తలదీయ క్షుద్రదేవత జనించు
సాహితీమిత్రులారా!
ఈ చ్యుతచిత్రం చూడండి-
పక్షివర్యుండు పరగుఁబంచాక్షరముల
వాని తలదీల క్షుద్రదేవతజనించు
దాని తలదీయఁ దక్యెడ జానుమీఱు
దాని తలదీసి చూడఁగా దనరు నృపతి
ఈ పద్యంలో ఐదు అక్షరాలుగల పక్షిపేరు కనుక్కోవాలి
ఆ పక్షి పేరులోని మొదటి అక్షరం తీసివేయగా క్షుద్రదేవత అవుతుంది.
దాని మొదటి అక్షరం తీసివేయగా తక్కెడ వస్తుంది
దాని మొదటి అక్షరం తీసివేయగా నృపతి వస్తుంది
మరి ఆ పక్షిపేరేమో చెప్పండి -
సమాధానం - కపోతరాజు
కపోతరాజు(పావురం)
క పోతరాజు
పోతరాజు(క్షుద్రదేవత)
పో తరాజు
త రాజు(తక్కెడ)
త రాజు
రాజు(నృపతి)
No comments:
Post a Comment