Sunday, August 27, 2017

పదాది వర్ణావృత్తి (అక్షర చిత్రం)


పదాది వర్ణావృత్తి (అక్షర చిత్రం)




సాహితీమిత్రులారా!


మొదటి పదానికి మొదట వచ్చిన వర్ణమే
పద్యం లేదా శ్లోకంలోని ప్రతిపదానికి
వచ్చినట్లయిన దాన్ని పదాది వర్ణవృత్తి
చిత్రమంటారు. ఇది శబ్దచిత్రంలోని
అక్షర చిత్ర విభాగానికి చెందినదిగా
పేర్కొన బడుతుంది- దీనికి
ఉదాహరణగా గోపీనాథరామాయణంలోని
ఈ పద్యం చూడండి-

విశ్వాథిప, విశ్వోదర
విశ్వాత్మక, విశ్వసాక్షి, విశ్వాధారా!
విశ్వమయ, విశ్వరూపక, 
విశ్వస్థితివిలయకరణ, విశ్వాతీతా!
                                                                      (1-1349)

ఇందులోని ప్రతిపదానికి  మొదట
వి - రావడం జరిగింది. కావున ఇది
పదాది వర్ణావృత్తికి చెందినదే కదా


No comments: