Thursday, June 11, 2020

ఒకే సమాస చిత్రం

ఒకే సమాస చిత్రం

సాహితీమిత్రులారా!

ఒక పద్యంలోగాని శ్లోకంలోగాని దీర్ఘసమాస అంతాకాని,
ఎక్కువ భాగంగాని కూర్చడం ఒకే సమాస (ఏకసమాస) చిత్రం అనబడుతున్నది.
ఈ పద్యం చూడండి.

మోచర్ల వెంకన అనే కవి వినుకొండపురమునకు వెళ్ళినపుడు
శ్రీరాజామలరాజు వేంకటనరసింహరాయ ప్రభువును దర్శించగా
ఆ ప్రభువు - ఇతఁడేనా వెంకన - అనెనట అప్పుడు కవి -
అయ్యా!  వెంకన ఇతఁడేకాని,-

ఇతఁడేనా? వినుకొండనామకమనోభీష్టార్థకృత్పట్టణ
స్థితసామ్రాజ్యరమాదయామృతఝరీచంచత్కటాక్షేక్షణ
ప్లుతసర్యాంగసమస్తశోభనకళాపుంఖీభవత్ స్తుత్యసం
గతమాల్రాజవరాన్వయప్రభవవేంకట్నర్సధాత్రీశ్వరుం;
డితఁడేనా - ఇతఁడేనా -

అనెనట ప్రభువుగారు వెంకనకవీంద్రుని అసాధారణాశుధారాపాండిత్యానికి,
ధైర్యానికి సంతోషించి బహుమానమిచ్చి పంపిరట.

ఈ పద్యంలో రంగులో చూపబడినదంతా ఒక సమాసమే కావున ఇది ఏకసమాస చిత్రం.
ఇతఁడేనా?  వినుకొండనామకమనోభీష్టార్థకృత్పట్టణ
స్థితసామ్రాజ్యరమాదయామృతఝరీచంచత్కటాక్షేక్షణ
ప్లుతసర్యాంగసమస్తశోభనకళాపుంఖీభవత్ స్తుత్యసం
గతమాల్రాజవరాన్వయప్రభవవేంకట్నర్సధాత్రీశ్వరుం;
డితఁడేనా - ఇతఁడేనా -

No comments: