Friday, November 20, 2020

ముక్కుతో పలుకని పద్యం

 ముక్కుతో పలుకని పద్యం





సాహితీమిత్రులారా!



ముక్కుతో పలికే అక్షరాలను

అనునాసికాలు అంటారు

ఙ,ఞ,ణ,న,మ - అనేవి అనునాసికాలు

ఇవిలేకుండా పద్యం వ్రాస్తే ముక్కుతో పనిలేదు

వాటిని నిరనునాసికాలు అంటాం.

ఇక్కడ నిరనునాసిక చంపువు అనే కావ్యం నుండి

ఒక ఉదాహరణ చూద్దాం-

లక్ష్మణుడు శూర్పనఖకు ముక్కుచెవులు కోసిన తర్వాత

అన్న అయిన రావణుని దగ్గరకు వెళ్ళి 

ఈ విధంగా చెప్పిందట


హా! హా! రాక్షస దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజా

విద్యుజ్జిహ్వువిపత్తిరేవ సుకరా క్షుద్రపప్రతాప త్వయా

ధ్వస్తాపత్రప పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిరేతాదృశీ

జాతా కశ్యచిదేవ తాపసశిశోఃశస్త్రాత్తవైవ స్వసా

                                                                          (నిరనునాసిక చంపువు - 2)

ఓ రాక్షసరాజా! నీకు నీ 20 చేతులకు అవమానం, 

దయనీయమైంది నీ శౌర్యం, నీ 20 కళ్లతో బాగా చూడు

ఆ మునికుమారుని కత్తి నీ సోదరికి ఎంత బాధాకరమైన 

అవమానం కలిగించిందో (ముక్కు చెవులు కోసివేయబడినాయి)


ఈ పద్యంలో ఒక అక్షరమైనా ముక్కుతో పలుకుతుందేమో చూడండి.


No comments: