జఘనమండలము హంసయాన కురులు
సాహితీమిత్రులారా!
ఈ చ్యుతదత్తచిత్రపద్యం చూడండి-
ఈ పద్యంలో ఒక స్త్రీని వర్ణించాడు కవి
అధరముఖవర్ణ సూన్యంబు లతివకుచము
లాన నాకారరహిత, మబ్జాక్షి మేను
అజ జఘనమండలము, హంసయానకురులు
చరమ భాన్వితకరము చానతొడలు
ఈ పద్యంలో కవి స్త్రీని ఏ విధంగా వర్ణించాడో చూడండి-
ఆమె ఎలాంటి స్త్రీ అంటే
అ - లోపించిన అధరములు - కుచములు
ఆ - లేని ఆననము - మేను
జ - లేని జఘనము - కురులు
భ - కారముతోడి కరములు - తొడలు - గలది ఆమె.
అంటే
అధరములో
అ తీసివేస్తే ధరము - కొండ
కొండలవంటి కుచములు గలది ఆవిడ
ఆననము -లో ఆ తీసివేయగా
ననము అవుతుంది. ననము అంటే తీగ
తీగవంటి శరీరంగలది ఆమె.
జఘనము లో జ- లేనటువంటిది
అంటే జ తీసివేయగా ఘనము - మేఘము
మేఘమండలము వంటి కురులు గలది ఆవిడ
భాన్విత కరములు అంటే భతో కూడిన కరములు
కరభములు - అరటిబోదెలవంటి తొడలు గలది ఆసుందరాంగి.
No comments:
Post a Comment