పెదిమలు తగలని నాలుక మాత్రమే
కదిలే పద్యం
సాహితీమిత్రులారా!
పలికేప్పుడు పెదిమలు తగలని అక్షరాలతో
నాలుక మాత్రమే కదిలే పద్యం దీన్ని
నిరోష్ఠ్యాచలజ్జిహ్వము అంటాము. ఇక్కడ
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని 832వ
పద్యాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గమనించండి-
సగ్విణి వృత్తంలో కూర్చబడినది-
ఇది 832వ దండకంలో గర్భితమైన పద్యం
అంటే విడిగా ఈ పద్యం కనిపించదు మనం
ఇక్కడ విడిగా వ్రాసుకుంటున్నాం గమనించగలరు
నారదారాధనా నారతాహ్లాదితా
నీరదాశీల సన్నీల తేజః శ్రితా
సార దైత్యచ్ఛిదా చండ చక్రాంచితా
శ్రీ రసాలంకృతా శేషశైలస్థితా
గమనించండి దీనిలో ప,ఫ,బ,భ,మ - లు లేవు
పలికితే నాలుక మాత్రమే కదులుతుంది
2 comments:
ఇది చదువుతున్నప్పుడు నాకు స్వర్గీయ సుష్మా స్వరాజ్ సంస్కృతం గురించి ఇచ్చిన ఒక ప్రసంగం గుర్తుకువచ్చింది. దాని లింకు ఇచ్చాను. 6 నిమిషాల 30 సెకండ్ల వద్ద ఆ భాగము వుంది.
https://youtu.be/LuoJ2SK0m9g
కొమాండూరి శేషాచారిగారికి
ధన్యవాదాలు
మీరు చిత్రకవితా ప్రపంచం బ్లాగును ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు
Post a Comment