నల్లనిదేంది బేరి?
సాహితీమిత్రులారా!
రాచనగరులో ఒకచోట ఒక వ్యాపారి కస్తూరి రాసులు పోసి అమ్ముతున్నాడు
అతని దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెలకాపరి మాట్లాడాడు అది ఈ పద్యంలో
నల్లనిదేంది బేరి - మృగనాభి గొల్లడ దాన్ని తిందురా
అల్లటుగాదు, స్త్రీలు చనులందునఁ బూతురు, పూసినంతనే
జల్లున చేపువచ్చి తెగజారున కాదు సుగంధ మబ్బు, మా
పిల్లకుకాస్తపెట్టు - మన బేరియుఁ గస్తురిమూ సెఁగ్రక్కునన్
గొర్రెల కాపరి - నల్లనిదేంది బేరి?
వ్యాపారి -- మృగనాభి గొల్లడ
గొర్రెల కాపరి - దాన్ని తిందురా?
వ్యాపారి - అల్లటుగాదు, స్త్రీలు చనులందునఁ బూతురు,
గొర్రెల కాపరి - పూసినంతనే జల్లున చేపువచ్చి తెగజారున
వ్యాపారి - కాదు సుగంధ మబ్బు,
గొర్రెల కాపరి - మా పిల్లకుకాస్తపెట్టు -
మన బేరియుఁ గస్తురిమూ సెఁగ్రక్కునన్
No comments:
Post a Comment