Wednesday, February 22, 2023

కాశీపత్యవధానిగారి ద్విపాది

కాశీపత్యవధానిగారి ద్విపాది





సాహితీమిత్రులారా!



పద్యంలోని ఏ రెండుపాదాలు సమానంగా ఉన్నా దాన్ని ద్విపాది అంటారు

రెండు పాదాలు ఒకేలా ఉన్నా అర్థం మాత్రం ఒకేలా ఉండదు. అలాంటిది 

ఒకటి  కాశీపత్యవధానిగారి ద్విపాది గమనించండి-


రాజిత నగాగ్రమున విహారంబు సల్పు

నీలకంఠా తిశయము రాణిలుట కంటె

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు

నీలకంఠా తిశయము రాణిలుట కంటె


ప్రకాశించే పర్వత శిఖరాగ్రాన వేడుకగా తిరిగే ఈశ్వరుని గొప్పతనం

కంటె అని ఒకటి,రెండు పాదాల అర్థం. 

విరాజిల్లుచున్న చెట్టు చివర సంచరించే నెమళ్ళఅతిశయం చూశావా? 

అని మూడు,నాలుగు పాదాల అర్థం.ఈశ్వరుని కంటె కూడా నెమళ్ళు ఒప్పారుచున్నవి 

అని వర్ణించిన భావం ఎంతో రమణీయంగా వుంది కదా! 

No comments: