు కఠినముగాని నేనుగాదు)
ప్రేయసి - చపల! (ఓ చపలస్వభావం కలవాడా!)
ప్రి - చకోరాక్షి తావకే నయనే
(ఓ చకోరమువంటి కన్నులు గలదానా! నీకను్నలే చపలములు నేనుగాదు.)
ప్రే.- కుటిల! (వంకర నడతగలవాడా!)
ప్రి.- సుకే శ్యలకా స్తే
(మంచి వెంట్రుకలుగలదానా! నీముంగురులే కుటిలములు నేనుగాదు)
ప్రే.- మిథ్యావాదిన్! (కల్లరీ!, మిథ్యను పలికేవాడా!)
ప్రి. - లతాంగి తవ మధ్యమ్
(తీగెవలె సన్ననిశరీరంగలదానా! నీ నడుమే మిథ్య(కల్ల) నేను కాదు)
ఇది ఒకనాటి సంవాదం
No comments:
Post a Comment