Thursday, September 10, 2020

కందగర్భిత తేటగీతి

 కందగర్భిత తేటగీతి



సాహితీమిత్రులారా!



ఒక పద్యంలో ఒకటి అంతకన్నా ఎక్కువ పద్యాలను 

ఇమిడ్చి వ్రాయడం గర్భకవిత

ఇక్కడమనం ఆచార్య వి.యల్.యస్.భీమశంకరంగారి

రసస్రువు వేము వంశ గాథావళి నుండి 

కందగర్భిత తేటగీతిని చూద్దాం-

తేటగీతి పద్యంలో కందపద్యం ఇమిడి ఉన్నది దీనిలో-


గురుని ఋణమెట్లు తీర్తును కరుణ నతడు

నా కొమరుని కాకతి పృతనావరు సభ

బలి పశువును భూవరుని ప్రపత్తి గొనుచు

విడివడగను చేసెన్ గదా వింతగాదె


ఇందులోని కందపద్యం -

గురుని ఋణమెట్లు తీర్తును కరుణ నతడు

నా కొమరుని కాకతి పృతనావరు సభ

బలి పశువును భూవరుని ప్రపత్తి గొనుచు

విడివడగను చేసెన్ గదా వింతగాదె



గురుని ఋణమెట్లు తీర్తును 

కరుణ నతడు నా కొమరుని కాకతి పృతనా

వరు సభ బలి పశువును భూ

వరుని ప్రపత్తి గొనుచు విడివడగను చేసెన్

No comments: