నీచే దెబ్బలు తిన్నాను
సాహితీమిత్రులారా!
ఈ పొడుపును విప్పండి-
అమ్మా! నీ కడుపున పడ్డానూ, అంత సుఖాన వున్నానూ
చుచ్చో మళ్ళీ వచ్చాను. సోలీ ఇంట్లో పడ్డాను,
నీచే దెబ్బలు తిన్నానూ, నిలువు యెండీ పోయినాను
నిప్పుల గుండం దొక్కాను, నీరై మారీ పొయ్యాను
సమాధానం -
నీ కడుపున పడ్డానూ, అంత సుఖాన వున్నానూ - గడ్డి
చుచ్చో మళ్ళీ వచ్చాను. సోలీ ఇంట్లో పడ్డాను, - పేడ
నీచే దెబ్బలు తిన్నానూ, నిలువు యెండీ పోయినాను - పిడక
నిప్పుల గుండం దొక్కాను, నీరై మారీ పొయ్యాను - బూడిద
No comments:
Post a Comment