Thursday, June 24, 2021

గూఢచిత్రపద్యం

 గూఢచిత్రపద్యం




సాహితీమిత్రులారా!



ఈ పద్యం గమనించండి 

మామను సంహరించి, యొకమామకు గర్వమడంచి, యన్ని శా
మామను రాజుజేసి, యొకమామతనూజునకాత్మబంధువై
మామకుగన్నులిచ్చి, సుతుమన్మథుపత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్ను డయ్యె డున్

ఇందులో ''మామ'' - అనేపదం అనేకసార్లు రావడం జరిగింది

ప్రతిసారి దాని అర్థం మారుతున్నది 

1. కంసుడనే మామను చంపి,

2. సముద్రుడనేమామకు గర్వమణచి(రామావతారంలో)

3. చందమామను రాత్రికి రాజును చేసి (నానార్థాలలో రాజు అంటే చంద్రుడు 
     అని ఒక అర్థం)

4. ఒకమామకొడుక్కు(అర్జునునికి) ఆత్మబంధవై,

5. ఒకమామకు కన్నులిచ్చి(రాయబారంలో ధృతరాష్ట్రునికి)

6. రతీదేవికి తానే మామయై,

7. సముద్రుడు విష్ణువుకు మామ,

8.ఈయనకు గంగను ఇచ్చినందున మామకు మామయైనాడు,

అటువంటి విష్ణువు ప్రసన్నుడై మాకు అనుగ్రహం కలిగించుగాక!


No comments: