Thursday, February 22, 2018

మోరోపంత్ - 108 రామాయణాలు


మోరోపంత్ - 108 రామాయణాలు




సాహితీమిత్రులారా!

మరాఠీ సాహిత్యంలో 1700 - 1850 వరకు గల కాలాన్ని
షీష్వాయుగం అంటారు. ఈ షీష్వాయుగానికి వన్నెతెచ్చి
మరాఠీ సాహిత్యంలోేనే కవిసార్వభౌముడని బిరుదును
పొందినవాడు మోరోపంత్ తాంబె. ఈయన 1729 - 94
మధ్యాకాలంలో జీవించినవాడు. ఈయన ప్రధానంగా
పౌరాణికుడు. పురాణాలను చదివి వ్యాఖ్యానించడం
ఇతని వృత్తి. పండితుడేకాక కవితలో, కథా కథనంలో,
నైపుణ్యం గలవాడు. ఇతడు తాత్విక చర్చల జోలికిి
పోకుండా కళాత్మకంగా కావ్యాలు మలిచినవాడు. 
లవకుశోపాఖ్యానం, ప్రహ్లాద విజయం, సప్తశతి, 
సీతాగీతం, సావిత్రీగీత, కృష్ణవిజయం, హరివంశం,
కేకావళి ఇతడు వ్రాసిన కొన్ని గ్రంథాలు. 
మహాభారతాన్ని పూర్తిగా ఆర్యా వృత్తాలతో రచించాడు.
రామాయణగాథనే అనేక దృక్పథాల నుంచి పరిశీలించి
రకరకాల ఛందస్సులలో వేరువేరుగా వ్రాయటం
ఆయన సాధించిన ఒక విశిష్టత. సీతారామాయణం
(అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత సీత తన 
తోడికోడండ్రకు చెప్పినట్లు వ్రాసిన గాథ)
మొదలైనవి. ఇవిగాక 108 రామాయణాలు
వివిధ పేర్లతో వ్రాశారు ఇదంతా గర్భకవిత్వమనవచ్చు.
108 రామాయణాల్లో ఇప్పుడు కేవలం 90 రామాయణాలు 
మాత్రమే లభ్యమౌతున్నట్లు తెలుస్తున్నది. వాటిలో కొన్ని 
పేర్లు ఇక్కడ తెలుసుకుందాం-

మంత్రరామాయణం, నామరామాయణం, మంత్రమయ రామాయణం
బాలమంత్ర రామాయణం, అద్భుత రామాయణం, అభంగ రామాయణం
అష్టోత్తరశత రామాయణం(ఆర్యాగీతి ముక్తావలి), ఆధ్యార్య రామాయణం
ఉమారామాయణం, అవతారమాలాంతర్గత రామాయణం, అనుష్టుప్ రామాయణం, ఋషిరామాయణం, ఏకపాది రామాయణం, ఏకశ్లోకి రామాయణం, ఓవి రామాయణం, ఓవిగీత రామాయణం, నిరోష్ఠ రామాయణం, పరంతు రామాయణం, పీయూష రామాయణం, కన్యారత్న రామాయణం, కధాసుధా రామాయణం ,దండి రామాయణం
దివ్య రామాయణం, దోహా రామాయణం, ధన్యరామాయణం,
ధర్మరామాయణం, ధీర రామాయణం, లఘురామాయణం,
కాశీరామాయణం, గంగా రామాయణం, కవిప్రియ రామాయణం,
కల్పలతా రామాయణం, కల్యాణ రామాయణం, ఛందో రామాయణం,
తీర్థ రామాయణం, దండక రామాయణం, దామ రామాయణం,
దాస రామాయణం ఇలా 108 రామాయణాలు వ్రాశారు.

No comments: