చ్యుతాక్షర చిత్రం
సాహితీమిత్రులారా!
కాశీపత్యవధానులవారి చ్యుతచిత్రం
చ్యుతం అంటె జారినది లేదా తీసివేయబడినది
చ్యుతాక్షరం అంటె తీసివేయబడిన అక్షరం
గమనించండి-
ఇది సారంగధరీయం ద్వితీయాశ్వాసం 41 పద్యం
కుధర సమా కృతి లాభ
మ్మధికముగా గొనె గుచద్వయం బొండొండా
కుధ ముఖ లిపులు సనినగ
ట్యధర దృగం గోక్తి నాసికాస్య నఖముల్
కుధర సమాకృతి లాభము = పర్వతమునకు సమానమైన ఆకృతిని,(కుచములు)
ధర సమాకృతీ లాభము=భూమికి సమానమైన ఆకృతి (పిరుదులు)
రసమాకృతి లాభము=అమృత సంపదవంటి రూప ప్రాప్తిని (ఆధరము )
సమాకృతి లాభము= ఎగుడు దిగుడుగాని రూప ప్రాప్తిని (దృక్కులు)
మాకృతి లాభము=లక్ష్మీదేవి వంటి ఆకార ప్రాప్తిని,(అంగములు)
కృతి లాభము=కావ్యరచనా రూపాన్ని అంటే చమత్కారాన్ని(ఉక్తులు)
తి =నువ్వుపువ్వు వంటి దీప్తిని (నాసిక)
లాభము= చంద్రుని (లః) వంటి కాంతిని (అస్యము)
భము =నక్షత్రాతిశయమును (నఖములు)
'కుధర సమాకృతి లాభము' అనే దానిలో ఒక్కొక్క అక్షరాన్ని తీసి వేస్తూ పోతే
అవి వరుసగా -
కటి,
ఆధరము,
దృక్కులు,
శరీరం,
ఉక్తి,
నాసిక,
ఆస్యము,
నఖములు
అనే వాటితో సరిపోతాయని దీని అర్థం.
No comments:
Post a Comment