Tuesday, June 23, 2020

ఒకేపాదంలో ఎంత వింత


ఒకేపాదంలో ఎంత వింతసాహితీమిత్రులారా!

మాడుగుల మహారాజును
ఇద్దరు కవీశ్వరులు ఇలా దీవించారు-

అ శ్లోకం చూడండి -

విక్రమేణార్జున ముఖా: కృష్ణభూపాల! తే హితా:
విక్రమేణార్జున ముఖా :కృష్ణభూపాల! తే హితా:


రెండు పాదాలు
ఒకలానే ఉన్నాయి కదా!

ఇద్దరూ ఒకే పాదాన్ని చెప్పారా? అంటే చూద్దాం మరి

మొదటికవి చెప్పిన పాదానికి అర్థం-

ఓ కృష్ణభూపాలా!
విక్రమేణ అర్జునముఖా: -
పరాక్రమంలో (పాండవ మధ్యముడైన) అర్జునుడు మొదలైనవారు,
తే హితా: - నీకు సమాన స్నేహితులుగా పోల్చదగినవారు
.
రెండవకవి చెప్పిన పాదానికి అర్థం -

ఇందులో తే2హితా - అని తీసుకోవాలి
అపుడు
ఓ కృష్ణభూపాలా!
తేऽహితా: = తే అహితా: = నీ శత్రువులు,
విక్రమేణ - పరాక్రమంలో
అర్జున ముఖా: -
తెల్లమొగంతో వెలవెల పోతున్నారు.

No comments: