వర్ణచ్యుతచిత్రం (హిందీ)
సాహితీమిత్రులారా!
అమీర్ ఖస్రూ - వర్ణచ్యుతకం(హిందీ) చూడండి-
ఆది కటే తే సబకో సాలై - మధ్య కటే తే సబకో శాలై
అన్త కటేతే సబకో మీఠా - సో ఖుసరోగై ఆంఖేఁదీఠా
ఆదివర్ణం తొలగిస్తే అది అందరిని రక్షిస్తుంది
మధ్యాక్షరం తొలగిస్తే అది కాలాన్ని చెబుతుంది
చివరి అక్షరం తొలగిస్తే అది తియ్యదనాన్ని చెబుతుంది
ఆ పదం ఏదో చెప్పండి-
సమాధానం - కాజల
దీనిలో మొదటి అక్షరం తీసివేస్తే - జల ఇది అందరినీ రక్షిస్తుంది
మధ్య అక్షరం తీసివేస్తే - కాల ఇది సమయం, యముడు మొదలైనవి
చివరి అక్షరం తీసివేస్తే - కాజ ఇది ఒక తీపి పదార్థం ఇంకావేరే అర్థాలున్నాయి
No comments:
Post a Comment