Saturday, June 24, 2017

కైకో, పైకో, నైకో, మైకో


కైకో, పైకో, నైకో, మైకోసాహితీమిత్రులారాదత్తపది-
కైకో, 
పైకో, 
నైకో, 
మైకో - పదాలను
భారతార్థంలో పూరించవలెను


సి.వి.సుబ్బన్నగారి పూరణ-

కైకోరమ్మని కామరూపయగు రక్షశ్శ్యామ ప్రౌఢాత్మయై
పైకోఁ గాననసీమ భీముఁడు హిడింబంగూడి క్రీడించెఁ, దా
నై కోర్కుల్ పయికొన్నయంగన రతివ్యాపార లీలాగతుల్
మైకోఁ దారలువ్రాలు భూమిదిరుగున్ మల్లాడు చందమ్ము నన్

కైకో - పాణిగ్రహణముచేయు
తారలు - కనుగ్రుడ్లు
భూమి - శ్రోణి


No comments: