Wednesday, May 5, 2021

గూఢచిత్రం

 గూఢచిత్రం




సాహితీమిత్రులారా!



పంచపాషాణాలుగా పిలువబడే పద్యాలలోని ఒక పద్యం

ఇక్కడ చూద్దాం-

ఇది అర్థకాఠిన్యం చేత గూఢచిత్రంలో చేరింది.

భండనభీమ! కృష్ణ! నిజవైరినృపాలురు నిల్చియున్ 
బృహ
న్మండలపుండరీక హరి నాక నివాసులుపాఱియున్ 
బృహ
న్మండలపుండరీకహరినాకనివాసులుచచ్చియున్ 
బృహ
న్మండలపుండరీకహరినాకనివాసులు చిత్ర మిద్దరన్

                                                  (చాటుపద్యరత్నాకరము - పుట. 224)                                                                      
భండనభీమ - యుద్ధమునందు(శత్రువులకు) 
భయము పుట్టించువాడా,
నిన్ను, ఎదిరి - తాకి(పోరి)
,
పాఱక - వెన్నిచ్చి(పరుగెత్తక)
నిల్చిన శాత్రవుల్ - శత్రువులు, 
బృహత్ - గొప్పవైన, మండల - గుండ్రములైన, 
పుండరీక - వెల్ల(తెల్ల)గొడుగులతోడ,
హరి - గుఱ్ఱములమీద, నాక - సుఖముగా, 
ని - మిగుల, వా - తిరుగుటకు, ఆస - స్థానమైనవారు,

పాఱియున్ - పాఱిపోయికూడ,
బృహత్ - గొప్ప, మండల - పాములకును, 
పుండరీక - పులులకును, హరి - సింహములకును, 
నాక - నెలవగు అడవియందు, 
ని - నిర్గత(పాయిన), 
వాసులు - కట్టుబట్టలు గల వారై యుందురు-

చచ్చియున్ -మరణించి కూడ,
బృహత్ - గొప్పదియు, మండల - ఎఱ్ఱనిదియునగు, 
పుండరీక - కమలములవంటి, హరి - సూర్యునియందును, 
నాక - స్వర్గమునందును, నివాసులు - ఉండువారు

బృహన్మండలపుండరీకహరినాకనివాసులు - 
అనేది మూడుమార్లు ఉన్నది- 
దీని వివరణ గమనించండి.


No comments: