ఏ ఆవురా బావా!
సాహితీమిత్రులారా!
ఈ పద్యాన్ని చూచి
సమాధానం చెప్పగలరేమో చూడండి-
బావయు మఱదింగని, యీ
యావులలో నొకటి తెమ్మి యనఁగా నపుడే
యావన, యడిగిన వాక్యము
కావలయును భాషలైదుగా నొక పదమున్
బావ మరదిని చూచి ఈ ఆవులలో ఒకదాన్ని తెమ్మన్నాడు
దానికి మరది ఏ ఆవురా బావా అని అడిగాడు
అడిగిన వాక్యం ఐదు భాషలుగా కావాలి ఆ పదమేది -
సమాధానం-
ఏ ఆవురా బావా
దీనిలో
ఏ - రమ్ము(మహారాష్ట్ర)
ఆవు - రమ్ము(ఉర్దూ)
రా - రమ్ము(తెలుగు)
బా - కమ్ము (కన్నడ)
వా - రమ్ము(తమిళం)
No comments:
Post a Comment