Friday, October 20, 2017

హైకూలూ, స్మయికూలూ


హైకూలూ, స్మయికూలూ


సాహితీమిత్రులారా!


హైకూలూ, స్మయికూలూ

                                            తెలుగు మాతృక - అజంతా
                                            స్వేచ్ఛానువాదం - శ్రీరమణ

నా నిద్రని మరచెంబులో వడపోసి
గుప్పెడు అక్షరాల్ని పడేసి మూత పెట్టేశా
ప్రతి అక్షరం ఒక పిల్లకల
శ్రీమద్గురు గురు తావళం పూస

      మో-కాళ్ల పర్వతం పాకలేను
      శ్రీనివాసా దిగిరా నీకు పుణ్యముంటుంది

అడవిలో తుపాకీ బుల్లెట్ గుడ్లు పెట్టింది
వార్ గ్రూప్ లు సమస్తం గ్రూప్ వార్ లు

        మూడో తరం దాటిపోయింది
        సపిండీకరణానికి సరైన సమయం

ప్లాట్ పారం మీద కపాలమోక్షాలు అవుతున్నాయి
రాజకీయ శ్రీరాగంలో దైవతం వేసుకోవచ్చు శిష్యా

         ఈ భూగోళం గంగిగోవు
         నా దేశం గంగడోలు

ఆవుపాలూ అనుభూతి పళ్ళూ
జరీ ఉత్తరీయాలూ కవిత్వాల కొలబద్దలు

హైకూలు స్మయికూలు
అందరూ క్యూలో నిలబడండి
వరుసగా నరుక్కొస్తా-

తాజాకలం అను అసలు సంగతి

పోనీ,
ఓ పని చేద్దాం
చెట్లన్నిటికీ కులాల పేర్లు పెట్టుకుందాం
అప్పుడేలాగూ చచ్చినట్టు బతికించుకుంటాం
                                                                         (ఆంధ్రప్రభ దినపత్రిక 1994)

(శ్రీరమణ పేరడీలు నుండి.................)

No comments: