Friday, October 30, 2020

చిత్రకావ్యం - వేదాంతదేశికులు

 చిత్రకావ్యం - వేదాంతదేశికులు





సాహితీమిత్రులారా!


వేదాంతదేశికులు తన పాదుకాసహస్రం, 

యాదవాభ్యుదయం కావ్యాలలో ప్రదర్శించిన 

చిత్రకవిత్వం ఈ వీడియో నందు వీక్షించండి-



 


Wednesday, October 28, 2020

పాదుకాసహస్రంలో బంధచిత్రాలు

 పాదుకాసహస్రంలో బంధచిత్రాలు





సాహితీమిత్రులారా!

వేదాంతదేశికుల వారి పాదుకా సహస్రంలోని 

బంధచిత్రాలను వీక్షించండి-



Monday, October 26, 2020

ఒకే కందంలో ఎనిమిది కందాలు

ఒకే కందంలో ఎనిమిది కందాలు





సాహితీమిత్రులారా!



ఒక కందపద్యంలో మరో 7 పద్యాలు మొత్తం 8 కందపద్యాలు

ఒకే కందంలో కూర్చారు తూము రామదాసుగారు

తన నిర్వచన మిత్రవిందోద్వాహములో

ఆ పద్యం ఇక్కడ చూద్దాం-


చరణక జునకును భవనది

తరికినిస్తుతమునికవికిని ధనవిభుపతికిన్

క్షరదతనునకునుప్రవిహిత

కరికినుతవాసవికినిగణరాడ్పతికిన్ 

                                             (నిర్వచన మిత్రవిందోద్వాహము - 1- 36)

ఇందులో ఇదికాక 7 కందపద్యాలున్నాయి.

కనుక్కోవడం ఎలాగంటే 

ప్రతిపద్యం మొదటిపాదం మూడవ గణంనుండి ప్రారంభిస్తేసరి.

ఇక చూద్దాం-

రెండవ పద్యం-

చరణక జునకును భవనది

తరికినిస్తుతమునికవికిని ధనవిభుపతికిన్

క్షరదతనునకునుప్రవిహిత

కరికినుతవాసవికినిగణరాడ్పతికిన్ 


భవనది తరికినిస్తుతముని

కవికిని ధనవిభుపతికినని క్షరదతనునకున్ 

ప్రవిహిత కరికినుతవా

సవికినిగణరాడ్పతికిని చరణక జునకున్ 


మూడవ పద్యం-

భవనది తరికినిస్తుతముని

కవికిని ధనవిభుపతికినని క్షరదతనునకున్ 

ప్రవిహిత కరికినుతవా

సవికినిగణరాడ్పతికిని చరణక జునకున్ 


స్తుతముని కవికిని ధనవిభు

పతికినని క్షరదతనునకును ప్రవిహిత కరికిన్

నుతవా సవికినిగణరా

డ్పతికిని చరణక జునకును భవనది తరికిన్


నాలుగవ పద్యం-

స్తుతముని కవికిని ధనవిభు

పతికినని క్షరదతనునకును ప్రవిహిత కరికిన్

నుతవా సవికినిగణరా

డ్పతికిని చరణక జునకును భవనది తరికిన్


ధనవిభు పతికినని క్షరదత

నునకును ప్రవిహిత కరికిన్ నుతవాసవికిన్

గణరాడ్పతికిని చరణక 

జునకును భవనది తరికినిస్తుతమునికవికిన్


ఐదివ పద్యం -

ధనవిభు పతికినని క్షరదత

నునకును ప్రవిహిత కరికిన్ నుతవాసవికిన్

గణరాడ్పతికిని చరణక 

జునకును భవనది తరికినిస్తుతమునికవికిన్


క్షరదత నునకును ప్రవిహిత 

కరికిని నుతవాసవికిని గణరాడ్పతికిన్

చరణక జునకును భవనది 

తరికినిస్తుతమునికవికిని ధనవిభు పతికినన్


ఈ విధంగా చేస్తే 8 పద్యాలు కనిపిస్తాయి.

 

Sunday, October 25, 2020

విజయ దశమి శుభాకాంక్షలు

 విజయ దశమి శుభాకాంక్షలు




                          సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు 

విజయ దశమి శుభాకాంక్షలు

చెక్కులు పసగలిగుండును

 చెక్కులు పసగలిగుండును




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి-


చెక్కులు పసగలిగుండును

చక్కని గుబ్బలనెసంగ సౌరై యుండున్

చిక్కునొక గడియలోపల

మక్కువసతిగాదు చూడ మహిమండలిలోన్


చెక్కులు (చెంపలు) పసగలిగి ఉంటాయట

గుబ్బలు(పాలిండ్లు) అతిశయించి అందంగా ఉంటాయట

అలాంటిది ఒక గడియకు చిక్కుతుందట

కాని అది సతి(స్త్రీ) కాదట - అదేమిటో చెప్పాలి


సమాధానం - జోడు తలుపులు


తలుపు చెక్కులుంటాయి. గబ్బలుంటాయి

రెండు తలుపులు ఒక గడియకు మాత్రమే చిక్కుతాయి

కాబట్టి సమాధానం సైరైందే.

Saturday, October 24, 2020

దుర్గాష్టమి శుభాకాంక్షలు

 దుర్గాష్టమి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

దుర్గాష్టమి శుభాకాంక్షలు

Thursday, October 22, 2020

ఒక పద్యంలోనే నాలుగు పద్యాలు

 ఒక పద్యంలోనే నాలుగు పద్యాలు



సాహితీమిత్రులారా!






విన్నకోట పెద్దన 
కావ్యాలంకార చూడామణిలోని
సరసిజ వృత్తం  పద్యంలోనే నాలుగు పద్యాలు ఉన్నాయి గమనిద్దాం-

శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
                                                                (కావ్యాలంకార చూడామణి - 6-54)

ఇది ఒక గమ్మత్తైన వృత్తం ఇందులో రెండు కంపద్యాలున్నాయి
మొదటిది మొదటి రెండు పాదాలను చదివిన ఒక కందపద్యమవుతుంది
మూడు నాలుగు పాదాలు చదివిన రెండవ కందపద్యమవుతుంది
దీనిలోని మరో గమ్మత్తేమిటంటే
ఈ పద్యంలో రెండు కంద పద్యాలేకాదు
ఒక నవాక్షర వృత్తం, ఒక మణిగణనికరం ఉన్నాయి.
మొత్తం నాలుగు పద్యాలను ఇందులో ఇమిడ్చాడు విన్నకోట పెద్దనగారు

మొదటి కందము-

శ్రీవిశ్వేశక్ష్మావరు - సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావిత - దేవున్ ధృతియతు హిత జనదివదినకరున్

శ్రీవిశ్వేశక్ష్మావరు 
సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావిత
దేవున్ ధృతియతు హిత జనదివదినకరున్

రెండవ కందము-

శ్రీవర్ణింతున్ భావన - జీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావిత - భావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్

శ్రీవర్ణింతున్ భావన
జీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావిత
భావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్


శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్

ఈ పద్యంలో మొదటి తొమ్మిది అక్షరాలను
నాలుగు పాదాలలో నుండి తీసి ప్రక్కన వ్రాస్తే
నవాక్షర వృత్తమవుతుంది.

పద్యంలో తొమ్మిది అక్షరాలను ప్రతిపాదంనుండి
తీయగా మిగిలిన పాదాలను ప్రక్కన వ్రాసి చూస్తే
అది మణిగణనికరమవుతుంది.

శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్

నవాక్షరవృత్తం-

శ్రీవిశ్వేశక్ష్మావరు సేవా
ధీవిద్యా సంభావితదేవున్ 
శ్రీవర్ణింతున్ భావనజీవున్ 
భావోదంచద్భావితభావున్ 

మణిగణనికరము-

శ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధృతియతు హిత జనదివదినకరున్
జితరిపుశశికుశిఖరి మృగపతిన్
బ్రతిదినసముదిత బహుతర విభవున్