Sunday, June 11, 2017

అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్


అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్సాహితీమిత్రులారా!సమస్య-
అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్


నిరంతరము జపములు హోమము చేసేవాడు
ఆరుగురిని ఎలా చంపుతాడు ఇది అసంగతము
కదా

 విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

భువు అరిషడ్వర్గమ్ముల
ఎవరైనను బాధపడుట ఎఱుగమె - కానీ
సవన యశస్వి, మహర్షి యె
అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్

ఇక్కడ అరిషడ్వగ్గములను చంపడంతో
పూరించడంతో సమంజసమైనది.

మీరు మీదైన రీతిలో పూరించి పంపగలరు

No comments: