Wednesday, July 5, 2017

సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!


సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!సాహితీమిత్రులారా!సమస్య-
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!

డా.ఏల్చూరి మురళీధరరావుగారి పూరణ-
అతివ మోము సొగసుఁ బ్రతిభటింపఁగఁ గోరి 
కమల చంద్రములకుఁ గలహ మొదవె;
నడుము కతన, నామె నడక కతము గాఁగ 
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!No comments: