Monday, August 6, 2018

గుప్తచతుష్పాద కందం


గుప్తచతుష్పాద కందం




సాహితీమిత్రులారా!


ఏ పాదం గుప్తంగా ఉంచబడితే దాన్ని దానిపేరుతో
పిలువడం జరుగుతుంది. గూఢచతుర్థి అంటే
నాలుగవ పాదం గోపనం చేయబడినదని.
ఇక్కడ నాలుగుపాదాలు గుప్తం చేయబడ్డాయని
చెప్పడం వల్ల ఇది గుప్తచతుష్పాదము అని
కందపద్యం కావున గుప్తచతుష్పాదకందం అని
అంటున్నాము. ఇలాటివి చాల తక్కువగా వున్నాయి.
వెలిదండ్ల వేంకటపతి కృత రాధామాధవ సంవాదం 
అనే కావ్యంలోనిది ఈ ఉదాహరణ చూడండి-


... ... నిను మది మఱువను
... ... నిను నెనరు మఱచి కినియకు నాపై
... ... కనికర ముంచర
... ... యని తలఁచినపుడె యెనసెద ననరా
          (రాధామాధవ సంవాదము - 2 - 109)

దీనిని రాధ నాలుగువిధాలుగా పూరించినదట

కృష్ణా! నిను మది మఱువను
కృష్ణా! నిను నెనరు మఱచి కినియకు నాపైఁ
గృష్ణా! కనికర ముంచర
కృష్ణా! యని తలఁచినపుడె యెనసెద ననరా (2-111)

కృష్ణా! కనికర ముంచర
కృష్ణా! యని తలఁచినపుడె యెనసెద ననరా
కృష్ణా! నిను మది మఱువను
కృష్ణా! నిను నెనరు మఱచి కినియకు నాపై (2-112)

నిను మది మఱువను కృష్ణా!
నిను నెనరు మఱచి కినియకు నాపైఁ గృష్ణా!
కనికర ముంచర కృష్ణా!
యని తలఁచినపుడె యెనసెద ననరా కృష్ణా!  (2-113)

కనికర ముంచర కృష్ణా!
యని తలఁచినపుడె యెనసెద ననరా కృష్ణా!
నిను మది మఱువను కృష్ణా!
నిను నెనరు మఱచి కినియకు నాపైఁ గృష్ణా!  (2-114)

ఈ విధంగా రాధ చతుష్పాదకందాన్ని పూరించినదట.

No comments: