చ్యుత చిత్రము
సాహితీమిత్రులారా!
చ్యుతము అంటే తొలగించడం. కొన్ని అక్షరాలను తొలగిస్తే ఏర్పడే చిత్రం
ఇక్కడ గమనిద్దాం-
నగతనయన్ ధరన్ సిరిని నాలుగు వర్ణములన్ లిఖించి యా
చిగురున నక్షరంబిడిన చొప్పున నొక్కొక్క యక్షరంబునన్
అగును గజాననుండు నొకటాదిగ దీయ చతుర్ముఖుండు రెం
డుగ నటుదీయ షణ్ముఖుఁడు, వెంటనే పంచశరుండు వహ్నియున్
పై పద్యం ప్రకారం
నగతనయ - ఉమ
ధర - కు
సిరి- మా
ఉమాకుమా అనే అక్షరాలకు ర చేర్చిన ఉమాకుమార అవుతుంది
ఉమాకుమార అంటే గజాననుడు, వినాయకుడు
ఉమాకుమార - లో మొదటి అక్షరం ఉ తీసివేస్తే
మా కుమారుడు అవుతుంది అంటే బ్రహ్మ(చతుర్ముఖుడు)
మా కుమార - లో మా తీసివేస్తే కుమార
కుమార అంటే కుమార స్వామి (షణ్ముఖుడు)
కుమార - లో కు తీసివేసిన మార
మార అంటే మన్మథుడు(పంచశరుడు)
మార-లో మా తీసివేస్తే ర
ర అంటే వహ్ని అగ్ని
No comments:
Post a Comment