Thursday, November 30, 2023

సాహిత్యంలో దోమ

 సాహిత్యంలో దోమ




సాహితీమిత్రులారా!

    కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ! అన్నాడు మన మహాకవి శ్రీశ్రీ. అయినా మన కవుల కళ్ళు పడ్డాక జీవుడైనా, దేవుడైనా కిక్కురుమనకుండా వచ్చి ఏ పద్యంలోనో, శ్లోకంలోనో కూర్చోవలసిందే. మనుషులతో పాటు, పశువులు, పక్షులు, చెట్లు చేమలు, కొండలు గుట్టలు కూడా మన కవుల చేత వీరతాళ్ళు వేయించుకున్నాయి. కేవలం కొన్ని రోజుల పాటూ మాత్రమే బ్రతికే అల్పజీవులెన్నో మన కవుల పుణ్యమా అని చిర యశస్సును సంపాదించుకున్నాయి. అటువంటి ఘనతకెక్కిన జీవులలో ప్రధానమైనవి రెండు. మొదటిది నల్లి. రెండవది దోమ. 

    వెనకటికో కవిగారు నల్లి గొప్పతనం గురించి చెబుతూ శివుడద్రిని  శయనించుట - రవిచంద్రులు మింటనుంట - రాజీవాక్షుండవిరళముగ శేషునిపై పవళించుట - నల్లి బాధ పడలేక సుమీ అంటూ నల్లి ప్రయోజకత్వాన్ని పసందైన రీతిలో చెప్పుకొచ్చాడు. శివుడు మంచుకొండపై నివసించడానికి, సూర్యచంద్రులు నేలమీద కాకుండా ఆకాశంలో తిరగడానికి, విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకోవడానికి గల కారణం బుల్లి జీవైన ఈ నల్లికి భయపడేనట. ఒకప్పుడు అంతటి వైభోగంతో బ్రతికిన నల్లి కాలప్రవాహంలో తన అస్థిత్వాన్నే కోల్పోయే స్థితికి చేరుకుంది. పల్లెటూళ్ళ నులక మంచాలు, సినిమా ధియేటర్లలో పీలికల కుర్చీలు అంతరించిపోవడంతో వాటికి నిలువ నీడ కరువయ్యింది. 

    నల్లి సంగతి అలా ఉంటే.. ఆ నల్లికి వేలు విడిచిన చెల్లిలాంటి దోమ మాత్రం నాగరికతా పరిణామలను, పర్యావరణ మార్పులను తట్టుకుంటూ తమ జాతిని విస్తరింపజేసుకుంటూ సాగిపోతోంది. దాని ప్రఖ్యాతి ఎంత గొప్పది కాకపోతే మనం హస్తిమశకాతరం అంటూ ఏనుగు ప్రక్కన దోమను నుంచోబెట్టి మరీ పోలిక చెబుతాం. ఆ మాట అలా ఉంచితే.. అసలు సమానత్వం చూపించడంలో దోమని మించిన జీవి లేదు. పేదా గొప్పా భేదం లేకుండా ఎవరి చెంప వాళ్ళు వాయించుకునేలా చేయగల సామ్యవాద జీవి మన దోమ. గురించి మన సాక్షీ వ్యాసాల పానుగంటి వారు, హాస్యబ్రహ్మ భమిడిపాటి వారు ఏకరువు పెట్టిన మెచ్చుతునకలను ఈరోజు చెప్పుకుందాం. 

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Friday, July 21, 2023

ముద్రారాక్షసమ్ - చాణక్య

 ముద్రారాక్షసమ్ - చాణక్య 



సాహితీమిత్రులారా!

ఈరోజు మనం చెప్పుకోబోయేది సామాన్యమైన కథ కాదు. తన కోపంతో ఒక రాజవంశాన్ని పడగొట్టి, మరో రాజవంశాన్ని నిలబెట్టిన రాజనీతివేత్త కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన ఆ రాజనీతివేత్త మన చాణక్యుడు. ఆయనకు వచ్చిన కోపం ఎంతో బలమైన నందరాజ వంశాన్ని నాశనం చేసింది. ఆయనకు కలిగిన అనుగ్రహం సుస్థిరమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆయన రచించిన అర్థశాస్త్రం ఇప్పటికీ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచింది. అటువంటి చాణక్యుని రాజనీతిపై, అతని ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయన్న విషయంపై సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ గ్రంథమే ఈ ముద్రా రాక్షసమ్. ఈ గ్రంథ రచయిత విశాఖదత్తుడు. ఈ విశాఖదత్తుడు ఒక రాజవంశీయుడు. తన తాతగారు ఒక సామంతరాజనీ, తన తండ్రి ఒక మహరాజనీ ఆయన ఈ గ్రంథంలోనే చెప్పుకున్నాడు. ఇక ముద్రారాక్షసం కథలోకి వద్దాం. ఈ నాటకానికి వ్యాఖ్యానం చేసిన డుంఢిరాజు ఉపోద్ఘాతంతో కలిపి చెప్పుకుంటే మనకు కథ స్పష్టంగా అర్థమవుతుంది. 

ఇక ముద్రారాక్షసమ్ కథలోకి ప్రవేశిద్దాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Wednesday, July 12, 2023

పద్మబంధం

 పద్మబంధం




సాహితీమిత్రులారా!

నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి

దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి

పద్మబంధం

ఆస్వాదించండి-





Sunday, July 9, 2023

సప్తదళ గర్భ సీసం

 సప్తదళ గర్భ సీసం




సాహితీమిత్రులారా!

నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి

దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి

సప్తదళ గర్భ సీసం ఆస్వాదించండి-







Tuesday, July 4, 2023

నోరు తిరగని సరదా పద్యాలు

 నోరు తిరగని సరదా పద్యాలు



సాహితీమిత్రులారా!

తెలుగు భాషలో ఎన్నో చమత్కార పద్యాలున్నాయి. వాటిల్లో ఒకటి.. 

ఈరోజు చెప్పుకోబోయే న గుణింత అక్షరాలు మాత్రమే ఉండే ఏకాక్షరి పద్యం. ఇది Tongue twister లా ఉంటుంది. ఇది సరదాగా సాధన చేయండి. చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో కూడా చెప్పించండి. ఇటువంటి పద్యాలను కంఠస్థం చేయడం వల్ల మనకు నోరు బాగా తిరగడంతో పాటూ, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 Rajan PTSK గారికి ధన్యవాదాలు

Saturday, July 1, 2023

కుదిరిన సంధి

 కుదిరిన సంధి




సాహితీమిత్రులారా!



కుదిరిన సంధి(సరదాగా చేసిన ఓ చిన్న ప్రయత్నం)

ఆస్వాదించండి-


అతి+అంత, అత్యంత సుందరమైన రాజ్యం "యణా దేశం"!  మహా+ఉన్నతమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆ దేశపు మహారాజు "గుణ సంధుడు". దేశ+ఔన్నత్యం, దేశౌన్నత్యమే , ఏక +ఏక, ఏకైక లక్ష్యంగా తన రాజ్యాన్ని "వృద్ధి" చేశాడు అతడు. అటువంటి ఉన్నత సంస్కారం "కలవారి" ఇంట పుట్టినది, సౌందర్యంతో పాటు చక్కని గుణగణాలు "కలది" ఆ దేశపు యువరాణి "బహువ్రీహి" ! 

తన చుట్టూ "ఒకటి" కాదు, "రెండు" కాదు....అసంఖ్యాకమైన మిత్రులను ఏర్పరుచుకుని "ద్విగు మహారాజు" , పక్కనే ఉన్న "గసడదవా దేశాన్ని" రాజ్యము+చేయు, రాజ్యముసేయు చుండెను. ఆ దేశపు యువరాజు, అత్యంత పరాక్రమశాలి, చక్కటి శరీర+ఆకృతి, శరీరాకృతి కలిగి ఉండిన, సుందర+అతిసుందరుడు, సుందరాతిసుందరుడు అయిన  "సవర్ణ దీర్ఘ సుందరుడు", యణా దేశపు యువరాణి బహువ్రీహిని ప్రేమించాడు. 

ఓ విహార యాత్రలో సవర్ణ దీర్ఘ సుందరుడిని చూసి, తాను కూడా అతడిని మోహించింది, బహువ్రీహి! అదే విషయాన్ని మొదట+మొదట, మొట్టమొదట తన తల్లి అయిన "ఆమ్రేడిత" తో చెప్పింది. తండ్రి గుణ సంధుడు కూడా సంతోషంగా ఇందుకు ఒప్పుకుని, వారిరువురికీ వివాహం చెయ్యడానికి నిశ్చయించుకుని, అదే విషయాన్ని ద్విగు మహారాజుకి వర్తమానం పంపాడు. ద్విగు మహారాజు కూడా ఆనందంగా ఇందుకు ఒప్పుకున్నాడు. 

వారిద్దరి వివాహం ఖరారైన నేపథ్యంలో , బహువ్రీహి ప్రధాన  చెలికత్తె అయిన "ఉత్పలమాల" "భరనభభరవ... భళి భళి" అంటూ ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. "తాన తానన తాన తానన తాన తానన తాన తా" అంటూ "రస(జజ)భరితంగా" యువరాణి గుణ గణాలను గానం చేసింది...."మత్తకోకిల" ! 

ఇదిలా ఉండగా....

వజ్రము+గనులు, వజ్రపుగనులు, మిక్కుటంగా కలిగి, ప్రపంచము+అంగడి, ప్రపంచపు అంగడిలో వ్యాపార లావాదేవీలను జరుపుతూ, మిక్కిలి సంపన్న దేశంగా వెలుగొందుతోంది "పుంప్వా దేశం". ఈ పై వివాహ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకుని గట్టిగా నిడు+ఊర్పు, నిట్టూర్చాడు ఆ దేశపు చక్రవర్తి, " ద్విరుక్త టకారుడు" ! ఇది ససేమిరా తనకు నచ్చలేదు. బహువ్రీహి పై తనకు ఎప్పటి నుండో మోజు ఉంది. సమయం కోసం వేచి చూస్తున్న ద్విరుక్త టకారునికి, ఇదే సరైన సమయం అని తోచి...అహంకార గర్వంతో, బహు వ్రీహి ని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని, లేని పక్షాన "ద్వంద్వ"యుధ్ధానికి సిధ్ధం కమ్మని....తన వద్ద పనిచేసే అన్న-తమ్ముడు, అన్నదమ్ములు అయిన జయవిజయులను రాయబారానికి యణా దేశానికి పంపాడు. 

తాను ఒక్కడినే ద్విరుక్త టకారుని ఓడించడం కష్టమని, ద్వంద్వ యుద్దము లో ఓడిపోవడం ఖాయమని తలంచి యణా దేశపు రాజు గుణ సంధుడు, ద్విగు మహారాజు తో సమావేశం అయి పరిష్కారాన్ని కోరాడు. అందుకు ద్విగు మహారాజు ఒప్పుకుని, ఉత్తరాదిన ఉన్న తన మిత్రదేశాల రాజుల సహాయం కూడా కోర దలచి, అందరూ కలసి యుధ్దం చేస్తే ద్విరుక్త టకారుడిని జయించడం అంత కష్టమైన విషయం కాదని ఎంచి, ఉత్తర భారతానికి ప్రయాణం కట్టాడు ద్విగు మహారాజు. 

అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ, దారిలో వృద్ధురాలు,  పేద+ఆలు, పేదరాలు అయిన "రుగాగమ" ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు అభయమొసగి, తిరిగి ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతం చేరుకున్నాడు ద్విగు మహారాజు. 

"ఆ - ఈ - ఏ" అంటూ తన రాజ్యం లోనికి స్వాగతం పలికాడు "త్రిక సంధుడు" . విషయం విని తన మద్దతు ప్రకటించాడు. ఆ+కన్య, అక్కన్య వివాహం తమ చేతుల మీదుగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. 

సంధి కై ప్రయత్నించుదుము, సంధి కుదరని యెడల మనమెటుల ఊరడిల్లి+ ఉండు, ఊరడిల్లియుండగలము, కలసి పోరాడుదాం అంటూ "యడాగముడు" కూడా బదులిచ్చాడు. 

జగత్+నాటక, జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని అండ మనకి ఉండగా, ద్విరుక్త టకారుడిని దండించి తీరుదాం అని, పక్క దేశపు మహారాణి అయిన "అనునాసిక" తన మద్దతు తెల్పింది.

నా అంతః+ఆత్మ, అంతరాత్మ కూడా అదే చెబుతోంది అంటూ "విసర్గ" దేశపు పట్టపురాణి బదులు పలికింది. 

"అత్వ", "ఇత్వ", "ఉత్వ", "శ్చుత్వ", "జశ్త్వ" దేశాల రాజులు కూడా వంత పాడారు. 

అందరి మద్దతు కూడగట్టుకున్న ద్విగు మహారాజు మరియు గుణ సంధులు,  ద్విరుక్త టకారుడు భయము+పడె, భయపడేలా, నివ్వెరము+పాటు, నివ్వెరపాటు కి లోనయ్యేలా "పడ్వాదు"లను రాయబారానికి పంపి, ముందుగా సంధి ప్రయత్నం చేశారు.

విషయాన్ని గ్రహించిన ద్విరుక్త టకారుడు.... అన్ని దేశాల రాజులు కలసి తనపై యుధ్దం ప్రకటిస్తే, తనకు ముప్పు తప్పదని తెలుసుకున్నాడు. అంత బలగం ముందు తానొక చిరు+ఎలుక, చిట్టెలుక అని తెలుసుకుని, తాను ప్రతిపాదించిన విషయాన్ని వెనక్కి తీసుకుని,  సంధి కి ఒప్పుకున్నాడు! అంతే కాదు తన వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది అని గ్రహించి, తనకున్న వజ్రపు గనులలో కొన్నిటిని సవర్ణ దీర్ఘ సంధుడు-బహువ్రీహిల  పేరిట 

రాసిచ్చి, దగ్గరుండి వారిద్దరి వివాహాన్ని కూడా జరిపించాడు. 

అందరూ ఎంతో సంతోషించి, గట్టిగా చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు!! 

ఒరేయ్.... ! లే....ఏవిటా చప్పట్లు, నువ్వూనూ. తెలుగు పరీక్ష అనేసరికి ఎక్కడలేని కలవరింతలు, పలవరింతలూను. ముందుగానే కొంచెం చదువుకుని ఉండొచ్చుగా! తెల్లారి అయిదు కావస్తోంది...లే...లేచి కూచుని చదువుకో, తొమ్మిదింటికి పరీక్ష కి వెళ్ళాలి....! 

తల్లి కేకతో, ఆమె అటుగా వెళ్లిన తరువాత సందు చూసుకుని సంధులు పక్కన పెట్టి, తయారై పరీక్షల సందడి లో మునిగిపోయాడు తొమ్మిదో తరగతి చదువుతున్న సందేశ్! 


ఇది వైద్యంవారి వాట్సప్ నుండి -

Saturday, June 24, 2023

చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ ఛాయాచిత్రాలు

 చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ ఛాయాచిత్రాలు




సాహితీమిత్రులారా!

చిత్రకవితా సౌరభం - 

11 జూన్ 2023 నాడు 

కడప సి.పి.బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రంలో

జరిగిన పుస్తకావిష్కరణ ఛాయాచిత్రాలు

ఆస్వాదించండి-


ఆవిష్కర్త - చింతా రామకృష్ణారావు గారిని ఆహ్వానించిన ఛాయాచిత్రం
ఆహ్వానించిన వారు అలంకారం ఆదిత్య కుమార్, అలంకారం వసంతకుమార్


ఆవిష్కర్త - కందుల నాగేంద్ర వరప్రసాదు గారిని ఆహ్వానించిన ఛాయాచిత్రం
ఆహ్వానించిన వారు అలంకారం విజయ కుమార్, అలంకారం వసంతకుమార్
చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ


ఎడమ నుండి కుడికి - శారదాప్రసన్నగారు, మూల మల్లికార్జునరెడ్డిగారు, కందుల నాగేంద్ర వరప్రసాదుగారు, చింతా రామకృష్ణారావుగారు, భూతపురి గోపాలకృష్ణశాస్త్రిగారు, చింతకుంట శివారెడ్డిగారు, అలంకారం వేంకట రమణ రాజు గారు, అవధానం అమృతవల్లిగారు






Saturday, June 17, 2023

కందగీత గర్భ చంపకమాల

 కందగీత గర్భ చంపకమాల




సాహితీమిత్రులారా!

నండూరి బాపయ్యగారి

విఘ్నేశ్వర చరిత్రలోని

కందగీత గర్భ చంపకమాలను

ఆస్వాదించండి

చంపకమాలలో కందము, గీత పద్యాలను

ఇమిడ్చి వ్రాసిన పద్యం






Monday, June 5, 2023

చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ

 చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ




సాహితీమిత్రులారా!


చిత్రకవిత్వంలో ఇటువంటి గ్రంథం ఇంతవరకు రాలేదనే చెప్పాలి

శబ్దచిత్రం మీద మాత్రమే పూర్తిగా విశదీకరించిన గ్రంథం

అనేక భాషలలోని చిత్రకవిత్వ విశేషాలను ఇందులో వివరించడం జరిగింది

ఇది ఏ4 సైజులో 400 పుటలతో కూర్చబడినది. 

ఈ పుస్తకం కావలసిన 

వారు పుస్తకావిష్కరణ రోజున కొంటే 50 శాతం రాయితీతో అందిస్తున్నాము

అవకాశం ఉపయోగించుకోగలరు. పుస్తకం వెల - రు. 500/- రాయితీతో రు.250/-

పోస్టల్ చార్జీలు అదనం.

Tuesday, May 23, 2023

అవధాన కవితా సరస్వతి - రాళ్ళబండి కవితా ప్రసాద్

 అవధాన కవితా సరస్వతి - 

రాళ్ళబండి కవితా ప్రసాద్  




సాహితీమిత్రులారా!


 21- మే న అవధాన కవితా సరస్వతి  " *కీ.శే.రాళ్ళబండి కవితా ప్రసాద్* గారి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ చిరు వ్యాసం.....

                                                    *ఐ.చిదానందం*

--------------------------------------------------------------------

సహజంగా తాము ఆధునికులం అనీ భావించే కొందరు కవులు సంప్రదాయం అంటే అసహ్యించుకుంటారు. అదేదో గొంగళిపురుగును చూసీనట్లుగా చూస్తారు. కానీ ఆధునికం అనే మోజు తగ్గాక అందరు సంప్రదాయం అనుసరించాలిసిన వారే. ఎందుకంటే అతి ఆధునికం మేడిపండు లాంటిది. నిజానికీ సరిగ్గా అర్దం చేసుకుంటే సంప్రదాయం ఒక అందమైన సీతాకొకచిలుక. అలాంటి సంప్రదాయం దారి తప్పిన కాలం ఆధునికం. ఆధునిక కాలం లో సంప్రదాయం గా  ముఖ్యంగా అవధాన విద్యలో మంచి ప్రయోగాలు చేసిన కవి రాళ్లబండి వెంకట కవితా ప్రసాద్ గారు.

                                రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లా గంపలగూడెం మండలం నెమలి లో 21 మే 1961 లో జన్మించారు. ఎన్నో పదవులకు అలంకారంగా వున్న వీరూ వృత్తిరీత్యా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తో వీడదీయనీ అనుబంధం కలదు.వీరు చిన్నప్పటి నుంచే అష్టావధాన వ్యస్తాక్షరి ప్రజ్ఞలు అలవరుచుకొని ఎన్నో వందల అవధానాలు జయప్రదంగా నిర్వహించారు. ఆనాటి కాలంలోనే కాదు ఏనాటి కాలం లోనైనా అవధానం అనేది అంత సులువు కాదు. పేరు మోసిన మహా మహా పండితులకు సైతం ఇదీ కొరకుడుబడని విద్యయే. ఒక విధంగా చెప్పలంటే కొందరు సరస్వతి పుత్రులకు మాత్రమే ఇదీ సాధ్యం. అలాంటి  అవధానవిద్యలో రాణించడమే కాదు కొత్త కొత్త ధోరణులు ప్రవేశపెట్టారు.  అలాగే అవధానం లో సత్వాదానం ; నవరస అవధానం వంటి వివిధ అవధాన ప్రయోగాలు చెసారు రాళ్లబండి.

                      ఈ కిష్టమైన అవధాన విద్య పై సిద్దాంత వ్యాసాలు చాలా తక్కువగానే వచ్చాయనీ తెలుస్తుంది. ప్రధానమైన వాటిని చూస్తే...

1) తెలుగులో అవధాన ప్రక్రియ(1977- ఏయూ)- కే.కృష్ణమూర్తి

2) తెలుగులో అవధాన శిల్పం (1972-ఓయూ)- జే.బాలత్రిపుర సుందరి

3) తెలంగాణ కవులు అవధాన వికాసం(1997-ఓయూ) - జి. రఘు రాములు. 

                    వీటన్నింటి మధ్య రాళ్లబండి గారు సమర్పించిన సిద్దాంతం వ్యాసం 

" అవధాన విద్య - ఆరంభ వికాసాలు " (2006- ఓయూ) ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఆచార్య మసన చెన్నప్ప గారు పర్యవేక్షణలో వచ్చిన ఈ సిద్దాంత వ్యాసంలో అవధానుల గురించి సేకరించిన విషయాలు ; అవధానం పై చెప్పిన విషయాలు ఎన్నెన్నో పద్యాలున్నా ; ఎన్నో చెప్పదగిన విషయాలున్నా సిద్దాంత వ్యాసంకు తగిన విషయాలు తగిన పద్య రత్నాలను సమీకరించుకోవడం. అవధాన విద్య లో మెలుకువలు ; జాగ్రత్త లు సూచించడం వంటివి ఒక పరిశోధకుడిగా ; అవధానిగా ; విమర్శకుడిగా రాళ్ళబండి గారి విదగ్దతను ఈ సిద్దాంత వ్యాసం చాటి చెప్పుతుంది.

                    వీరి ఇతర రచనల విషయం కు వస్తే మరుగుపడుతున్న పద్య సంస్కృతి పైకి లేపి వెన్నుగా నిలుపుతు వీరు రాసిన రచన 

" పద్య మండపం ". ఇందులోని పద్యాలు వీరి కవితా శక్తీకీ ధారణ శుద్దికీ నిదర్శనాలు. విశేషమేమిటంటే ఇందులో చెప్పబడిన పద్యాలు చాలా వరకు రాళ్లబండి గారు ఆశువుగా చెప్పినవే.

           " పచ్చ పచ్చని కొండ! పసిడికాంతుల కొండ

             ఆర్తుల హృదయాల కండదండ

             సురులు తిరుగు కొండ

             ఝరులు పారేడు కొండ

             పురుషోత్తముని కాళ్ళ పూలదండ "

                    అంటూ అన్నమాచార్యులను తలపిస్తూ భక్తి తో రాసిన రచన " సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ " కాలం ఇప్పుడు చంధస్సు తప్పిన పద్యము అనీ చెప్పే వీరు వచన కవిత్వం లో కూడా తమ ప్రతిభను ప్రసరిస్తూ " ఒంటరి పూల బుట్ట " అనే కవితా సంపుటి వెలువరించారు. వీరి కవితలో కొన్నీ కవితలు చూస్తే...

                "  మొగ్గల్ని తుంచుకుంటూ

                   పోయేవాడికీ పూల సౌందర్యం

                   ఏలా దర్శనం అవుతుంది "            ( 1 )

                 " పురుగు నెత్తి మీదా

                   కిరీటాలున్న రాజ్యంలో

                   నేలంతా

                   చెదలు పాలిస్తాయి "                     ( 2 )

                 " నేను పువ్వును ప్రేమించాను

                   పరిమళమాయ్యాను

                   చేపను ప్రేమించాను

                   జలతరంగంమయ్యాను

                   పక్షిని ప్రేమించాను

                   పాటనై గాలిలో విహరించాను

                   మనిషి ని ప్రేమించాను

                   కన్నీటి చుక్కన్నెనాను "                 ( 3 )

                " జీవితాన్ని అంతగా ప్రేమించిన వాడికీ

                  మృత్యువొక మామూలు మాట

                   ప్రేమనే జీవితంగా భావించిన వాడికి

                  చావోక అర్ధం లేని పదం

                  అస్సలు జీవించడం అంటేనే

                  మృత్యువును ప్రేమించడం "           ( 4 )

                                 ఇలా వీరి ఒక్కోక్క కవిత ఒకో రంపపు కోత. కవిత్వం ఎంత భావోద్వేగం ; ఎంతటి సృజన వుంటుందో వీరి కవిత్వం చదివితే మనకు అర్ధం అవుతుంది.

                                   ఇలా సరళమైన భాషలో అల్ప అక్షరాలో అనల్ప అర్ద కవిత్వం రాసిన వీరి సాహిత్యం ను వ్యాఖ్యనిస్తే అదీ ఒక మంచి గ్రంధమవుతుంది. అవధాన రారాజుగా పేరొందిన వీరి సాహిత్యం పై ప్రస్తుతం పరిశోధన జరుగుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు మా ఆచార్యులు" డా.సూర్య ధనుంజయ్" గారి పర్యవేక్షణ లో మా పీజీ సీనియర్ విద్యార్థి మిత్రులు " యడవల్లి సైదులు "గారు  " రాళ్లబండి కవితా ప్రసాద్ గారి జీవితం సాహిత్యం" పై సమగ్ర పరిశోధన   చేస్తున్నారు.

                              పద్యాన్ని ధార శుద్దిగా ప్రవచించే శబ్దార్ద భావ శుద్ది పొందిన కవి రాళ్ళబండి కవితాప్రసాద్. వీరు జీవితాన్ని మన్నించారు.కాలాన్ని ప్రేమించారు.కవిత్వాన్ని ఆరాధించారు. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు 15 మార్చ్ 2015 లో పరమపదించారు. 

చివరిగా వారి కవితతోనే ముగిస్తూ....

                     " గడియారం

                       కాలం ఆత్మకథ చెప్పదు

                       సౌందర్యం

                       ప్రేమ కావ్యానికి కవర్ పేజీ కాదు

                       అలాగే కాలాన్ని ప్రేమించే మనిషికీ

                       మృత్యువు కూడా

                       చివరి మజిలీ కాదు "

                                             * ఐ.చిదానందం *

                                         తెలుగు రీసెర్చ్ స్కాలర్ 

                                      ఉస్మానియా యూనివర్సిటీ 

                                     చరవాణి - 8801444335

Friday, May 12, 2023

సప్తస్వర కందం

 సప్తస్వర కందం




సాహితీమిత్రులారా!



సంగీతంలోని స,రి,గ,మ,ప,ద,ని - అనే

7 హల్లులతో కూర్చిన పద్యం

ఇది చిత్ర గర్భ కవితా ప్రసూనాలు లో

వల్లభవఝల అప్పలనరసిహమూర్తి గారు

కూర్చినది -

సిరి సరి నీ సరి సరిగమ

సరిరా గమపదనిస సరి సారధిగనుమా

మురరిపు గురుపద, మగసరి

సరి, సరి పరమున్ - గిరిధరు, సరసపు మగనిన్


రసవత్తర ప్రభుడు, గిరిధరుడు, లక్ష్మిదేవి యొక్క పరముడు అగు శ్రీమహావిష్ణువునకు సరిగా గమియించువాడుగాని, సారధ్యము వహించువాడు గాని, ఆ మగసరియగు మురరిపుడు, గిరిధరుడు మాత్రమే అనగా తనకు తానే సాటి. వేరొకరు తనకి సరిపడరని భావం.

Tuesday, May 9, 2023

సప్తాక్షరీ కందము

 సప్తాక్షరీ కందము



సాహితీమిత్రులారా!



వల్లభవఝుల అప్పలనరసింహమూర్తి గారి

చిత్రగర్భకవితా ప్రసూనాలు గ్రంథం నుండి

సప్తాక్షరి కందం ఆస్వాదించండి-

మాయామయ జగమయ శివ

మా 'యగజ' - విజయ, జయమతి మముగావంగా

తీయగ వశమై, జవమై

మా యుతి, గతియై, మతియయి - మావశమగుతన్


ఓ పరమేశ్వరా! శివా! ఇది మాయ మయ జగత్తు, మా తల్లియగు చార్వత్మ విజయ జయ యగుచు మము రక్షింపగా, మధురముగా వశమై, మా శక్తి, యుతి, గతి, మతి యగుచు మా వశమగుగాక

అమ్మ కరుణ అనంతము

ఇందులో గ, జ, తి, మ, య,వ,శ - అనే 7 అక్షరాలను ఉపయోగించారు

Wednesday, May 3, 2023

గుజరాతీ చక్ర ప్రబంధ

 గుజరాతీ చక్ర ప్రబంధ




సాహితీమిత్రులారా!

గుజరాతీ కావ్య సరిత లోని

కావ్యవినోద తరంగలోని

చక్ర ప్రబంధ

ఆస్వాదించండి-






Monday, May 1, 2023

గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి

 గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి





సాహితీమిత్రులారా!


సంస్కృతంలో కొక్కొకుడు రతిశాస్త్రం అనేపేరున కామశాస్త్రం రచించాడు

దాన్ని కూచిరాజు ఎర్రన కొక్కోకం పేరున అనువదించాడు అందులో 

కృతిపతి కుంటముక్కల మల్లనమంత్రి అన్న గంగయామాత్యునిపై 

గూర్చిన పద్యం ఇది గమనించండి-


మాధవ మాధవ మాధవులకు సాటి

                       సౌందర్య విక్రమ సంపదలను

గోపాల గోపాల గోపాలు రకు జోడు

                      భోగసాహస కళా భోగములను

గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి

                       వర్ణ ప్రతాప పావన నిరూఢి

కుంభజ కుంభజ కుంభజులకు నీడు 

                        రణ తపస్సామర్ధ్య రాజసముల

నితర జనముల సరిపోల్చ నెట్లు వచ్చు

భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవముల

కుటిలరిపుమంత్రి హృద్వేది కుంటముక్ల

గంగయామాత్యునకు దాన కర్ణునకును


ఇందులో మొదటిపాదంలో 

1. మాధవ (వసంత ఋతువు) సొందర్యలోనూ

2. మాధవ (విష్ణుమూర్తి) విక్రమంలోనూ

3. మాధవ (ఇంద్రుని) సంపదలోనూ


రెండవపాదంలో-

1. గోపాల(కృష్ణుడు) భోగసాహసం అంటే పడగలమీద సాహసం(బహుశా)

    కాళీయవర్ధనం గంగనమంత్రి పరంగా బోగము, సాహసము

2. గోపాల(గొల్లవారు) కళ(పశువుల పోషించడం 64 కళల్లో ఒకటి) గంగయమంత్రి పరంగా 

     ముఖంలో కళ

3. గోపాల (రాజు) భోగంలోనూ


మూడవ పాదంలో -

1. గాంగేయ (బంగారు) వర్ణం రంగులో

2. గాంగేయ(భీష్ముడు) ప్రతాపంలో

3. గాంగేయుడు((కుమారస్వామి) పావనత్వంలో - కుమారస్వామి పరంగా పవన భక్షణలో, గంగయమంత్రి పరంగా బ్రాహ్మణత్వంలో

నాలుగవపాదంలో -

1. కుంభజ(ద్రోణుడు)రణంలోనూ

2. కుంభజ (వసిష్ఠుడు) తపస్సులోనూ

3. కుంభజ (అగస్త్యుడు) సామర్ధ్యములోనూ (అగస్తుడు సముద్రాన్ని తాగేశాడు. 

                                         వింధ్యపర్వతాన్ని శాసించాడు)వీళ్ళెవరూ నీకు సాటిరారు

అని చివరగా ముగించాడు.


Friday, April 28, 2023

గుజరాతీ కమల ప్రబంధ

 గుజరాతీ కమల ప్రబంధ




సాహితీమిత్రులారా!

కావ్యసరిత లోని

కావ్యవినోద తరంగలోని

కమల ప్రబంధ

ఆస్వాదించండి-






Sunday, April 23, 2023

గుజరాతీ కుసుమమాలా ప్రబంధ

 గుజరాతీ కుసుమమాలా ప్రబంధ




సాహితీమిత్రులారా!

కావ్యసరితలోని

కావ్యవినోద తరంగంలోని

కుసుమమాలా ప్రబంధ

ఆస్వాదించండి-



Thursday, April 20, 2023

గుజరాతీ ఛత్రబంధం

 గుజరాతీ ఛత్రబంధం



సాహితీమిత్రులారా!

గుజరాతీ గ్రంథం

కావ్యరసికా లోని

ఛత్రబంధం

ఆస్వాదించండి-





Tuesday, April 18, 2023

English Lecture on 'Chitra Kavyam' (by Sri Vedanta Desika)

 English Lecture on 'Chitra Kavyam' (by Sri Vedanta Desika) 




సాహితీమిత్రులారా!

English Lecture on 'Chitra Kavyam' (by Sri Vedanta Desika) - Dushyanth Sridhar & Sunil Gargyan

ఆస్వాదించండి-




Saturday, April 15, 2023

రీతికావ్యాలు

 రీతికావ్యాలు 




సాహితీమిత్రులారా!


హిందీ సాహిత్యంలో 17 - 18 శతాబ్దాలలో వెసిన శృంగార ప్రధామై, అలంకారిక శైలి, వర్ణనా బాహుళ్యం గల రచనలను రీతి కావ్యాలని చెబుతారు వీటినే రీతిశృంగార కావ్యాలు అని కూడ అంటారు. వామనుడు మొదలైన సంస్కృత అలంకారికులు చెప్పిన శైలీపరమైన రీతికి, రీతి కావ్యాలకు పోలికలేదు. ఇవి సంస్కృత, ప్రాకృతాలలో ఆస్థానకవులు ప్రభుల మనోల్లాసంకోసం రచించిన కావ్యాలవంటివి. తెలుగు ప్రబంధాల వంటివి. ఈ రీతి కావ్యాలు నాయికా నాయకులకు భేదాలతోను రసాద్యలంకార వర్ణనచేతను నిండి ఉండటంచేత, సంస్కృతలక్షణాలకు లక్ష్యాలుగా రచించినవి కావడం చేత, ప్రత్యేకమైన రచనా విధానం కల్గి ఉన్నందు వల్ల, రామచంద్రశుక్ల రీతి కావ్యాలని పేర్కొన్నారు. కొందరు వీటిని రీతిశృంగారకావ్యాలని నిర్వచించారు. తిరిగి ఈ రీతికావ్యాలను రీతిబద్ధకావ్యాలని, రీతిసిద్ధకావ్యాలని రెండువిభాగాలుగా చేశారు. కవి ఏదో ఒక అలంకారాన్ని మాత్రమే ప్రయోగిస్తూ వ్రాయబడినవి రీతిబద్ధకావ్యాలు.

రీతిసిద్ధకావ్యాలు అలాకాక కవి ఇష్టానికి రసవదలంకారాలతోవ్రాయబడిన వాటిని రీతిసిద్ధకావ్యాలంటారు.  రీతికావ్యాలు చాలా వరకు ముక్తపదగ్రస్త శైలిలో సాగటం గమనించదగింది.రీతికావ్యాల పంథాలో లేని ఇతర రచనలను రీతిముక్తకావ్యాలని అంటారు. ఈ కావ్యాలు శృంగారరస ప్రపధానమైగాథాసప్తశతివలె కథాత్మంగా సాగిపోతుంటాలి. నీహారీలాల్ వ్రాసిన సత్ సాయ్ రీతికావ్యలక్షణాలన్నీ కలిగిన కావ్యం రీతి కవులలో కొందరు ప్రముఖులైనారు

Wednesday, April 12, 2023

కల్పిత కల్పవల్లి - 13 విధాలుగా చదవ వచ్చు

 కల్పిత కల్పవల్లి - 13 విధాలుగా చదవ వచ్చు




సాహితీమిత్రులారా!

ప్రాచ్యలిఖిత భండాగారం మదరాసులో

డి.నెం. 3244 సంఖ్యగల దానిలో

కల్పిత కల్పవల్లి పేరున్నది ఒకటి

ఉన్నది దాన్ని సీసపద్యం, ద్విపద, చూర్ణిక, 

తిరునామం, రామకీర్తన, అష్టపది, భూపాళం,

జోలపాట, లాలిపాట, నివ్వాళిపాట, మంగళహారతి,

మంగళం, దర్వు - మొత్తం 13 విధాల చదవవచ్చు

ఈ కల్పిత కల్పవల్లి -




Sunday, April 9, 2023

అకార సహిత సర్వాక్షర గీతము

 అకార సహిత సర్వాక్షర గీతము




సాహితీమిత్రులారా!

శ్రీమదాంధ్ర చంపూరామాయణంలోని

అరణ్యకాండలోని

అకార సహిత సర్వాక్షర గీతము

గమనించండి ఇందులో

ప్రతి అక్షరం అకారంతో కూర్చబడినది

ఆస్వాదించండి-



Friday, April 7, 2023

అక్షరం మార్పుతో శివుడు విష్ణువయ్యే చిత్రమైన పద్యం

 అక్షరం మార్పుతో శివుడు విష్ణువయ్యే చిత్రమైన పద్యం




సాహితీమిత్రులారా!

ఒక ఊరిలో ఒక విష్ణుభక్తుడున్నాడు. ఒకనాడతనికి ఒక చిత్రమైన కోరిక పుట్టింది. నా చిన్నప్పటి నుండీ ఈ విష్ణు సహస్రనామం, జనార్థనాష్టకం, నారాయణకవచం, దామోదర స్తోత్రం ఇలా స్వామివారి పాత పాటలే పాడుకుంటూ గడిపేస్తున్నాను. స్వామివారిపై కొత్తగా ఒక చిన్న శ్లోకమైనా ఏ పండితుడితోనో నాకోసమే ప్రత్యేకంగా వ్రాయించుకుని, అది చదువుకుంటే ఎంత బావుంటుందో కదా! అనిపించింది. అతను ఏ ముహూర్తాన అనుకున్నాడో కానీ, అతనికారోజు విష్ణుమూర్తి గుడిలో ఒక సాధువు కనిపించాడు. వెంటనే ఇతగాడు ఆ సాధువు దగ్గరకు వెళ్లి నమస్కరించి, తన మనసులో కోరిక చెప్పాడు. ఆ ముని గంభీరముద్ర.. కాగితంపై ఒక శ్లోకం వ్రాసిచ్చాడు. పరమానందపడిపోయిన ఆ భక్తశిఖామణి ఆ శ్లోకాన్ని ఒకసారి బిగ్గరగా చదివి బిత్తరపోయాడు. ఆ శ్లోకం..

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Tuesday, April 4, 2023

పారిజాతాపహరణం - ద్వ్యక్షరి

 పారిజాతాపహరణం - ద్వ్యక్షరి




సాహితీమిత్రులారా!

నంది తిమ్మన గారి

పారిజాతాపహరణంలోని

రెండక్షరాల పద్యం -ద్వ్యక్షరి

ఆస్వాదించండి-

దీనిలో న, మ - అనే రెండు హల్లులతో

పద్యం కూర్చబడింది గమనించండి-








Sunday, April 2, 2023

పారిజాతాపహరణములోని అనులోమవిలోమకందం

 పారిజాతాపహరణములోని అనులోమవిలోమకందం




సాహితీమిత్రులారా!



నంది తిమ్మన కృత

పారిజాతాపహరణములోని అనులోమవిలోమకందం

పంచమఆశ్వాసంలోని 92 వ పద్యం

నారదుడు కృష్ణుని స్తుతించే సందర్భంలోనిది-

ఈ పద్యం మొదటి నుండి చివరికి చదివినా చివరనుండి మొదటికి చదినినా ఒకలాగే ఉంటుంది గమనించండి



Thursday, March 30, 2023

వేదాన్తదేశిక చరితమ్

 వేదాన్తదేశిక చరితమ్




సాహితీమిత్రులారా!

వేదాన్తదేశికుల చరిత్రమ్

సినిమా ఆస్వాదించండి-



Tuesday, March 28, 2023

సుశ్లోక రాఘవం

 సుశ్లోక రాఘవం





సాహితీమిత్రులారా!



సుశ్లోక రాఘవం

1సు శ్లోక= మంచి కీర్తిగల,రాఘవం=  రఘువంశ రాముడు.

  2సుశ్లోక=మంచి సంస్కృత పద్యాలు కలిగిన,లాఘవం=లఘువు

               (చిన్న చమత్కృతి)  {ర,ల-యోరభేదః}

   రచన:పంత విఠల, క్రీ.శ.1853     

కాలం: 19వశాతాబ్దప్రారంభంలోనూ ఉన్నాడు.

సుశ్లోక లా(రా)ఘవంలో 552 ముక్తక శ్లోకాలు కలిగిన రచన.ప్రతి

శ్లోకంకూడ శ్లేష చమత్కారంతో ఉంది. గ్రంథరచన పూర్తికాగానే కవిగారే నాగర

లిపిలో ముద్రణ వేయించినాడు.   ఈ పండితకవివర్యులు మహారాష్ట్రం

వారు.కరహాటక క్షేత్ర నివాసి., గీతా-మహాదేవుల పుత్రరత్నం.ఈ పండితకవి

శ్రీనివాసపండిత ప్రతినిధిధర్మ పరిషత్ లో ప్రధాన పండితవర్యులుగ ఉండినారని తెలియవస్తుంది.

   అన్నిటికిమించి శ్రీరామచంద్రమూర్తిని కులదైవతంగఆరాధించినభక్తితత్పరుడు

  ఈ కవిపండితవర్యుడు శృంగార, వేదాంత,వ్యాకరణ,ఆయుర్వేద,ఖగోళ, శకునశాస్త్ర,భాగవత పురాణాదులకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను విశేషంగ   ఈగ్రంథంలో  శ్లేషచమత్కా రంతో చెప్పినాడు. ఈ గ్రంథానికి పంతవిఠలుని శిష్యు డైన నారాయణులవారు "సద్భక్తి"అనే (శ్రుతలిఖిత)అనే వ్యాఖ్యను రచించి నాడు.

     ఈ వ్యాఖ్యను ఆధారంగ డా.ఆద రాసుపల్లి యజ్ఞరాములు,

                                              డా.కండ్లకుంట అలహసింగరాచార్యులు తెలుగు చేసినారు.

     ఈ గ్రంథాన్ని డా.పుల్లెల శ్రీరామచంద్రుడుగారి "ప్రస్తావన" తో---

     కీ.శే.బ్రహ్మశ్రీ కాసులవిశ్వనాథశాస్త్రి గారు,వారికుమారులు తెలుగులిపిలో

ఆగష్టు1993లో ప్రచురించినారు.

 సుశ్లోక లా(రా)ఘవంలోని మొదటి శ్లోకం---

అలంకృతి పరిష్కృతః  సురసభావన పండితః

ప్రణనష్టఖరదూషణః   ప్రథితచారువృత్త స్థితః l

ప్రమోదయతి యః సతః  సుగుణతః స్వకశ్లోకతః

 ప్రభూ రవికులాగ్రణీః  కవివరేణ్యవద్రాజతే ll

అలంకృతి పరిష్కృతః=

1.అలంకారభూషితుడు/          2.అలంకారశాస్త్రపండితుడు,

సురసభావనే పండితః=

1.దేవసమాజమును రక్షించువాడు 2.శృంగారాదిరసప్రయోగంలోపండితుడు

ప్రణనష్ట ఖరదూషణః=

1.ఖరదూషణులనుసంహరించినవాడు/

2.దుష్టులుచేయునిందలనుతొలగించువాడు,

ప్రథితచారు వృత్తస్థితః=

1.ప్రసిద్ధమైనమంచిశీలం కలవాడు,

2.శార్దూలాదివృత్తప్రయోగనిపుణుడు,

ప్రభూ రవికులాగ్రణీ కవివరేణ్యవ ద్రాజతే=

సత్పురుషులను సంతోషపరచునట్టి

1.సూర్యవంశశ్రేష్ఠుడైన రామచంద్రుడు,

2.కవిశ్రేష్ఠునివలె ,

                ప్రకాశిస్తున్నాడు.

                1.రవివంశ వర్యా!

                  2.సుకవి వర్యా !

వైద్యవేంకటేశ్వరాచార్యులు గారి సౌజన్యంతో

Saturday, March 25, 2023

అప్రస్తుత ప్రసంగి ప్రశ్నలు - కొంటె సమాధానాలు

 అప్రస్తుత ప్రసంగి  ప్రశ్నలు - 

కొంటె సమాధానాలు





సాహితీమిత్రులారా!

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి  అవధాని అంత కంటే కొంటెగా  సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను . 

ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?

జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .

ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది? 

జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .

ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ? 

జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .

ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?

జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు. 

ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది. 

జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’ 

ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు 

జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు 

ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?  

జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .

ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు? 

జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .

ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ? 

జవాబు :- ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .

ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు 

జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .

ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? 

జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .

ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?

జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. 

ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు 

జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను. 

ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .

ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా? 

జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .

ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?

జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .

ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?

జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .

ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? 

జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .

ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?

జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద. 

ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? 

జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .

ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?

జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .

ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు? 

జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’ 

ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? 

జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను. 

ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?

జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.

మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .

ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు

జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని

భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త 

ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?

జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .

ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? 

జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం


సంస్థానాలు సాహిత్యం ముఖపుస్తకం నుండి-


Thursday, March 23, 2023

చిత్రకావ్యం -4

 చిత్రకావ్యం -4




సాహితీమిత్రులారా!

ఈ వీడియోలో స్వర, వర్ణ, సర్వతోభద్ర

మొదలైన చిత్రాలను నందమోహన్ షైనీ గారు

వివరించారు ఆస్వాదించండి-



Monday, March 20, 2023

ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం

 ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం




సాహితీమిత్రులారా!

పుట్టపర్తిలో జరిగిన కవిసమ్మేళనంలో

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు

బాబాగారి ముంగిట చెప్పిన 

ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం

గమనించండి-





Friday, March 17, 2023

మహానాగ బంధం

 మహానాగ బంధం




సాహితీమిత్రులారా!

వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారి

మహానాగ బంధం

ఆస్వాదించండి- 





Wednesday, March 15, 2023

ద్వినాగ బంధం

 ద్వినాగ బంధం




సాహితీమిత్రులారా!

బండ్ల సుబ్రహ్మణ్య కవి గారి

ఆంధ్రాభ్యుదయం నుండి

ద్వినాగ బంధం - ఈశ్వర ప్రార్థన

గమనించండి-



Sunday, March 12, 2023

పుష్పమాలికా బంధం

 పుష్పమాలికా బంధం




సాహితీమిత్రులారా!

బండ్ల సుబ్రహ్మణ్య కవి గారి

ఆంధ్రాభ్యుదయం నుండి

పుష్పమాలికా బంధం

గమనించండి-






Thursday, March 9, 2023

విష్ణు సహస్రనామాలు ఎన్ని రకాలున్నాయి?

  విష్ణు సహస్రనామాలు ఎన్ని రకాలున్నాయి?




సాహితీమిత్రులారా!



విష్ణుసహస్రనామాలు మనకు మూడు విధాలైన విష్ణుసహస్రనామాలుఉన్నాయి.

అయితే-ఆ  మూడింటిలో  ఒకటి మాత్రమే

బహుళప్రచారప్రాచుర్యం పొందింది.

1.విష్ణుసహ్రనామస్తోత్రమ్:

శ్రీమహాభారతంలోని అనుశాసనిక పర్వంలోనిమోక్ష

ధర్మంలో  భీష్మ యుధిష్ఠిర సంవాదంగా

ఉండే విష్ణుసహస్రనామస్తోత్రం బహుళ

ప్రచారం పొందినది.

2.విష్ణుసహస్రనామస్తోత్రమ్: 

శ్రీపద్మ పురాణంలోని  ఉత్తరఖండంలో ఉమాపతి  నారదసంవాదంగ  కూడ  

విష్ణు సహస్రనామస్తోత్రం ఉంది.ఈ స్తోత్రం

మొదట పేర్కొన్న స్తోత్రంలా ప్రాచుర్యం

పొందలేదు.

3.విష్ణుసహస్రనామస్తోత్రమ్:

ఈ స్తోత్రం శ్రీగరుడపురాణంలోని పూర్వఖండంలో

ప్రథమాంశలోనిఆచారఖండంలోఉంది.

 వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో

Tuesday, March 7, 2023

పాదభ్రమకము

 పాదభ్రమకము




సాహితీమిత్రులారా!


గణపవరపు వేంకటకవి కృత

ప్రబంధరాజ వేంకటెశ్వర విజయవిలాసములోని

849వ పద్యం పాదభ్రమకము

ప్రతిపాదం ముందుకు వెనుకకు ఎలా చదివినా ఒకలాగే ఉండే పద్యం

గమనించగలరు -

మానుత ఘనౌఘ తనుమా

యానత సుజనావ భావ నాజ సుతనయా

దీనఖర పాద ఖన దీ

యాన విమదజయ విభావియజదమవినయా


Saturday, March 4, 2023

నాలుగక్షరాల నాలుక కదలని పద్యం

 నాలుగక్షరాల నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!



నాలుగక్షరాలతో కూర్చినది

చదివితే పెదాలు తగిలేది

నాలుక కదలని పద్యం ఇది-

దీనిలో ప,బ,భ,మ  అనే వ్యంజనాలతో కూర్చబడిది

పోకూరి కాశీపతిగారి సారంగధరీయంలోనిది ఈ పద్యం

గమనించండి - ఆస్వాదించండి-

మామమామపాప భీమమౌ ముప్పాపి

పాపమేపు మాపి బాముఁ బాపి

భూమిఁ బబ్బ మబ్బఁ బేము మమ్మోమమి

మేము బోము భామ మేమి భీమ

                                                              (సారంగధరీయము - 2- 127)

దీన్ని పెదవులతో పలుకుతాము కావున సోష్ఠ్యములతో కూర్చినది అంటాం.

అలాగే నాలుగక్షరాలతో కూర్చినది కావున చతురక్షరి అంటాము

అలాగే చదివేప్పుడు నాలుక కదలదు కావున అచలజిహ్వ అంటాం

దీనిలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి 

దీన్ని కూర్చిన పోకూరి కాశీపతిగారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి

Thursday, March 2, 2023

బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యస్వామి

 బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యస్వామి




సాహితీమిత్రులారా!


           ఆత్మకూరు సంస్థాన విద్వత్పండితకవివర్యులు

              బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం

                  శ్రీనివాసాచార్యస్వామివారు

                        (1863-1919)

****************************************

        శ్రీనివాసాచార్యులవారు శా.శ.౧౭౮౫ దుందుభి,చైత్ర- బహుళ నవమి నాడు(క్రీ.శ.1863) జన్మించినారు. వీరి

తిరునక్షత్ర తనియన్:

   శ్రీమద్దుందుభి చైత్రకృష్ణనవమీ పుచ్ఛే ధనిష్ఠర్షగే

   క్ష్మాపుత్రే శశినాసమం మకరగే మేషంగతే పూషణి,

   మందేచైవ తులాంశగే సతితులా లగ్నేవతీర్ణో౭జని

   శ్రీమాన్ బాలసరస్వతీ బిరుదభాక్ శ్రీశ్రీనివాసో గురుః .

పరమపదం: శా.శ.౧౮౪౧ సిద్ధాద్రి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి

    ( క్రీ.శ.1919)

     శ్రీమద్రామానుజ సిద్ధాన్త నిర్ధారణ సార్వభౌమ, సర్వతంత్ర

స్వతంత్ర ,కవితార్కికకంఠీరవ, శ్రీమద్రాజాధిరాజగురుసార్వభౌ

మేత్యాది బిరుదవిభ్రాజితమగు శ్రేష్ఠమైన ఆచార్యపురుషవంశ

మున  ఉద్భవించి,గజ  తురగ  ఛత్ర  చామరాందోళికా దివా ప్రదీప  శ్రీకాహళ  గౌరవ  

కాహళ మకరతోరణ  మయూర చ్ఛత్రాది గౌరవభాక్కులు "శ్రీమాన్ బాలసరస్వతీ శ్రీనివాసాచా

ర్యులవారు.     వీరు శఠమర్షణగోత్రీయులు.అపరవేదాన్తదేశిక శ్రీనివాసాచా ర్యులవారి(సురపురం)  

వంశీయులు.  వీరి  జనని  శేషాంబ, జనకుడు బుచ్చివేంకటాచార్యులు.వీరు ఆత్మకూరు సంస్థాన

ఆస్థాన ప్రధాన విద్వత్పండిత కవివర్యులుగ విరాజిల్లినారు.

    వీరు తన పదకొండవ ఏట తండ్రిదగ్గర సాహిత్యాది

గ్రంథాలను పూర్తి చేసి సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పడా నికి ప్రారంభించినారు.పదహారవఏట మైసూరులో శ్రీరంగనాథ

బ్రహ్మతంత్రపరకాలస్వామివారి దగ్గర తర్కవేదాన్తాలను అభ్య

సించారు.అక్కడే సజ్జయంతాతాచార్యులవారిదగ్గర ప్రాకృతాది

భాషలను నేర్చుకున్నారు.మైసూరు మహారాజా చామరాజేం

ద్రులవారు ఆచార్యలవారి ప్రతిభా పాండిత్యాలకు అబ్బురపడి

"బాలసరస్వతి" బిరుదంతో సత్కరించారు.శ్రీనివాసాచార్యుల

వారు కాశీలో స్వామిశాస్త్రిగారి దగ్గర అద్వైతవేదాన్తాన్ని,కైలాస

చంద్రశిరోమణి భట్టాచార్యుల దగ్గర న్యాయశాస్త్ర క్రోడాలనూ

జగదీశవిరచిత జాగదీశినీఅభ్యసించినారు.ఆ తర్వాత నవద్వీ   పాలలో  మీమాంసాశాస్త్రాన్నీ  ఆపోశనం  పట్టారు. నవద్వీప

పండితమండలివారు  ఆచార్యులవారికి  "తర్కతీర్థ"  బిరుద ప్రదానం చేసినారు.

   శ్రీనివాసాచార్యులవారు దర్భాంగ,జోథ్పూర్,బుందీదత్తియా,

గ్వాలియర్,కోటాంజరీ,ఇందూరు,ధారానగర్,జమ్మూ,కాశ్మీర్,

మొదలయిన  ఉత్తరభారత  సంస్థానాలలోనూ,   మైసూరు, బళ్లారి,కడప , పెనుగొండ ,తాడిపత్రి , ప్రొద్దుటూరు ,మద్రాసు,

బనగానిపల్లి మొదలయిన దక్షిణాది ప్రాంతాలలోనూ అనేక

శాస్త్రార్థవాదనలు,ఘంటాశత కవనాలు చేసి సరస్వతీ అవతా రులుగ కీర్తి గడించినారు. సమకాలీన సంస్కృత విద్వత్కవి

పండితులలో యావద్భారతదేశాన వీరి పేరు ఎరుగనివారు

ఆనాడు లేరనడంఅతిశయోక్తికాదని నాటిపండితుల రచనలు తెలియజేస్తున్నాయి.

   ఆచార్య బిరుదురాజురామరాజుగారు శ్రీనివాసాచార్యుల వారిని గురించి(పాటిబండ మాధవరాయ షష్టిపూర్తిసన్మాన సంచికలోని) ఒకవ్యాసంలో   "తిరుపతివేంకటకవులు ఆత్మ కూరు సంస్థానమునకు పోయి తదాస్థాన విద్వాంసులయిన

శ్రీనివాసాచార్యులతో   తలపడి  శాస్త్రవాదమున నోడిపోయిరి.

తిరుపతివేంకటకవులు తెలుగులో  శ్రీనివాసాచార్యులకన్న

మిన్నలైనను,సంస్కృతమున నాశుకవిత్వమును చెప్పుట

యందును, సమస్త  శాస్త్రవైదుష్యమునందును  శ్రీనివాసా చార్యులవారే మిన్నలు. ఆ వాస్తవమెరుగని కొందరు ఇటీవల

పత్రికలందును  గ్రంథములందును  శ్రీనివాసాచార్యులే పరా భూతులైనట్లు వ్రాయుట సత్యదూరము.కీర్తిశేషులను గురిం చిన సత్యాసత్యములు తెలియక,తెలిసికొన ప్రయత్నించక

సాహసోక్తులకుఆధునికులుపూనుకొనరాదని సప్రశ్రయముగ

కోరుచున్నాను" అని తెలిపినారు.ఆచార్య బిరుదురాజు రామ రాజుగారు ఈ వ్యాసాన్ని "మరుగునపడినమాణిక్యాలు" ,

"చరిత్రకెక్కని చరితార్థులు" అనే తమ వ్యాస సంపుటాలలో

కూడా చేర్చడం స్మరణీయం.

      రచనలు:శ్రీనివాసాచార్యులవారి ముద్రితాముద్రిత గ్రం థాలు అనేకం.వాటిలో అధికశాతం ఆత్మకూరు సీతారామ భూపాలుగారు ముద్రింపించారు, కాగా,అముద్రిత రచనల  కాగితప్రతులు  బాలసరస్వతిగారి మనుమడూ, నాకు  గురుతుల్యులూ, ఆత్మీయులూ అయిన  శ్రీమాన్ కవితార్కిక సింహాచార్యులవారి తిరుమాళిగలో భద్రముగాఉండేవి(ఇప్పటి  పరిస్థితి తెలియదు).తెలియవచ్చినంతలో బాలసరస్వతిగారి

రచనలు-

       వీరశైవ శిరస్తాడనం,        దుర్విగ్రహనిగ్రహం,

       నంజరాజచంపూకావ్యం,   తత్త్వమార్తాండప్రభాపటలం,

       కిరీటివేంకటాచార్యవిజయవైజయన్తీనాటకం,

       రాజవంశరత్నావళి(ఆత్మకూరు రాజులు, తెలుగు)

       రాజవంశరత్నావళీ(           ,,         ,సంస్కృతం)

       లక్ష్మీసరస్వతీ దండకావళీ,

       శ్రీ కురుమూర్తి శ్రీనివాస స్తోత్రావలీ,

       లక్ష్మీధ్యానసోపానం  ,శ్రీనివాసధ్యానసోపానం,

       శ్రీనివాస పంచాశత్, లక్ష్మీ పంచాశత్

       అష్టభాషలలోనూ కురుమూర్తిస్వామిస్తుతులు,

       ముకుందమాలా - తొలితెలుగువ్యాఖ్యానం,

       శ్రీకురుమూర్తి శ్రీనివాస సుప్రభాత స్తోత్రం

       స్తోత్రజాలం మొదలయిన రచనలు చాలా ఉన్నవి.

             శ్రీనివాసాచార్యులవారు ఘంటాశతగ్రంథాలను

అనర్గళంగా, అత్యాశువుగా, అష్టభాషలలో సమర్థవంతంగ

వివిధ సంస్థానాదులలో చెప్పినారు.తెలియవచ్చినంతలో

కాలానుక్రమంగా వారి ఘంటాశతగ్రంథకవనాలు-

              మైథిలీకల్యాణం: మిథిలారాజధాని దర్భాంగ

సంస్థానంలో ప్రభువు లక్ష్మీధరసింహగారి కాలాన క్రీ.శ.

1866అక్టోబర్8వతేదీనాడు అష్టభాషలలో చెప్పిన ఘంటా

శతకం ఇది.ఇక్కడి సంస్థాన విద్వత్ప్రభువు,విద్వద్వర్యులు

ఆచార్యులవారికి "కవితార్కికసింహ" బిరుదప్రదానం చేశారు.

ఈ బిరుదనామమే ఆచార్యులవారి పౌత్రునకు'కవితార్కికసిం

హాచార్య' అని పెట్టారు.    

              రుక్మిణీకల్యాణం: దీనికి భైష్మీపరిణయం అని

కూడా నామాంతరం. ధారానగర సంస్థానంలో తత్ప్రభువు

రాజేంద్రసింహ మరియు విద్వత్పండితమండలి సమక్షాన

చెప్పిన ఘంటాశతకం ఇది. ఈ ఘంటాశతగ్రంథ కవనం

క్రీ.శ.1888జనవరి2వ తేదినాడు చెప్పబడింది. ఈ సంస్థానంలో పండితులు బాలసరస్వతిగారిని శ్లోకాలలో

"కువలయామోదకర ద్విజరాజ"అంటూ శ్లేషలో ప్రశంసించి

నారు.

              దమయంతీస్వయంవరం:ఈ ఘంటాశతగ్రంథ

కవనం బళ్లారిలోచెప్పినారు.ధర్మవరంకృష్ణమాచార్యులవారు

ఈ ఘంటాశతావధాన  సభకు  అధ్యక్షులు. ఈ అవధానం 1895 డిశంబరు 31 నాడు జరిగింది.

               లేఖినీ,గంగాభివర్ణనం:ఆత్మకూరు సంస్థానంలో

ఆచార్యులవారికీ తిరుపతివేంకటకవులకూ సాహితీభండనం

జరిగింది.ఆసందర్భాన ఘంటాశతగ్రంథంగా లేఖినినీ గంగాభి

వర్ణననూ  చేయాలని  పండితులు కోరగా  ఘంటాశతగ్రంథ కవనంలో చొరవలేని తిరుపతికవులు మౌనం వహించగా

శ్రీనివాసాచార్యులవారు ఘటికాంతరాళంలో 15శ్లోకాలు

కలాన్నిగురించీ, 50 వసంత తిలకాలు‌ గంగను గురించీ

చెప్పారు.ఈ.  ఘంటాశతకం   క్రీ.శ.1887  మార్చిలో           ఆత్మకూరులో జరిగింది.

              వజ్రనాభచరితం: ప్రొద్దుటూరు పురప్రముఖులు,

విద్వాంసుల సమక్షంలో 1901 సెప్టంబరు 8వ తేదీనాడు

చెప్పబడిన ఘంటాశత గ్రంథం ఇది. సభాధ్యక్షులుగా విద్వత్సంపన్నుడూ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ అయిన బ్రహ్మశ్రీ

సి.సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఉన్నారు.

               ధూమశకటం:కడప పట్టణంలో1902 మార్చి

5వ తేదీనాడు విద్వత్సభలోఈ ఘంటాశతావధానంజరిగింది.

పురాణాంశాలయితే అలవోకగా చెప్పగలడని ఈ అంశాన్ని

ఇచ్చినారు. అయినా బాలసరస్వతిగారు నిర్ణీతసమయానికి

ముందే తమ శతావధానాన్ని పూర్తి చేశారు.

               సముద్రమథనం:1903మార్చి 20 తేదీనాడు

మద్రాసులోని పచ్చయ్యప్పకళాశాల సభాభవనంలో పుర ప్రముఖులు,సుప్రసిద్ధపండితుల సమక్షంలో జరిగిన

అవధానం ఇది. ఈ అవధానాల గురించి అలనాటి ప్రముఖ

ఆంధ్ర,ఆంగ్ల పత్రికలు విశేషంగా వార్తలను ప్రచురించాయి.  అవన్నీ నేను (ఈ వ్యాసకర్తను) సేకరించాను. 

                 బాలసరస్వతిగారి  ఘంటాశతావధానాలను

ఆ నాటి సంప్రసిద్ధ ఆయుర్వేదవైద్యులు పండిత డి.గోపాలాచా ర్యులవారు 1903లో ఆనంద ముద్రణాలయం-మద్రాసులో

ముద్రింపించినారు.

                 బాలసరస్వతివారు తమ అవధానసభలలో

అవధానాన్ని నిర్ణీత వ్యవధికన్నా చాలాముందుగానే అత్యాశువుగ  ముగించేవారట.సభలో ఉండిన ప్రముఖుల

కోరికమేరకు ఆధ్యాత్మి, విశిష్టాద్వైత, వేదాన్తాదులను గురించి

అనర్గళంగ ఉపన్యసించేవారు.సభలో  వివిధరంగాలలో ఉద్దండ పండితులైనవారు తర్క,మీమాంసా,సాంఖ్య, వేదాం తాలలో కొ్న్ని సందేహా లను వెలిబుచ్చి ఆచార్యులవారి నుండి సముచిత సమాధానాలను రాబట్టి, బహువిధాలుగ

బాలసరస్వతిగారిని ప్రశంసించేవారు. ఇవన్నిటికీ ఆ నాటి

పత్రికలు సాక్ష్యం పలుకుతున్నాయి.

            సమకాలీన సంస్కృతపండితులలో ఏనోట విన్నా

ఆచార్యులవారి ఘంటాశతావధానాల చర్చనే ఉండేదని నాడు కొందరు చెప్పిన మాటలు అక్షరంగా దర్శనమిస్తున్నాయి.

           బ్రహ్మామృతవర్షిణీ సభ:      శ్రీనివాసాచార్యులవారు

"బ్రహ్మామృతవర్షిణీసభ" అనే పేరున ఒక సంఘాన్ని స్థాపించి

నారు.దానికి  బాలసరస్వతిగారు అధ్యక్షులుగ,  వనపర్తి సంస్థాన ప్రధానవిద్వాంసులు ఆచార్యరంగాచార్యులవారు

ప్రధానకార్యదర్శిగ,గద్వాలసంస్థానం పేపలి చక్రవర్తి కొండమా

చార్యులుగారు నియత సభాకార్యదర్శిగ ఉన్నారు. "బ్రహ్మామృత వర్షిణి" పత్రిక శ్రీకురుమూర్తి శ్రీనివాస ముద్రాక్షర

శాల,శ్రీమదరచింతాత్మకూరుసంస్థానంలో ముద్రతమైనవి ఒకటి రెండు ప్రస్తుత వ్యాసకర్త దగ్గర ఉన్నవి.

        బ్రహ్మామృతవర్షణి సభవారు ఆత్మకూరుసంస్థానంలోనే

గాక (పాత )పాలమూరుజిల్లాలోనేగాక, రాయలసీమ ప్రాంతంలో కూడ అనేక సభలు సమావేశాలు నిర్వహించి

విద్యార్థులకు పరీక్షలుకూడా జరిపి విశిష్టాద్వైతాన్ని, ధర్మ ప్రచారాన్ని చేసేవారు.ప్రథమకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగా

సారావళీ సహిత శ్రీభాష్యం,పరమతభంగ సహిత శ్రీమద్రహస్య త్రయసారః అనేవాటిని పెట్టేవారు.ఉత్తీర్ణులయినవారికి25,

మధ్యములకు20,అధమస్థాయివారికి15రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు.ద్వితీయకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగ

శ్రీభాష్యం-ప్రథమాధ్యాయం , జిజ్ఞాసాదర్పణః,షష్ఠీదర్పణః.

ప్రథమ,ద్వితీయ,తృతీయస్థానం పొందిన విద్యార్థులకు

రూ15/-,రూ12/-, రూ10/-పారితోషికం. తురీయకక్ష్యకు

పాఠ్యాంశం-నీళాస్తుతి,స్తోత్రజాలం,హరి,గుణదర్పణః,సిద్ధాన్త

చిన్తామణి. పారితోషికం-రూ5/-,రూ3/-,రూ2/-ఇచ్చేవారు.

                       నిర్దిష్టమైన ప్రణాలికతో శ్రీవైష్ణవాన్ని  ప్రచారం చేసిన విద్వత్పండితులు బాలసరస్వతిగారు.

                         సంస్కృత భారతి కృతిరత్నహారంలో

చోటుచేసుకున్న విద్వద్రత్నం మ.న.జిల్లా సంస్థానసంజనిత

రత్నంకావడం మనందరకూ గర్వకారణం.

                          బాలసరస్వతిగారి మరుగునపడిన కృతిరత్నాలన్నీ  ఒకచోటగుదిగుచ్చి హారంగా అందించవలసి ఉంది.

                      

వైద్యం వేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో

Tuesday, February 28, 2023

రామసేతువు

 రామసేతువు





సాహితీమిత్రులారా!



రామసేతు. ఆనాడు రాముడు, అతని వానరసైన్యం శ్రీలంకకు నిర్మించిన రాతివంతెన. సీతమ్మ కోసం రావణుడిపై యుద్ధం చేసాడు, రాముడు. ఇప్పటి ధనుష్కోటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి సముద్రమార్గంలో అతి దగ్గరలో ఉన్న లంక భూభాగంలోకి వెళ్లాలి. అప్పుడే వానర వీరుల్లో ఒకరు, నిర్మాణ శాస్త్రంలో ఆరితేరిన నలుడు వారధి కట్టాడు. నలుడి ఆధ్వర్యంలో నీటిలో తేలే రాళ్లతో వంతెనకట్టారు, వానర వీరులు. రామసేతు లేకపోతే లంకపై యుద్ధమే లేదు. ఆ సేతువు వల్లే రామ రావణ యుద్ధం జరిగింది. రావణ సంహారం జరిగింది. సీతారాములు కలిశారు. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరలో ఉన్న ధనుష్కోటికి వెళితే, రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆనాడు సముద్రుడని శాంతించాలని రాముడు కోరాడు. ఇప్పటికీ ఆ శాంతి సముద్రం మనకు కనిపిస్తుంది. రామసేతు వైపు ఉన్న సముద్రంలో అసలు అలలే రావు. పక్కనే ఉన్న బంగాళాఖాతం మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అసలు, రామసేతు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగైదు ఏళ్ల క్రితమే నాసా డిస్కవరీ ఛానల్ పరిశోధకులు రామసేతు మీద రీసెర్చ్ చేశారు. ఆ సేతు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, మనుషులు కట్టినదే అని వారు తేల్చారు. సేతువు ఉన్నచోట ఉన్న రాళ్లు ఏడు వేల కిందటివి అని చెప్పారు.. ఇవి డిస్కవరీ ఛానల్ చెప్పిన వివరాలు. ఇన్నాళ్లు ఆ వారధి మనుషులు కట్టినది అని కొందరు వాదించేవారు. కానీ, వాల్మీకి రామాయణంలో ఆ వారధి ఎలా కట్టారు, ఏ రాళ్లు వాడారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. సైంటిస్టుల పరిశోధనలతో వాల్మీకిరామాయణంలో రామసేతు గురించి రాసిన ప్రతి అక్షరం నిజంగా జరిగినదేనని ఋజువయింది. తన లీలలకు సాక్ష్యాలుగా భగవంతుడు ఈ భూమి మీద కొన్ని రుజువులు వదిలే వెళ్తాడు. రామాయణం జరిగిందే అనడానికి రామసేతు ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేందుకు ఇప్పటికీ ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక సాక్ష్యం. భారతదేశంలో ఎక్కడ వరకు అంటే, పూర్వకాలంలో పెద్దలు, ఆ సేతు హిమాచలం అని చెప్పేవారు. ఇందులో, సేతువు అంటే రామసేతువు, హిమాచలం అంటే హిమాలయాలు అని అర్థం. త్రేతాయుగంలో జరిగిన రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించారు. సీతను అపహరించిన రావణుని వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక, సముద్రంపై వంతెన కట్టాలని అనుకుంటాడు, రాముడు. విశ్వకర్మ అంశతో పుట్టిన నలుని సహాయంతో సముద్ర జలాలపై తెలియాడే ఒక వంతెనను నిర్మించాడు. లక్షల మంది వానరుల సహాయంతో కట్టిన వారధి, అది. అలా కట్టిన వారిని ఆ తర్వాత తరాలు కూడా భారత శ్రీలంకల రాకపోకలకు ఉపయోగించాయి. శ్రీలంకలో బౌద్ధ వ్యాప్తికి బౌద్ధభిక్షువులు ఈ వంతెనను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.

 విభీషణుడు కాలం నుంచి భారత శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి రాముడే పునాది వేశాడు ఆ తర్వాత సముద్రమట్టాలు పెరిగి ఆ వంతెన క్రమంగా మునిగిపోయింది. విదేశీ పాలకుల సమయంలో ఆ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు.  బ్రిటిష్ చరిత్రకారులు మహా మేధావులు అని మన దేశంలో ఉన్న మన ఎంతోమంది చరిత్రకారుల నమ్మకం కదా. అసలు వంతెనే లేకపోతే ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన మన హిస్టారియన్లకు ఎందుకు రాలేదో! రామసేతు అనే ఐడెంటిటీ  చెడిపోవడానికి ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు, విదేశీ పాలకులు. కానీ, తరతరాలుగా రాముడు వేసిన దారిలో నడుస్తున్న భారతీయుల నోటి నుంచి ఏనాడూ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే మాట రాలేదు. ఇప్పటికి, ఎప్పటికీ ఆ వంతెన రామసేతు గానే మనసులో నిలిచిపోయింది, నిలిచిపోతుంది కూడా.

 నీటిలో మునిగిపోయి ఉన్న ఆ రాతి వంతెన ప్రస్తావన భారత పురాణాల, ఇతిహాసాల గ్రఃథాల్లో ఉంది. క్రీస్తుశకం 1480 వరకు ఆ వంతెనను అప్పటి తరాలు వాడుకున్నాయి ఆ తరువాత తుఫానులో సముద్ర అలలకు ఆ వంతెన దెబ్బతింది. సముద్రం క్రమక్రమంగా పెరిగింది. వంతెన నీటిలో మునిగింది. సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులను ఆ సేతువు ఇప్పటికీ ఆపుతుంది. ఆ మధ్య సునామీ వచ్చి చెన్నై నష్టపోయింది. ధనుష్కోటి ప్రక్కన ఉన్న పల్లెలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కారణం, రామసేతువు.  అలాంటి సేతువును తొలగించి భారతదేశ నౌకాయాన మార్గం చేద్దామని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సేతుసముద్రం అనే ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశాయి. కానీ, ఆ వంతెననించి ఒక రాయిని కూడా కదపలేకపోయారు. పెద్ద పెద్ద క్రేన్ లు కూడా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మూలన పడింది 

రామాయణం ప్రకారం త్రేతాయుగంలో ఈ రామసేతు నిర్మాణం జరిగింది. రామసేతు నిర్మాణ కాలం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. తమిళనాడులో రామేశ్వరం కన్నా ముందు వచ్చే రైలుస్టేషన్ పంబన్ దీవి.  అక్కడినుంచి శ్రీలంకలోని మన్నారుదీవి వరకు ఈ వంతెన ప్రస్తుతం కనిపిస్తోంది. విచిత్రమేమంటే, పాక్ జల సంధి, మన్నారు జలసంధులను ఈ రామసేతు విడదీస్తుంది. విచిత్రం ఏమంటే, ఈ రామసేతు ఉన్న ప్రాంతం అంతా సముద్రమట్టం మూడు నుంచి 30 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అదే లోతు ఉండడం ఆశ్చర్యం.

 దీని వెనుక రామాయణంలోనే కథ ఉంది రాముడు ఈ సేతును నిర్మించేటప్పుడు సముద్రుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. సేతువును నిర్మించేందుకు అనువుగా సముద్రుడు శాంతించాలని రాముడు కోరాడు. కానీ సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువపెడితే, సముద్రుడు భయపడి శాంతించాడని రామాయణంలో కథ. ఇప్పటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాల అద్భుత సంగమాన్ని ధనుష్కోట్లో చూడవచ్చు. ఒకవైపు సముద్రం ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు సముద్రం ఊరిని మింగేస్తుందా! అన్నట్టు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ధనుష్కోట్లో ఇప్పటికీ కనిపించే వింత అది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ రామసేతు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ధనుష్కోటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంకకు సముద్రపు దారి 50 కిలోమీటర్లు మాత్రమే. పడవల్లో ప్రయాణిస్తే, రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు ఆ దారిలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికీ రామసేతు పైకి కనిపిస్తుందని అంటారు. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ల అవశేషాలను ఇప్పటికీ ధనుష్కోటి ఒడ్డున చూడొచ్చు. రెండు చేతులతో ఎత్తడానికి వీల్లేనంతగా ఆ రాళ్లు బరువుగా ఉంటాయి. కానీ, నీటిలో వేస్తే మాత్రం, తేలుతూ ఉంటాయి  ఆ రాళ్లలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ వల్లే ఇలా జరిగినా, అలాంటి రాళ్ళను ఆ కాలంలో ఎలా కనిపెట్టారు అన్నది ఆశ్చర్యం. రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు ఆ రాళ్ళను ఎంపిక చేశారు అని కూడా చెప్పారు. రామేశ్వరం, ధనుష్కోట్లో ఎక్కడపడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను నీటిపై తేల్చి, మనకి అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉంటున్నాయి. కానీ, రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది .

15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి, దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవెల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినపుడు ఏర్పడిన రాళ్లు, లేదా, లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. కానీ, అలాంటి రాళ్లు ఒక ధనుష్కోటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి ఈ వంతెన ఏడువేల ఏళ్ళకు ముందు నుంచే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కార్బన్ డేటింగ్, ఇతర పరీక్షల్లో రామసేతు రామాయణం కాలం నాటిదే అని సైంటిస్టులు తేల్చారు. 1960లో నాసా ఒక సాటిలైట్ పిక్చర్ ని తీసింది. ధనుష్కోటి నుంచి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధి ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ వంతెనతో కూడిన శ్రీలంక ఒక కన్నీటి బిందువులా ఉందని కూడా నాసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2000వ  సంవత్సరంలో ఎన్డీవర్ షటిల్ రాడార్ మిషన్ లో భాగంగా తీసిన సాటిలైట్ ఫోటోలలో రామసేతు మరింత స్పష్టంగా కనిపించింది

 రామసేతు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీర ప్రాంతాన్ని తీరంలో ఖనిజ ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకి దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిలువలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే థోరియంలో 30% ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్ కలాంవంటివారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలనే సూచనలను చేసేవారు. 

2017లో రామసేతుపై డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారత శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు మానవ నిర్మితమేనని ఆ ఛానల్ రుజువు చేసింది. అలాగే, భారతీయదాసన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్ఎం రామస్వామి నేతృత్వంలో 2003లో ఒక బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం పంబన్ లలో సేతువుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడ బీచ్ లో భూమి, సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడ తీరప్రాంతాల వయస్సు రామాయణ కాలంతో సరిపోతుందని వారు తేల్చారు .కోరల్ వేవ్ స్  బదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదని కూడా వారు చెప్పారు.

 మరి రామాయణంలో ఈ సేతు గురించి ఏముంది ? వానరవీరులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు "నాపై సేతువు అని అతడే నిర్మించగలడు."ఆ సేతువుని నేను భరించగలను" అని సముద్రుడు రాముడికి చెప్పినట్టు రామాయణంలో శ్లోకాలు ఉంటాయి. సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసని, మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని అన్నాడు, నలుడు. శ్రీరాముడు సేతునిర్మాణనికి ఆజ్ఞాపిస్తే లక్షల మంది వానరవీరులు మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను తీసుకొచ్చి, సముద్ర తీరానికి తెచ్చారు. ఏనుగులంత ఎత్తున బండరాళ్లను పర్వతాలను పెకలించి, యంత్ర సాయంతో సముద్రతీరానికి చేర్చారు,  వానరులు. యంత్రం గురించి రామాయణంలో ఉంది. ఆ యంత్రం ఏంటో తెలియదు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభించాడు. వానరులు అంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. ఇంకొందరు దారికి అటు ఇటు కర్రలు పాతి వాటిని వరుస క్రమంలో గడ్డి పోచలను పెనవేసి కడుతున్నారు. ఏ రోజు ఎంత ఎంత దూరం కట్టారో కూడా, రామాయణంలో ఉంది. ఐదు రోజుల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ముగించారు. వానరులు. ఆరో రోజు సముద్రానికి అవతల ఉన్న లంకలో సువేల పర్వతానికి చేరుకున్నారని వాల్మీకి రామాయణం యుద్ధకాండలో 69 నుంచి 73 వరకు ఉన్న సర్గలు చెబుతున్నాయి. ఇలా రామాయణంలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు రామసేతును నిర్మించాడని యుద్ధకాండలో స్పష్టంగా ఉంది. ఈ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు దూరం ఉందని రామాయణం చెప్తుంది. యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్ళు ఆ లెక్కన ఎనిమిది వందల మైళ్ల దూరం ఈ సేతువును నిర్మించారని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు ఆధారాలుగా కనిపిస్తున్న రామసేతు 50 కిలోమీటర్లు. ఆ లెక్కన, మనం ఇప్పుడు చూస్తున్నది అసలు శ్రీలంకలో ఒక భాగం మాత్రమేనా? అసలు లంక సముద్రంలో మునిగిందా? అన్నది కూడా పరిశోధించాలి. పురాణాల్లో చెప్పిన లంకలో కొన్ని ఆనవాళ్లు మాత్రమే ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద్వారకలాగే అసలు లంక కూడా సముద్రంలో మునిగిందా? మునిగితే, ఎక్కడుంది? అన్నది పరిశోధించాలి. అలా లక్షల సంఖ్యలో వానరులు రామసేతుని నిర్మించారు. ఇంకా ఎన్నో మిస్టరీలు రామసేతులాగే సముద్రంలో మునిగిపోయాయి. మన భారతదేశ చరిత్రకు మూలమైన రెండు ప్రధాన సాక్ష్యాలు సముద్రంలో కలిసిపోయాయి. ఒకటి, తేతాయుగం నాటి రామసేతు. ఇంకొకటి, ద్వాపరయగంలోని శ్రీకృష్ణుడు నడిచిన నేల ద్వారక. ఈ రెండిటిని లోతుగా అధ్యయనం చేస్తే, ఇప్పుడున్న చరిత్ర పుస్తకాలను అన్నిటిని మార్చాల్సి వస్తుంది.రామసేతువు

రామసేతు. ఆనాడు రాముడు, అతని వానరసైన్యం శ్రీలంకకు నిర్మించిన రాతివంతెన. సీతమ్మ కోసం రావణుడిపై యుద్ధం చేసాడు, రాముడు. ఇప్పటి ధనుష్కోటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి సముద్రమార్గంలో అతి దగ్గరలో ఉన్న లంక భూభాగంలోకి వెళ్లాలి. అప్పుడే వానర వీరుల్లో ఒకరు, నిర్మాణ శాస్త్రంలో ఆరితేరిన నలుడు వారధి కట్టాడు. నలుడి ఆధ్వర్యంలో నీటిలో తేలే రాళ్లతో వంతెనకట్టారు, వానర వీరులు. రామసేతు లేకపోతే లంకపై యుద్ధమే లేదు. ఆ సేతువు వల్లే రామ రావణ యుద్ధం జరిగింది. రావణ సంహారం జరిగింది. సీతారాములు కలిశారు. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరలో ఉన్న ధనుష్కోటికి వెళితే, రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆనాడు సముద్రుడని శాంతించాలని రాముడు కోరాడు. ఇప్పటికీ ఆ శాంతి సముద్రం మనకు కనిపిస్తుంది. రామసేతు వైపు ఉన్న సముద్రంలో అసలు అలలే రావు. పక్కనే ఉన్న బంగాళాఖాతం మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అసలు, రామసేతు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగైదు ఏళ్ల క్రితమే నాసా డిస్కవరీ ఛానల్ పరిశోధకులు రామసేతు మీద రీసెర్చ్ చేశారు. ఆ సేతు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, మనుషులు కట్టినదే అని వారు తేల్చారు. సేతువు ఉన్నచోట ఉన్న రాళ్లు ఏడు వేల కిందటివి అని చెప్పారు.. ఇవి డిస్కవరీ ఛానల్ చెప్పిన వివరాలు. ఇన్నాళ్లు ఆ వారధి మనుషులు కట్టినది అని కొందరు వాదించేవారు. కానీ, వాల్మీకి రామాయణంలో ఆ వారధి ఎలా కట్టారు, ఏ రాళ్లు వాడారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. సైంటిస్టుల పరిశోధనలతో వాల్మీకిరామాయణంలో రామసేతు గురించి రాసిన ప్రతి అక్షరం నిజంగా జరిగినదేనని ఋజువయింది. తన లీలలకు సాక్ష్యాలుగా భగవంతుడు ఈ భూమి మీద కొన్ని రుజువులు వదిలే వెళ్తాడు. రామాయణం జరిగిందే అనడానికి రామసేతు ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేందుకు ఇప్పటికీ ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక సాక్ష్యం. భారతదేశంలో ఎక్కడ వరకు అంటే, పూర్వకాలంలో పెద్దలు, ఆ సేతు హిమాచలం అని చెప్పేవారు. ఇందులో, సేతువు అంటే రామసేతువు, హిమాచలం అంటే హిమాలయాలు అని అర్థం. త్రేతాయుగంలో జరిగిన రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించారు. సీతను అపహరించిన రావణుని వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక, సముద్రంపై వంతెన కట్టాలని అనుకుంటాడు, రాముడు. విశ్వకర్మ అంశతో పుట్టిన నలుని సహాయంతో సముద్ర జలాలపై తెలియాడే ఒక వంతెనను నిర్మించాడు. లక్షల మంది వానరుల సహాయంతో కట్టిన వారధి, అది. అలా కట్టిన వారిని ఆ తర్వాత తరాలు కూడా భారత శ్రీలంకల రాకపోకలకు ఉపయోగించాయి. శ్రీలంకలో బౌద్ధ వ్యాప్తికి బౌద్ధభిక్షువులు ఈ వంతెనను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.

 విభీషణుడు కాలం నుంచి భారత శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి రాముడే పునాది వేశాడు ఆ తర్వాత సముద్రమట్టాలు పెరిగి ఆ వంతెన క్రమంగా మునిగిపోయింది. విదేశీ పాలకుల సమయంలో ఆ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు.  బ్రిటిష్ చరిత్రకారులు మహా మేధావులు అని మన దేశంలో ఉన్న మన ఎంతోమంది చరిత్రకారుల నమ్మకం కదా. అసలు వంతెనే లేకపోతే ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన మన హిస్టారియన్లకు ఎందుకు రాలేదో! రామసేతు అనే ఐడెంటిటీ  చెడిపోవడానికి ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు, విదేశీ పాలకులు. కానీ, తరతరాలుగా రాముడు వేసిన దారిలో నడుస్తున్న భారతీయుల నోటి నుంచి ఏనాడూ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే మాట రాలేదు. ఇప్పటికి, ఎప్పటికీ ఆ వంతెన రామసేతు గానే మనసులో నిలిచిపోయింది, నిలిచిపోతుంది కూడా.

 నీటిలో మునిగిపోయి ఉన్న ఆ రాతి వంతెన ప్రస్తావన భారత పురాణాల, ఇతిహాసాల గ్రఃథాల్లో ఉంది. క్రీస్తుశకం 1480 వరకు ఆ వంతెనను అప్పటి తరాలు వాడుకున్నాయి ఆ తరువాత తుఫానులో సముద్ర అలలకు ఆ వంతెన దెబ్బతింది. సముద్రం క్రమక్రమంగా పెరిగింది. వంతెన నీటిలో మునిగింది. సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులను ఆ సేతువు ఇప్పటికీ ఆపుతుంది. ఆ మధ్య సునామీ వచ్చి చెన్నై నష్టపోయింది. ధనుష్కోటి ప్రక్కన ఉన్న పల్లెలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కారణం, రామసేతువు.  అలాంటి సేతువును తొలగించి భారతదేశ నౌకాయాన మార్గం చేద్దామని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సేతుసముద్రం అనే ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశాయి. కానీ, ఆ వంతెననించి ఒక రాయిని కూడా కదపలేకపోయారు. పెద్ద పెద్ద క్రేన్ లు కూడా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మూలన పడింది 

రామాయణం ప్రకారం త్రేతాయుగంలో ఈ రామసేతు నిర్మాణం జరిగింది. రామసేతు నిర్మాణ కాలం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. తమిళనాడులో రామేశ్వరం కన్నా ముందు వచ్చే రైలుస్టేషన్ పంబన్ దీవి.  అక్కడినుంచి శ్రీలంకలోని మన్నారుదీవి వరకు ఈ వంతెన ప్రస్తుతం కనిపిస్తోంది. విచిత్రమేమంటే, పాక్ జల సంధి, మన్నారు జలసంధులను ఈ రామసేతు విడదీస్తుంది. విచిత్రం ఏమంటే, ఈ రామసేతు ఉన్న ప్రాంతం అంతా సముద్రమట్టం మూడు నుంచి 30 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అదే లోతు ఉండడం ఆశ్చర్యం.

 దీని వెనుక రామాయణంలోనే కథ ఉంది రాముడు ఈ సేతును నిర్మించేటప్పుడు సముద్రుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. సేతువును నిర్మించేందుకు అనువుగా సముద్రుడు శాంతించాలని రాముడు కోరాడు. కానీ సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువపెడితే, సముద్రుడు భయపడి శాంతించాడని రామాయణంలో కథ. ఇప్పటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాల అద్భుత సంగమాన్ని ధనుష్కోట్లో చూడవచ్చు. ఒకవైపు సముద్రం ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు సముద్రం ఊరిని మింగేస్తుందా! అన్నట్టు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ధనుష్కోట్లో ఇప్పటికీ కనిపించే వింత అది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ రామసేతు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ధనుష్కోటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంకకు సముద్రపు దారి 50 కిలోమీటర్లు మాత్రమే. పడవల్లో ప్రయాణిస్తే, రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు ఆ దారిలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికీ రామసేతు పైకి కనిపిస్తుందని అంటారు. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ల అవశేషాలను ఇప్పటికీ ధనుష్కోటి ఒడ్డున చూడొచ్చు. రెండు చేతులతో ఎత్తడానికి వీల్లేనంతగా ఆ రాళ్లు బరువుగా ఉంటాయి. కానీ, నీటిలో వేస్తే మాత్రం, తేలుతూ ఉంటాయి  ఆ రాళ్లలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ వల్లే ఇలా జరిగినా, అలాంటి రాళ్ళను ఆ కాలంలో ఎలా కనిపెట్టారు అన్నది ఆశ్చర్యం. రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు ఆ రాళ్ళను ఎంపిక చేశారు అని కూడా చెప్పారు. రామేశ్వరం, ధనుష్కోట్లో ఎక్కడపడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను నీటిపై తేల్చి, మనకి అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉంటున్నాయి. కానీ, రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది .

15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి, దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవెల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినపుడు ఏర్పడిన రాళ్లు, లేదా, లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. కానీ, అలాంటి రాళ్లు ఒక ధనుష్కోటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి ఈ వంతెన ఏడువేల ఏళ్ళకు ముందు నుంచే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కార్బన్ డేటింగ్, ఇతర పరీక్షల్లో రామసేతు రామాయణం కాలం నాటిదే అని సైంటిస్టులు తేల్చారు. 1960లో నాసా ఒక సాటిలైట్ పిక్చర్ ని తీసింది. ధనుష్కోటి నుంచి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధి ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ వంతెనతో కూడిన శ్రీలంక ఒక కన్నీటి బిందువులా ఉందని కూడా నాసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2000వ  సంవత్సరంలో ఎన్డీవర్ షటిల్ రాడార్ మిషన్ లో భాగంగా తీసిన సాటిలైట్ ఫోటోలలో రామసేతు మరింత స్పష్టంగా కనిపించింది

 రామసేతు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీర ప్రాంతాన్ని తీరంలో ఖనిజ ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకి దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిలువలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే థోరియంలో 30% ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్ కలాంవంటివారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలనే సూచనలను చేసేవారు. 

2017లో రామసేతుపై డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారత శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు మానవ నిర్మితమేనని ఆ ఛానల్ రుజువు చేసింది. అలాగే, భారతీయదాసన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్ఎం రామస్వామి నేతృత్వంలో 2003లో ఒక బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం పంబన్ లలో సేతువుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడ బీచ్ లో భూమి, సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడ తీరప్రాంతాల వయస్సు రామాయణ కాలంతో సరిపోతుందని వారు తేల్చారు .కోరల్ వేవ్ స్  బదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదని కూడా వారు చెప్పారు.

 మరి రామాయణంలో ఈ సేతు గురించి ఏముంది ? వానరవీరులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు "నాపై సేతువు అని అతడే నిర్మించగలడు."ఆ సేతువుని నేను భరించగలను" అని సముద్రుడు రాముడికి చెప్పినట్టు రామాయణంలో శ్లోకాలు ఉంటాయి. సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసని, మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని అన్నాడు, నలుడు. శ్రీరాముడు సేతునిర్మాణనికి ఆజ్ఞాపిస్తే లక్షల మంది వానరవీరులు మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను తీసుకొచ్చి, సముద్ర తీరానికి తెచ్చారు. ఏనుగులంత ఎత్తున బండరాళ్లను పర్వతాలను పెకలించి, యంత్ర సాయంతో సముద్రతీరానికి చేర్చారు,  వానరులు. యంత్రం గురించి రామాయణంలో ఉంది. ఆ యంత్రం ఏంటో తెలియదు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభించాడు. వానరులు అంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. ఇంకొందరు దారికి అటు ఇటు కర్రలు పాతి వాటిని వరుస క్రమంలో గడ్డి పోచలను పెనవేసి కడుతున్నారు. ఏ రోజు ఎంత ఎంత దూరం కట్టారో కూడా, రామాయణంలో ఉంది. ఐదు రోజుల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ముగించారు. వానరులు. ఆరో రోజు సముద్రానికి అవతల ఉన్న లంకలో సువేల పర్వతానికి చేరుకున్నారని వాల్మీకి రామాయణం యుద్ధకాండలో 69 నుంచి 73 వరకు ఉన్న సర్గలు చెబుతున్నాయి. ఇలా రామాయణంలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు రామసేతును నిర్మించాడని యుద్ధకాండలో స్పష్టంగా ఉంది. ఈ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు దూరం ఉందని రామాయణం చెప్తుంది. యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్ళు ఆ లెక్కన ఎనిమిది వందల మైళ్ల దూరం ఈ సేతువును నిర్మించారని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు ఆధారాలుగా కనిపిస్తున్న రామసేతు 50 కిలోమీటర్లు. ఆ లెక్కన, మనం ఇప్పుడు చూస్తున్నది అసలు శ్రీలంకలో ఒక భాగం మాత్రమేనా? అసలు లంక సముద్రంలో మునిగిందా? అన్నది కూడా పరిశోధించాలి. పురాణాల్లో చెప్పిన లంకలో కొన్ని ఆనవాళ్లు మాత్రమే ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద్వారకలాగే అసలు లంక కూడా సముద్రంలో మునిగిందా? మునిగితే, ఎక్కడుంది? అన్నది పరిశోధించాలి. అలా లక్షల సంఖ్యలో వానరులు రామసేతుని నిర్మించారు. ఇంకా ఎన్నో మిస్టరీలు రామసేతులాగే సముద్రంలో మునిగిపోయాయి. మన భారతదేశ చరిత్రకు మూలమైన రెండు ప్రధాన సాక్ష్యాలు సముద్రంలో కలిసిపోయాయి. ఒకటి, తేతాయుగం నాటి రామసేతు. ఇంకొకటి, ద్వాపరయగంలోని శ్రీకృష్ణుడు నడిచిన నేల ద్వారక. ఈ రెండిటిని లోతుగా అధ్యయనం చేస్తే, ఇప్పుడున్న చరిత్ర పుస్తకాలను అన్నిటిని మార్చాల్సి వస్తుంది.

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో