Saturday, June 11, 2022

అన్నపానాలతో అంతమైండు

 అన్నపానాలతో అంతమైండు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు విప్పండి-

జడల మహాముని భూమ్మీద ఆరునెల్లు తబస్సు పట్టెండు

తబుసు పట్టిన కొన్ని దినాలకు భూచక్రగొడుగుతో భూమ్మీద పడ్డ

కొన్ని దినాలకు మొండి కత్తితో పైకి లేచిండు, 

పైకి లేచిన కొన్ని దినాలకు నందివాహనమ్మీద నాల్గు బజార్లు తిరిగిండు, 

నాల్గు బజార్లూ తిరిగిన కొన్ని దినాలకు 

తులాభారంతో తూగిండు, 

తులతూగిన కొన్ని దినాలకు, 

కూరపాటి వీరులతో 

కూని యుద్ధం చేసిండు, 

యుద్ధం చేసిన కొన్ని దినాలకు కారంపూడి వీరులతో యుద్ధం చేసిండు, 

యుద్ధం చేసిన కొన్ని దినాలకు అన్నపానాలతో అంతమైండు


సమాధానం - ఉల్లిగడ్డ

(ఉల్లిగడ్డ పొలంలో వేసిన దగ్గరనుండి కూరలతో అన్నంతో కలిసి మనం తినేదాకా ఈ కత)


No comments: