Sunday, March 7, 2021

అంకెల పద్యం

అంకెల పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలో అన్నీ అంకెలే కనిపిస్తాయి గమనించండి 

వాటి అర్థం ఎలా తీసుకోవాలో క్రింద వివరించుకుందాం-


ఇంచుక చతుర్థజాతుఁడు

పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్

గాంచి తృతీయంబప్పురి

నించి ద్వితీయంబు దాగి నృపుకడకేగెన్


ఈ పద్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అనే 

ఐదు అంకెలున్నాయి. వీటి అర్థం తెలిస్తే పద్యం సులువుగా అర్థమౌతుంది.

ఈ ఐదు అంకెలు పంచభూతాలుగా ఒక క్రమసంఖ్యను తీసుకుంటే

ఈ విధంగా గుర్తించవచ్చు. ప్రథమం - భూమి, ద్వితీయం - నీరు, 

తృతీయం-అగ్ని, చతుర్థం - గాలి, పంచమమం - ఆకాశం.

ఇక పద్యం అర్థంలో కెళితే-

చతుర్థం - గాలి, గాలికుమారుడు - హనుమంతుడు,

అయిదవది - ఆకాశం - గుండా లంక చేరి,

ప్రథమం - భూమికుమార్తె అయిన సీతను చూచి,

ద్వితీయం నీరు(సముద్రం) దాటి నృపతి(రాజు - శ్రీరాముని)

దగ్గరికెళ్లాడు - అని భావం. 

1 comment:

Anonymous said...

పద్యంలో "ద్వితీయంబు దాటి" అని ఉండాలనుకుంటాను? "దాగి" అని ఉంది. మీ తాత్పర్యంలో తృతీయం గురించి రాయడం మరిచిపోయారు. BTW, పద్యం బాగుంది.