Sunday, October 22, 2017

ది గ్రేట్ లౌ లెటర్


ది గ్రేట్ లౌ లెటర్




సాహితీమిత్రులారా!


గురజాడవారు సృష్టించిన "గరీశం" ముళ్లపూడివారి చేతిలో
పునర్యవ్వనాన్ని సంతరించుకున్నాడు. లెక్చర్లకు అలవాటు 
పడిన గిరీశం ప్రేమలేఖ ఇలా సాగుతుంది.

      మిస్ బుచ్చెమ్మ,
      లెటర్ రాయమంటే - ఓ యిటీజ్ కంప్లీట్లీ ఔట్ డే టెడ్. లౌ అండ్ ఇట్స్ నేచర్ మీద ఓ ఘంట లెక్చరిచ్చేద్దును గాని మన టెలుగూస్ కి కొన్ని ఫార్మాలిటీస్ అఘోరించాయి కదా!
పోతే వదినా!  మీకిక్కడ వో విషయం చెప్పాలి. ఎప్పుడూ యీ  గిరీశం లోక కళ్యాణం కోసం అంటే వరల్డ్ మారేజ్ కోసమే కంకణం కట్టుకున్నాగాని సొంతానికి వోసారయినా కట్టుకున్నాడు కాదు మీరు డేరింగా - డార్లింగ్ అంటే యిహ పెళ్లి విషయమంటారా దొరల ఫాయలాలో లాగించేద్దాం. అయితే ప్రేమను గురించి మీకిక్కడ నాలుగు ముక్కలు చెప్పకపోతే సందర్భం వదలి చెపాయించినట్టు అయిపోతుంది. మీరు కొసాకి చదివాక నచ్చకపోతే గుగ్గిలం వేసుకోండి. గిరీశం అక్షరం నిప్పుల్లో వేసినా ఘుమ ఘుమలాడుతుంది. చర్చిల్ మహాశయుడు చచ్చి ఏ లోకాన వున్నాడో - నీ లెటర్స్ వుంటే లంక పువాకు బలాదూరోయ్ అనేవాడు. అసలీ ప్రేమలేఖలు డిక్టేషనుకి వొదగవుగాని లేకపోతే పూటకొహటి దంచెయ్యకపోయానా టెంథౌజెండ్
బ్రెయిన్సు. ఇరవై వేల చెవుూ వున్న సభల్లో లెక్చర్లివ్వడానికి నోరు తిరిగిన వాడికి ఆఫ్ట్రాల్ వొక్కరు చదువుకునే వుత్తరం ముక్క రాయాలంటే డామిట్... చెడ్డ చిర్రెత్తుకొస్తుంది. సీమ దొరలకి సంతాప సందేశాలు రాసిపెడితే ఆ భాషా అదీ చూసి బట్టీయం పెట్టేవారు. బతికుండగానే అబిట్యురీలు రాయించుకుని చట్రాలు  కట్టించుకున్న దొరలు యింకా బతికే వున్నారు. కావాలంటే సాక్షీకం యిప్పించేగల్ను. నా ప్రేమ వ్యవహారం. కచేరీ వ్యవహారంతో జతచేసి మీ నాన్నతో మాట్లాడగలను. ఆయన మనసు మీ మనసులాగా మెత్తన కాదు చూశారూ. తొందరగా నాటుతుందని అనుకోను. బ్రదరిల్లా వెంకటేశం మన ప్రేమకు అంబరిల్లా లాంటివాడు. సిగార్స్ కే కాపర్స్ కొరత వుండగా తపాలు ఖర్చులకు ప్రతిసారి ఠస్సా వెయ్యాల్సి వస్తోంది.

(ఏమిటి నా లెటర్లన్నీ కచేరీ నుంచి వచ్చాయని 
మీ నాన్నకు యిచ్చావా డామిట్ ప్రేమ అడ్డం తిరిగింది.)

(శ్రీరమణ పేరడీలు నుండి.................)

No comments: