Monday, November 16, 2020

గూఢచతుర్థి(పాదగోపనము)

 గూఢచతుర్థి(పాదగోపనము)





సాహితీమిత్రులారా!



పాదగోపనము అంటే ఒక పద్యంలోని పాదాన్ని మిగిలిన

పాదాలలో గోపనం చేయడం. అది మొదటిపాదమైతే

ప్రథమపాదగోపనము అని, రెండవపాదమైతే 

ద్వితీయపాదగోపనమని, మూడవపాదమైతే 

తృతీయపాదగోపనమని, నాలుగవపాదమైతే

గూఢచతుర్థి అని అంటారు.

ఇక్కడ మనం గూఢచతుర్థిని 

కొడవలూరు రామచంద్రరాజుగారి

మహాసేనోదయం అనే గ్రంథంనుండి 

తీసుకొని వివరించుకుంటున్నాము.-

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా

మొదటి మూడు పాదాలలో గోపన
పరచిన అక్షరాలను కలుపగా నాలుగవపాదము వస్తుంది. అంటే నాలుగవ పాదము గోపనము లేక గూఢపరచినది.

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా

ఈ మూడు పాదాలలో చివరిదైన
నాలుగవ పాదం గూఢంగా ఉంది
ది ఎలా తెలుసుకోవాలంటే
మొదటి పాదంనుండి ప్రతి మూడవ
అక్షరం తీసుకుంటే 4వపాదం వస్తుంది

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా

ఆ అక్షరాలన్నీ కలుపగా

జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా -
అని ఏర్పడుతుంది.
పూర్తి పద్యం క్రింద చూడండి-

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా

No comments: