Thursday, April 30, 2020

హల్లులన్నీ ఒకే పద్యంలో


హల్లులన్నీ ఒకే పద్యంలో




సాహితీమిత్రులారా!

క్రమంగా - వర్ణం మొదలు - వర్ణం వరకు ఉన్న
అన్ని హల్లులను ఉపయోగించి రచించిన వర్ణచిత్రం
క్రమస్థ సర్వవ్యంజనం.
దీనికి భోజమహారాజు రచించిన
"సరస్వతీకంఠాభరణము"
శబ్దవివేచనం లోనిది ఉదాహరణ
చూడండి.

క: ఖగౌ ఘాఙ చిచ్ఛౌ జా ఝాఞ్ జ్ఞో2టౌఠీడడంఢణ:
తథోదధీ న్పఫర్బాభీర్మయో2రిల్వాశిషాంసహ:  (263)

(దేవతల సమూహముచేత పూజింపబడువాడును,
అజ్ఞానమును ఛేదించెడి ఓజస్సు గలవాడును,
శత్రుబలములను ఆరగించువాడును,
పండితుడును యుద్ధభటులను బాధించువారికి ప్రభువును,
అచంచలుడును, అంబుధులను పూరగించినవాడును,
భయములేనివాడును ఎవడు శత్రుసంహారకములైన
ఆశీస్సులను భరించెడి మయుడు(అనెడి దైత్యరాజు))

ఈ శ్లోకంలో
వరుస క్రమంలో
అన్ని హల్లులు వచ్చినవి.
కావున
ఇది క్రమస్థ సర్వవ్యంజనము.

Monday, April 27, 2020

ఆచార్య ఆత్రేయ


ఆచార్య ఆత్రేయ




సాహితీమిత్రులారా!

ఆచార్య ఆత్రేయగారి గురించి
ఆయన సాహిత్యంపై డాక్టరేట్ చేసిన
డా. తలతోటి పృధ్వీరాజ్ గారి మాటల్లో
విందాం -

Friday, April 24, 2020

వేషంబుల లోకమిద్ది వినుమా


వేషంబుల లోకమిద్ది వినుమా




సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకం నుండి
ఈ పద్యం గమనించండి -

ఆశా దీర్ఘము హ్రస్వము
భాసిల్లును దృష్టియెట్లు బరగెడునుసుమీ
దోషములు లేక నుండగ 
వేషంబుల లోకమిద్ది వినుమా యార్యా!

సంస్కృతంలో ఆశ(కోరిక) దీర్ఘాంతము
దీర్ఘం - గొప్పది, పొడవైనది
దృష్టి - చూపు ఇది హ్రస్వం పదం
హ్రస్వం - పొట్టిది, చిన్నది.

సంస్కృతంలో ఆశాశబ్దం దీర్ఘంతం, దృష్టిశబ్దం హ్రస్వాంతం.
ఈ శబ్దాలకు తగినట్లు బ్రహ్మదేవుడు మనిషికి ఆశను దీర్ఘంగాను
దృష్టిని చాల చిన్నగాను చేశాడు. ఇదొక విచిత్రమైత పరిస్థితి కాబట్టి
ఈ స్థితిలో లోకంలో ఆశాపరుడు దోషరహితుడుగా ఉండటం కష్టం.
 అందుచేత మనిషి ఆశకుపోక ఒకకొడికి నిలిచి త్యాగబుద్ధి కలిగి ఉండాలి
- అని భావం

Wednesday, April 22, 2020

ఆరుద్రగారితో.............7


ఆరుద్రగారితో.............7







సాహితీమిత్రులారా!



ఆరుద్రగారితో జి.వి.సుబ్రహ్మణ్యం గారు చేసిన ఇంటర్వూ

7  భాగాలలో చివరిది ఈ రోజు వీక్షించండి....................

Tuesday, April 21, 2020

ఆరుద్రగారితో.............6


ఆరుద్రగారితో.............6







సాహితీమిత్రులారా!



ఆరుద్రగారితో జి.వి.సుబ్రహ్మణ్యం గారు చేసిన ఇంటర్వూ

7  భాగాలలో ఆరవది ఈ రోజు వీక్షించండి....................

Monday, April 20, 2020

ఆరుద్రగారితో.............5


ఆరుద్రగారితో.............5







సాహితీమిత్రులారా!



ఆరుద్రగారితో జి.వి.సుబ్రహ్మణ్యం గారు చేసిన ఇంటర్వూ

7  భాగాలలో ఐదవది ఈ రోజు వీక్షించండి....................

Saturday, April 18, 2020

కవిచమత్కారం



కవిచమత్కారం 




సాహితీమిత్రులారా!

విద్వత్ప్రభువైన అనవేమారెడ్డిని
సంవత్సరానికొకసారి నాచనసోమనాథకవి
దర్శించేవారట. దర్శించి ఒక పద్యం చెప్పి
సన్మానం అందుకొనేవాడట.
ప్రతిరోజు ఆయనదగ్గరుండే కవులకు ఇది కన్నెర్రైంది.
 దీనితో రాజునకు లేనిపోని కొండేలు చెప్పారు.
విని విని ఒకసారి రాజుగారు సోమనకు కబురు పెట్టారు.
అప్పటికి 8 నెలలైంది. సోముడు రాజాజ్ఞప్రకారం వచ్చి
తన కవితా ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ ఒక కందంలో
కొంతభాగం చెప్పి మిగతా భాగాన్ని
అక్కడి కవులను పూరించమని,
నాలుగునెలల తరువాత తాను
విజయదశమినాడు మిగతా భాగాన్ని
పూరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ పద్యం-

కొంచెపు జగముల లోపల
సంచితముగ నీదు కీర్తి అనవేమనృపా
మించెను..........

అనవేముడు తమ గొప్పలు చెప్పుకున్న
కవులను పూరించమని అడిగితే
వారు చేయలేక పోయారట.  చేయలేకపోయారు
అనటంకంటె వారుచేసినవి రాజుకు
నచ్చలేదు అనవచ్చు. విజయదశమి రానే వచ్చింది.
సోమన వచ్చాడు పూరించాడు  ఆ పూరణ-

కొంచెపు జగముల లోపల
సంచితముగ నీదు కీర్తి అనవేమనృపా
మించెను కరి ముకురంబున 
పంచాక్షరి శివుడు హరిఁబ్రపంచము వోలెన్

(ఓ అనవేమనృపాలా! అద్దంలో ఏనుగు ఉన్నట్లుగా,
పంచాక్షరి మంత్రంలో శివుడు ఉన్నట్లుగా విష్ణువు
 ప్రపంచమంతా ఉన్నట్లుగా ఈ కొంచెపు లోకంలో
నీ కీర్తి మించింది.)