Friday, February 23, 2018

మయూరుడు - సూర్యశతకం


మయూరుడు - సూర్యశతకం




సాహితీమిత్రులారా!


మయూరుడు సంస్కృత మహాకవి. 
మానతుంగాచార్యుడు, తన భక్తామరస్తోత్ర వ్యాఖ్యలో
పేర్కొన్నదాన్ని బట్టి ఉజ్జయినీ రాజయిన భోజుని 
ఆస్థానంలో మయూరకవి ఉన్నాడనీ, బాణభట్టు 
నకు మామగారని తెలుస్తుంది. మేరుతుంగుడు 
వ్రాసిన ప్రబంధచింతామణి అనే గ్రంథంలో
బాణభట్టు భార్యకు మయూరుడు సోదరుడని
చెప్పాడు. వీటన్నిటిని బట్టి ఒకటిమాత్రం నిజం
మయూరుడు 7వ శతాబ్ది పూర్వార్థంలో ఉన్నాడన్నది
నిశ్చయించుకోవచ్చు. సూర్యశతకం, మయూరకవి
రచనలన్నిటిలోనూ శిరోభూషణం వంటిది. 
సుప్రసిద్ధమైంది కూడ. సంస్కృత శతక సాహిత్యంలో
దీనికి గల స్థానం మరోదానికి లేదనవచ్చు. 
ఈ శతకాన్ని రచించడం ద్వారా మయూరుడు
వ్యాధి విముక్తిని సాధించినట్లు చెబుతారు.
సూర్యశతకాన్ని మయూరుడు స్రగ్ధర వృత్తంలో
రచించాడు. ఇందులో
సూర్యద్యుతికి సంబంధించినవి                                  - 43 శ్లోకాలు
సూర్యుని అశ్వాలను గురించినవి                                - 06 శ్లోకాలు
సూర్యుని రథసారథి అరుణుని గురించినవి              - 12 శ్లోకాలు
సూర్యరథాన్ని గురించినవి                                           - 11 శ్లోకాలు
సూర్యభగవానుని వర్ణన                                                 - 08 శ్లోకాలు
101వ శ్లోకం ఫలశ్రుతి చెప్పడం జరిగింది.
మయూరుడు దీన్ని వర్ణన ప్రధానమైన శతకంగా
కూర్చాడు. దీనిలో శ్లేష, రూపకం, ఉత్ప్రేక్ష 
మొదలైన అలంకారాలను ఉపయోగించాడు.
కొన్నిటిలో శబ్దాలంకార తత్పరత కనిపిస్తుంది.
దీనిలో సూర్యుని ఆధ్యాత్మికంగా వర్ణించింది 
తక్కువంటారు. ఈ శతకాన్ని వల్లభదేవుడు,
మధుసూధనుడు, త్రిభువన పాలుడు
అనే ముగ్గురు ప్రాచీన పండితులు వ్యఖ్యానాలు 
కూర్చారు. యజ్ఞేశ్వరశాస్త్రి రచించిన టీకా 
ఆధునికమైందిగా చెబుతారు. 

No comments: