Tuesday, November 24, 2020

యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం

 యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం



సాహితీమిత్రులారా!



చిత్రకవిత్వంలో ప్రశ్నోత్తరచిత్రం ఒకటి

ఇక్కడ యజుర్వేద మంత్రాలలోని 

ప్రశ్నోత్తరచిత్రాన్ని చూద్దాం.

ప్రశ్నలు ఒక శ్లోకంలో  సమాధానాలు మరో శ్లోకంలో

ఇవ్వబడ్డాయి గమనించండి-

క స్వి దేకాకీ చరతి క ఉ స్వి జ్జాయతే పున:
కిగ్ం స్విద్ధిమస్య భేషజం కిం వావపనం మహత్ 

                                                             (యజు. 23-9)
ఇందులో ప్రశ్నలు మాత్రమే ఉన్నవి.  ప్రశ్నలు-
1. క స్వి దేకాకీ చరతి?
    ఒంటరిగా తిరిగునదేది? (ఏ గ్రహం చుట్టూ తిరుగనటువంటిది)
2.   క ఉ స్వి జ్జాయతే పున:?
      నలువైపులా తిరుగునదేది?
3. కిగ్ం స్విద్ధిమస్య భేషజం? (చలికి మందేది)
4. కిం వావపనం మహత్ ?
    విత్తనము మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్ద క్షేత్రమేది?


ఈ ప్రశ్నలకు ఈ మంత్రంలో  సమాధానాలు ఉన్నవి.

సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పున:
అగ్నిర్ హిమస్య భేషజం భూమిరావపనం మహత్

                                                              (యజు. 23-10)
జవాబులు -
1. సూర్య ఏకాకీ చరతి  (సూర్యుడు దేనిచుట్టూ తిరుగడు)
2. చంద్రమా జాయతే పున: (చంద్రుడు నలువైపులా తిరుగుతుంటాడు)
3. అగ్నిర్ హిమస్య భేషజం (చలికి మందు వేడి(అగ్ని))
4. భూమిరావపనం మహత్
    విత్తనములు మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్దక్షేత్రం భూమి

వేదంలో విజ్ఞాన బీజాలు గ్రంథం నుండి

No comments: