గొలుసుకట్టు పొడుపు కత
సాహితీమిత్రులారా!
పొడుపులోని చివరి పదం రెండవ పొడుపులో
రావడం గొలుకట్టు పొడుపుకత
దీనిలో గమనించండి-
జోడు నిట్రాళ్లు
నిట్రాళ్లమీద కుడితిగోలెం
కుడితిగోలెంపైన పొన్నకాయ
పొన్నకాయమీద గరికపోచలు
గరికపోచలపూన గాడిదపిల్లలు నాట్యమాడుతున్నాయి
దీనికి విడుపు చెప్పండి-
పొడుపు విడుపు
జోడు నిట్రాళ్లు ---------------- కాళ్లు
నిట్రాళ్లమీద కుడితిగోలెం ------ పొట్ట
కుడితిగోలెంపైన పొన్నకాయ --- తల
పొన్నకాయమీద గరికపోచలు --- జుట్టు
గరికపోచలపూన గాడిదపిల్లలు నాట్యమాడుతున్నాయి --- పేలు
No comments:
Post a Comment