Saturday, October 2, 2021

వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న గూఢచిత్రం

 వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న గూఢచిత్రం




సాహితీమిత్రులారా!



వాట్సప్ లో ఈ క్రింది అంశం చక్కర్లు కొడుతున్నది

అది గూఢచిత్రానికి సంబంధించినది గమనించగలరు-

ఒక రైలు ప్రయాణికుడు అచ్చమైన తెలుగులో మాట్లాడవలెనని 

తపనతో బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు-

''ఓ ధూమశకట కార్యాలయాధ్యక్ష, నిక్కమైన రొక్కము పుచ్చుకొని 

సుగ్రీవ సోదరరథపురమునకు ఒక అనుమతి పత్రము దయచేయుమా''

అని అన్నాడు. అతని ప్రయాణము ఎక్కడికి చెప్పుకోండి చూద్దాం


సమాధానం - సుగ్రీవ సోదర రథపురము

సుగ్రీవుని సోదరుడు వాలి

రథము అంటే దీని పర్యాయపదం - తేరు

రెండూ కలిపితే వాల్తేరు

సమాధానం అవుతుంది.


2 comments:

Anonymous said...

నేనే గనక ఆ బుకింగ్ కౌంటర్లో ఉంటే అతనితో "నీ బొంద. సుగ్రీవ సోదరరథపురము అనే ఊరు మా కాల సూచికలో ఎక్కడనూ లేదు.నీకు వాట్సాప్ పంపిన నీ బాబుతో చెప్పుకో" అని పంపేసేవాణ్ణి. అయినా ఆయన అచ్చ తెలుగులో "విశాఖపట్టణం" అని చెప్తే అతని సొమ్మేం పోయింది.

Anonymous said...

Ye pichi Vedhava kooda valteru Peru Alaa Chappadu. Ee pitchi joku chalaa dashabdaala nunchi vinipistundi.