సంభాషణలో గూఢం
సాహితీమిత్రులారా!
సరసం అంటేనే భార్యా భర్తల మధ్యగాని,
ప్రేయసీ ప్రియుల మధ్యగాని జరిగేది.
అవి ఎంత గూఢంగా ఉంటాయో ఇక్కడ చూడండి-
ఇక్కడ భార్యాభర్తల సుభాషణ చూద్దాం-
భోజనసమయంలో
భర్త (భార్యను) - పశువ (అన్నాడు)
భార్య(భర్తను) - కోతి (అన్నది)
ఇందులో ఏముంది సహజమేకదా!
అదీ నిజమే
కాని ఒక అవధాని ఈ సుభాషణను ఇలా వివరించారు
భర్త (భార్యను) - పళ్లెం శుద్ధంచేసి వడ్డించవే (అన్నాడు)
భార్య(భర్తను) - కోరినంత తినండి (అన్నది)
దీనిలోని గూఢత తెలిసిందికదా!
No comments:
Post a Comment