Monday, December 27, 2021

ఈ దేవుడెవరో చెప్పండి

 ఈ దేవుడెవరో చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలో చివర ప్రార్థన జేసెద నభీష్టసిద్ధికిన్

అని కవి చెబుతున్నాడు. ఇష్టసిద్ధికి ప్రార్థన చేసే

దేవుడెవరో చెప్పగలరు

సురగిరిజాధినాధుప్రియ సూనుని సోదరి మేనమామ  సుం

దరిప్రియపుత్రు సద్గురుని తండ్రి, నిజాంగనతోడి కోడలిం

జెఱఁగొనినట్టివానిరిపు చెట్టకు శత్రుని తాతకూతురిన్

బరిణయమైన వాని సుతుఁ బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్


ఆదేవత ఎవరో కామెంట్స్ లో పెట్టండి.


2 comments:

VenCKi said...

శ్రీ మహా విష్ణువు ?

ఏ.వి.రమణరాజు said...

మిత్రమా ధన్యవాదాలు
మీరు పేరు చెబితే సరిపోదు ఎలానో చెప్పాలి