Thursday, October 15, 2020

ప్రతి అక్షరము పునరుక్తం మయే పద్యం

 ప్రతి అక్షరము పునరుక్తం మయే పద్యం
సాహితీమిత్రులారా!వచ్చిన వ్యంజనమే పునరుక్తమౌతూ రావడాన్ని ఆవలి చిత్రం

అంటారు. దీన్నే సజాతీయమైన ఒక వర్ణమునకు ఆ వృత్తి

కలిగిన యమకములో ఒక రకమని దానికి

సజాతీయవర్ణనిరంతరయమకమని అంటారు

లక్ష్మీసహస్రములోని ఈ ఉదాహరణ గమనించండి-


మదనార్తావృత్తము-

కాకానన భూభూ మమకాకార రమా మా

కా కావవ రా రామమఘాఘాతతపాపా

కాకానననానాకక కా కాక కమా మా

కా కాగగ వే వేరఱ గాఁ గానన జేజే


అర్థం -

కాకాసురుని బ్రతికించినదానా

భూమినుండి పుట్టినదానా(సీతా రూపమున)

నా దుఃఖములను పూర్తిగా ఖండించుదానా

లక్ష్మీ తల్లీ

విష్ణుపత్నీ రక్షింపవా

రాముని గూర్చిచేయుయజ్ఞములందు పాపములను

విరివిగా(యజ్ఞవిధ్వంసకులను) రక్షింపనిదానా

చెడ్డవైన అడవులందు అనేకములైన దుఃఖములు కలదానా

సీతారూపమున దుర్గమారణ్యముల కష్టములను అనుభవించినదానా

మా ప్రయత్నములకు ఆటంకములు రానీయకుము

మా యొక్క తాపము అడ్డగింపడునట్లుగా

శీఘ్రముగా భేదభావము నశించునట్లుగా

రమ్ము నమస్కారము


ఇందులో ప్రతి అక్షరము పునరుక్తమైనది

అందువలన దీన్ని ఆవలి చిత్రమని అంటున్నారు.


No comments: