Tuesday, January 25, 2022

దీని భావం చెప్పండి

 దీని భావం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ మణిప్రవాళ పద్య భావం చెప్పండి-

ఓసి ఓసి వినవే మమజాతం

కాశి దేశ జలగాహనపూతమ్

నీకు పుణ్యముగదే మృగనేత్రి

కోక నుత్సృజ మదీయ సుఖార్థమ్

3 comments:

Anonymous said...

ఇదొక శృంగారపరమైన పద్యం
ఓసోసి లేడికళ్లదానా!
గంగానదిలో మునిగి(గంగాస్నానంతో) పవిత్రమైనదానా!
(లేదా)
గంగాభాగీరథీసమానురాలా!
నా కోరికను వినవే
నీకు పుణ్యముంటుంది.
నా సుఖంకోసం నీ కోకను విడు.
https:///www.nagaswaram.blogspot.com

ఏ.వి.రమణరాజు said...

ఆర్యా, ధన్యవాదాలు
మీ భావం సరైనదిగానే ఉంది, కాని
గంగాభాగీరథీ సమానులైన అనేది
సువాసినులకు వాడరు కేవలం
విధవలకు మాత్రమే వాడటం
సాంప్రదాయంలో ఉంది.

Anonymous said...

ముందుగా చిత్రకవిత్వంగుఱించి మీరు చేస్తున్న విశేషకృషికి అభినందనపారిజాతాలు.

నిజమే!
కానీ, మీరు చెప్పినట్లు సువాసిని అని అర్థం వచ్చే పదప్రయోగమేమీ లేదు కదా!.
పూర్వాపరాలు ఉండని కొన్ని చాటువులకు రకరకాల సందర్భాలు ఊహించుకోవడమే తప్ప గత్యంతరం లేదు.
గం.భా.స. కూడా కావచ్చని ఒక ఊహ.
దానికి కారణం ఫలానా వారిమీదే చాటువు చెప్పాలని లేదు కదా!
విధవలమీద కూడా చాటువులున్నాయి.
(కదిరిపురంలో విధవలు ఎలా ఉంటారో శ్రీనాథుడు చెప్పాడు.)
ఇంకొకటి "కాశి దేశ జల" ప్రశంస తేవడంవల్ల కూడా అలా ఊహించడం జరిగింది.
వాళ్లు భార్యాభర్తలు అయి ఉండవచ్చు. బంధువు కావచ్చు.
లేదా అతడు బాటసారి కావచ్చు. కాశీలో ఆమెను కలుసుకొని ఉండవచ్చు.
......

ఏతావాతా నాకు తోచిన భావం చెప్పడం జరిగింది.
వేఱెవరైనా సరైన సందర్భంతో కూడిన భావం తెలుపుతారని ఆశిస్తూ,
నమస్కారాలతో...

https:///www.satatam.blogspot.com