కందగీతిగర్భచంపకమాల
సాహితీమిత్రులారా!
ఒక పద్యంలో మరోపద్యం ఇమడ్చడాన్ని గర్భకవిత్వం అంటారు.
కవి శక్తినిబట్టి రెండు మూడు అంతకుమించీ పద్యాలను
ఒకేపద్యం ఇమడ్చడం చేసి ఉన్నారు.
ఇక్కడ మనం మచ్చ వెంకటకవి కృత కుశ చరిత్ర అనే
అచ్చతెలుగు కావ్యం నుండి ఒక ఉదాహరణ చూద్దాం-
ఇక్కడ మరో విశేషం కూడా గమనించాలి అదేమిటంటే
కుశచరిత్ర పూర్తిగా అచ్చతెలుగులో వ్రాయబడిన కావ్యం.
దీనికి పెట్టిన పేరు శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన కుశచరిత్రం
కందగీతిగర్భచంపకమాల-
ఇల సిరిరాయఁడా! కడలినే, నెఱి టెంకిగ గన్నఱేఁడ! నీ
టల రతఁడా జగా లడర నన్నింట నాడెడియాటకాఁడ! డా
ల్గల{కఱినాయఁడా జలగ్రాల్ తెఱగంటికి సంగఁడీఁడ తి
ట్లడఁచతఁడా రహిం దడయ కన్నిటఁగాచెడి దంటకాఁడ!జే
ఇందులోని కందము -
ఇల{సిరిరాయఁడా! [కడలినే, నెఱి టెంకిగ గన్నఱేఁడ!] నీ
టల రతఁడా} జగా [లడర నన్నింట నాడెడియాటకాఁడ!] డా
ల్గల{కఱినాయఁడా [జలగ్రాల్ తెఱగంటికి సంగఁడీఁడ] తి
ట్లడఁచతఁడా} రహిం [దడయ కన్నిటఁగాచెడి దంటకాఁడ!]జే
కందము -
సిరిరాయఁడా! కడలినే,
నెఱి టెంకిగ గన్నఱేఁడ! నీటల రతఁడా
కఱినాయఁడా జలగ్రాల్
తెఱగంటికి సంగఁడీఁడ తిట్లడఁచతఁడా
ఇల{సిరిరాయఁడా! [కడలినే, నెఱి టెంకిగ గన్నఱేఁడ!] నీ
టల రతఁడా} జగా [లడర నన్నింట నాడెడియాటకాఁడ!] డా
ల్గల{కఱినాయఁడా [జలగ్రాల్ తెఱగంటికి సంగఁడీఁడ] తి
ట్లడఁచతఁడా} రహిం [దడయ కన్నిటఁగాచెడి దంటకాఁడ!]జే
ఇందులోని తేటగీతి-
కడలినే, నెఱి టెంకిగ గన్నఱేఁడ!
లడర నన్నింట నాడెడియాటకాఁడ!
జలగ్రాల్ తెఱగంటికి సంగఁడీఁడ
దడయ కన్నిటఁగాచెడి దంటకాఁడ!