Thursday, August 2, 2018

యధాశ్లోకతాత్పర్య రామాయణము


               యధాశ్లోకతాత్పర్య రామాయణము





సాహితీమిత్రులారా!

గద్వాల సంస్ధానంలో  ఆరుమంది విద్వత్కవులచే
రచింపబడినగ్రంథం యధాశ్లోకతాత్పర్య రామాయణము
దీన్ని గురించిన విశేషాలు వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి
సహాయంతో వివరించుకుందాం-
           
క్రీ.శ.1896లో గద్వాల సంస్థానప్రభువుల
"సాహిత్యవిద్యాముకుర ముద్రాక్షరశాల"‌లో
 బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మొదటిసంపుటంగా
 సుందర ,యుద్ధ కాండలు రెండవ సంపుటంగా ప్రచురితం.

 మొదటిసంపుటానికి పరిష్కర్త -బైరంపల్లి తిరుమలరాయకవి
 రెండవ సంపుటానికి పరిష్కర్త - ఆదిపూడి ప్రభాకరకవి కవివర్యులు

        అవతారిక -కామసముద్రంఅప్పలాచార్యులు,
        బాలకాండ - కాణాదం పెద్దనసోమయాజి,
        అయోధ్యకాండ - కొత్తపల్లిరామాచార్యులు,
        అరణ్యకాండ - గార్గేయపుర సుబ్బశాస్త్రి,
        కిష్కింధకాండ - కామసముద్రం అప్పలాచార్యులు,
        సుందరకాండ - తిరుమల కృష్ణమాచార్యులు,
        యుద్ధకాండ -  బోరవెల్లి శేషార్య.

యధాశ్లోకతాత్పర్యరామాయణం-‌ఆరుకాండలలోమొదటసంబుద్ధిపద్యాలు

  బాలకాండ - కాణాదం.
    క.తపమున స్వాధ్యాయస్థితి
       నిపుణుని వాగ్వేది వర్యుని న్మునిలోకా
       ధిపుని న్నారదు గూరిచి
       తపస్వి వాల్మీకిమౌని తగ నిట్లనియెన్.---ప్రథమాశ్వాసము
 
    క.శ్రీరమణీముఖచంద్ర చ
       కోరాయితనయన! గౌరకుండలిశయనా!
       వారణవరేణ్య భీతి ని
     ‌  వారణ! గద్వాలకేశవస్వామి!హరీ!!   ---ద్వితీయాశ్వాసము

   క. ‌శ్రీవదన విధుచకోర
       శ్రీవత్సమణీవిభా విశిష్ట శుభోర
       శ్రీవనమాలా మహిత
       గ్రీవా! గద్వాలనగర కేశవదేవా!!     --తృతీయాశ్వాసము
                                     
   అయోధ్యకాండ -కొత్తపల్లి
       క.శ్రీమజ్జలధిసుతా లల
          నామణి మణివలయ ఝణఝణత్కారి కరా
          బ్జామృదితపదద్వియ కృ
        ‌‌  పామయ! పూడూరికేశవ!మహాభ్యుదయా!! --ప్రధమాశ్వసము

      ‌క.శ్రీమత్కకుబంతస్థిత
         భూమీశ విపర్యమాన భుజబల రాజ
         త్సోమనృపావన గుణ భా
         గ్ధీమంజులదివ్యభావ! కేశవదేవా!!    ---ద్వితీయిశ్వాసము..

      క.రమణీయగాత్ర!కమలా
         రమణీయ గురుఃపరిష్కరణ కృత్తగుణా
         భ్రమణి సదృక్కౌస్తుభ ది
         వ్యమణీ!పూడూరికేశవా! దేవమణీ!   --తృతీయాశ్వాసము

    క.సురుచిర ఝంకృన్మద బం
       భరడింభకనాభికాభిభాసురనాళీ
       కరహచ్ఛరదంబుజభవ
       వర పూడురి నగర కేశవ! మహావిభవా!!  --చతుర్థాశ్వాసము

    క.శ్రీ తాపసహృన్నిలయ
   ‌‌‌‌     స్థాతృ పదాంభోజ సోమధరణీనాథ
        ప్రీతికర గాయకావళి
        గీతలసన్నామరావ!కేశవదేవా!!   --పంచమాశ్వాసము

 ‌   అరణ్యకాండ -గార్గేయపుర
       క.శ్రీరమణీ రమణీయ మ
          ణీరంజిత హృదయదేశ నిఖిలాధీశ
          స్ఫార కృప సోమకృప ల
          క్ష్మీరత గద్వాలనగరకేశవ!శౌరీ!!     --ప్రథమాశ్వాసము

       క.శ్రీలక్ష్మీ పృథుకుచకల
          శాలిప్త మృగీమద ద్రవాంకిత వక్షా!
          పాలిత సోమనృపశ్రీ
      ‌    ఖేలన!గద్వాలనగరకేశవ! శౌరీ!!    --ద్వితీయాశ్వాసము

       క.శ్రీవనితామణి ముఖ రా
          జీవ లతా విమతబింబ జీవంజీవా
          దేవాదిదేవ కంబు
          గ్రీవా! గద్వాలనగర కేశవదేవా!!   --తృతీయాశ్వాసము

    కిష్కింధకాండ - కామసముద్రం
       క.శ్రీకర లక్ష్మీకుచకల
          శీకర పరిలిప్త ఘుసృణ శీకరసాంద్రా!
          లోకరసోచిత సామ
          గ్రీకర!గద్వాలనగర కేశవ! శౌరీ!!       --ప్రథమాశ్వాసము

      క.శ్రీయువతీ నయనోత్సవ
         దాయి స్మితచంద్రికాతిధవళాధర ప
         ద్మాయత నయన బుధవ్రజ
         గేయా! గద్వాలచెన్నకేశవరాయా!!  --ద్వితీయాశ్వాసము

    ‌క.శ్రీమద్గద్వాలాధిప
       సోమక్షితిపాలపాల! శుభకరలీలా!!
       కోమల మంజుశ్రుతి వా
       గ్ధీమ ద్వినుతస్వభావ!కేశవదేవా!!    --తృతీయాశ్వాసము
 సుందరకాండ - తిరుమల
     క.శ్రీలక్ష్మీపృథుకుచకల
        శాలిప్త మృగీమదద్రవాంకితవక్షా!
        పాలితసోమనృపశ్రీ
        ఖేలన ! గద్వాలనగర కేశవ!శౌరీ!!    --ప్రథమాశ్వసము

     క.శ్రీమద్గద్వాలపురీ
        ధామ! పరంధామ ! దృప్తదైత్యోద్ధామ
        స్థేమావహరణ వినత
        క్షేమంకరణస్వభావ!కేశవదగవా!!     --ద్వితీయాశ్వాసము

    క.శ్రీరమణీహృన్మిత్రా!
       సారసదళవిపులనేత్ర!సన్నుతగాత్రా!
       ధీరజనోద్ధార!హరీ!
       క్రూరసురారిపవిదారి!కేశవశౌరీ!!       --తృతీయాశ్వాసము
యుద్ధకాండ పూర్వభాగము-బోరవెల్లి
     క.శ్రీలానీలాలీలా
        లోలా శ్రితహృదయకమలరోలంబకూపా
        పాలిత సోమప్రభు గ
        ద్వాలపురవిహారి!కేశవస్వామిహరీ!!    --ప్రథమాశ్వాసము

   క.శ్రీముష్టిపల్లి సోమ
       క్ష్మామండలనాథహృదయ జలరుహవర్తీ!
       శ్రీమద్గద్వాలపుర
       క్షేమంకరణానువర్తి!కేశవమూర్తీ!!         --ద్వితీయాశ్వాసము

  క.శ్రీకృష్ణాతుంగా మ
     ధ్యాకలితాయతమహీమహాఖండల సౌ
     ఖ్యాకర సోమనృపాల కృ
     పాకర!గద్వాలకేశవస్వామి!హరీ!!    -- తృతీయాశ్వాసము

  క.శ్రీతన్వీనయనోత్పల
     శీతకిరణ! భక్తిమద్వశీకరణచణ!
     క్ష్మాతరుణీ విభ్రమ వి
     క్రీతా!గద్వాల చెన్నకేశవ!నేతా!!       --చతుర్థాశ్వా సము
యుద్ధకాండ-ఉత్తరభాగము-బోరవెల్లి
   క.శ్రీరాజితహృదయ!దయా
      పారావారా!ద్విజిహ్వపర్యంకశయా!
      సారసుధాసార లస
      ద్గీరస!ఖద్వాలచెన్నకేశవదేవా!!      --ప్రథమాశ్వాసము

   క.శ్రీవనితా వనితామృ
      ద్భావావహ మహితశీల!భాస్వరలీలా!
      పావన గణవిజిత దశ
      గ్రీవా!గద్వాలచెన్నకేశవ!దేవా!!         --ద్వితీయాశ్వాసము

  క.శ్రీకర!శుభగుణమణి ర
      త్నాకర!వారాసిజా సహాయ జగద్ర
      క్షాకరణ చతురరిపు దృ
      గ్భీకర!గద్వాలచెన్నకేశవ!దేవా!!      --తృతీయాశ్వాసము

  క. శ్రీరమణీముఖచంద్ర చ
      కోరా కోరకితహృదయ కుతుకవ్రజ కాం
      తారకుఠారా వైరి ని
      వారణ!గద్వాలకేశవస్వామి!హరీ!!        --చతుర్థాశ్వాసము
(ఒకచోటయతి,ఒకపద్యం పునరుక్తం,మొదటిరాజధానిపూడూరు
  రెండవరాజధాని గద్వాల,కేశవాంకిత గ్రంథం,రచనకుప్రేరకుడు
  సోమభూపాల.)

No comments: