అసలు పదమేదో తెలపండి
సాహితీమిత్రులారా!
ఈ పొడుపుపద్యం విప్పండి-
పదము చెెలునొందు నక్షరపంచకమున
మొదలు వదలిన "ముంగిస" పొదలు, దాని
తలనరికి వేయ "వంశంబు" నిలిచి యుండు
అసలు పదమేదొ తెలియుడీ రసికులార
సమాధానం - ఇనకులము
దీనిలో మొదటి అక్షరం తీసివేసిన - నకులము (ముంగిస)
నకులంలో మొదటి అక్షరం తీసివేసిన - కులము(వంశము)
1 comment:
ముంగిస: నకులము
Post a Comment