రఘువీరగద్యం చారిత్రక వ్యాసం
సాహితీమిత్రులారా!
*రఘువీర గద్య*
శ్రీవైష్ణవ ఆచార్యపురుషులలో వేదాంతదేశీకులవారు
(క్రీ.శ. 1268-1369) సుప్రసిద్ధులు.వీరు కవితార్కిక కంఠీరవ,
సర్వతంత్రస్వతంత్ర మొదలయిన చాలా బిరుదాలు కలిగిన
వారు ,శతాధిక గ్రంథకర్తలు.
దేశికులవారు- కాంచీపురంలోనేగాక తిరువహీంద్రపురం
అనే చోటకూడచాలాకాలంనివసించారు.తిరువహీంద్రపురంలో
దేశికులవారు నివాసంగా ఉండిన తిరుమాళిగ నేటికీ దర్శన
మిస్తుంది.దేశికులవారి జీవిత, సాహిత్య అద్భుత చరిత్రలతో
తిరువహీంద్రపంరానికిచాలాసన్నిహితసంబంధాలుఉన్నాయి.
అలాగే దేశికులవారు రచించిన *రఘువీరగద్య* కు
తిరువ హీంద్ర పురానికీ చాలాసంబంధం ఉంది.
తమిళనాడులోని సౌత్ ఆర్కాట్జిల్లాలోకడలూరుకు5కి.మీ.
దూరంలో తిరువహీంద్రపురం ఉంది.ఇది శ్రీవైష్ణవుల నూట
ఎనిమిది దివ్యతిరుపతులలో ఒకటి.ఇక్కడి మూలవరులు
దైవనాయకన్.ఈ దివ్యతిరుపతిలో సీతారామలక్ష్మణహనుమ
దాలయం ఉంది.ఇక్కడ వెలసిన శ్రీరామునికి రఘువీరుడని
కూడా వ్యవహారం. ఈ రఘువీరుని గురించే దేశికులవారు
గద్యను రచించారని దొడ్డయాచార్యులు అనే పూర్వపండిత
కవి తెలియజేశారు.
శ్రీరామానుజులవారు శ్రీరంగ,శరణాగతి,వైకుంఠ గద్యలను
రచించారు. వీటిలో శ్రీరంగగద్యరచనకు దేశికులవారు
ప్రస్పందించి,ప్రేరితుడై రఘువీరగద్యను రచించారని పరిశోధక
పండితులు చెప్తారు.దేశికులవారి రచనల ఆవిర్భావానికి ఒక
అద్భుతమైన సంఘటన నేపథ్యంగా ఉండడం విశేషం.
రఘు వీర గద్యకూడ *ప్రత్యేక లయలో* ,శైలిలో రచించబడడానికి
కారణాలు పూర్వపండితులు గ్రంథస్థం చేశారు. డిండిమభట్టు
అనే పండితకవి కంచుఢక్కను(బిరుదచిహ్నంగా)కలిగి ఉం టాడు.
ఆయన ఒకపర్యాయం తిరువహీంద్రపురంలో ఉన్న
దేశికులవారి సన్నిథికి వెళతారు.అపుడు దేశికులవారు
శ్రీరంగ గద్యరచనకు ప్రేరితులై రఘువీరగద్యను రచించే ఉద్దే
శంతో ఉంటారు.ఆ విషయం డిండిమభట్టుకు తెలుస్తుంది.
భట్టుగారు దేశికులవారితో- "అయ్యా ! నేను ఈ ఢక్కను మోగిస్తాను.
ఆ శబ్దానికి అనుగుణంగా మీరు గద్యకవనం చెప్పండి.
అప్పుడు మీ ప్రతిభ తెలుస్తుంది"అంటాడు.దానికి
దేశికులవారు ఆమోదించారు.డిండిమభట్టు శాస్త్రపద్ధతికి
మారుగా, సరస్వతికే కొంగొత్తతాళం నేర్పగలిగే రీతిలో, ఢక్కా
వాద్యాన్ని మోగిస్తారు.దేశికులవారు ఆఢక్కావాద్య శబ్దానికి
అనుగుణంగా రఘువీరగద్యను ఆశువుగా చెప్తారు. ఇది
పరంపర జనశ్రుతిగ వస్తున్న విషయం.దేశికులవారి రఘు
వీరగద్య అంటే అమితమైన ఇష్టమని తెంబైరాజగోపాలస్వామి
వారు అనే విద్వత్పండితులు ఒకచోట రాశారు.
తిరువహీంద్రపురంలోదేవనాయకన్బ్రహ్మోత్సవ సందర్భాన
శ్రీవైష్ణవ పండితస్వాములు ఈ గద్యను అద్భుతమైన ప్రత్యేక
శైలిలో గానం చేయడం ఈ సందర్భాన స్మరణీయం.
దేశికులవారు రఘువీరగద్యను "మహావీరవైభవం"అని
పేర్కొన్నారు.రచనలు మూడు విధాలు.అవి-పద్య రచనలు,
గద్య రచనలు,పద్య గద్యాత్మక రచనలు.ప్రస్తుత రచన గద్య
రచన.గద్యలలో చూర్ణికాది భేదాలు ఉన్నాయి.
రఘువీరగద్యలోశ్రీరాముడు,ధర్మవీర,దానవీర,దయావీర,
యుద్ధవీర,శరణాగతరక్షకవీరునిగా దర్శనమిస్తారు.శ్రీవాల్మీకి
రామాయణంలోని ఏడు కాండలలోని వివిధగుణాలను వెల్ల
డించే నవ్య,భవ్య,దివ్య స్తోత్రం రఘువీరగద్య.సంక్షిప్త సుదీర్ఘ
సమాస భూయిష్ఠంగా రఘువీరుని మథుర శబ్దాలతో,నియ
మాక్షరాలతో, ఒక విధమైన నవ్యమైన లయబద్ధంగ సాగు
తుంది హృద్యంగా రఘువీరగద్యం.
రఘువీర గద్యలో "జయ జయ మహావీర"అని 1నుండి
20వరకు ఉన్నమాటలు బాలకాండకు,21నుండి25 వరకు
అయోధ్యకాండకు,26నుండి41వరకు అరణ్యకాండకు,42
నుండి46 వరకు కిష్కింధకాండకు,47సుందరకాండకం,48
నుండి77వరకు యుద్ధకాండకు,78నుండి 98 వరకు ఉత్తర
కాండకుసంబంధించినవిషయాలను చెప్పారు దేశికులవారు.
మొత్తం 95 వచనాలు సంబుద్ధిగా ఉన్నాయి.
దేవతలకోరికమేరకువైకుంఠంనుంచిదిగివచ్చి
శ్రీమన్నాయరాయణుడు కౌసల్యా దశరథులకు జన్మించడం,
వసిష్ఠ విశ్వామిత్ర భరద్వాజ వాల్మీక మసర్షుల ప్రస్తావనలు,
గుహుడు,శబరి, జటాయువు,కాకాసుర,హనుమాన్,సుగ్రీవ,
విభీషణుల ప్రస్తావనలు,లవకుశులు రామాయణగానం చేయడం,
శ్రీరాముడు తిరిగివైకుంఠంవంటి రామకథలోని సుప్రసిద్ధ ప్రధాన విశేషాలు
రఘువీర గద్యలో రామసంబంద్ధిగా చెప్పారు దేశికులవారు.
రఘువీరగద్యకు రంగాచార్యులు అనే పూర్వవిద్వత్కవి పండితులు
మణిప్రవాళంలో వ్యాఖ్య సంతరించారు. రఘు వీరగద్య *జయ* శబ్దంతో
ప్రారంభ మవుతుంది.కనుక *రఘువీర గద్య వ్యాఖ్య* కు
*జయవ్యాఖ్య* అనే పేరు ఉండడం స్మరణీయం.
--------------------------------------
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు
2 comments:
ఆడియో లింక్ కూడా ఇచ్చినట్లయితే విని సంతోషించేవాళ్ళఁ
అలాగే అందించాను ఆస్వాదించండి
Post a Comment