చిత్రకావ్యం - వేదాంతదేశికులు
సాహితీమిత్రులారా!
వేదాంతదేశికులు తన పాదుకాసహస్రం,
యాదవాభ్యుదయం కావ్యాలలో ప్రదర్శించిన
చిత్రకవిత్వం ఈ వీడియో నందు వీక్షించండి-
సాహితీమిత్రులారా!
వేదాంతదేశికులు తన పాదుకాసహస్రం,
యాదవాభ్యుదయం కావ్యాలలో ప్రదర్శించిన
చిత్రకవిత్వం ఈ వీడియో నందు వీక్షించండి-
సాహితీమిత్రులారా!
వేదాంతదేశికుల వారి పాదుకా సహస్రంలోని
బంధచిత్రాలను వీక్షించండి-
సాహితీమిత్రులారా!
ఒక కందపద్యంలో మరో 7 పద్యాలు మొత్తం 8 కందపద్యాలు
ఒకే కందంలో కూర్చారు తూము రామదాసుగారు
తన నిర్వచన మిత్రవిందోద్వాహములో
ఆ పద్యం ఇక్కడ చూద్దాం-
చరణక జునకును భవనది
తరికినిస్తుతమునికవికిని ధనవిభుపతికిన్
క్షరదతనునకునుప్రవిహిత
కరికినుతవాసవికినిగణరాడ్పతికిన్
(నిర్వచన మిత్రవిందోద్వాహము - 1- 36)
ఇందులో ఇదికాక 7 కందపద్యాలున్నాయి.
కనుక్కోవడం ఎలాగంటే
ప్రతిపద్యం మొదటిపాదం మూడవ గణంనుండి ప్రారంభిస్తేసరి.
ఇక చూద్దాం-
రెండవ పద్యం-
చరణక జునకును భవనది
తరికినిస్తుతమునికవికిని ధనవిభుపతికిన్
క్షరదతనునకునుప్రవిహిత
కరికినుతవాసవికినిగణరాడ్పతికిన్
భవనది తరికినిస్తుతముని
కవికిని ధనవిభుపతికినని క్షరదతనునకున్
ప్రవిహిత కరికినుతవా
సవికినిగణరాడ్పతికిని చరణక జునకున్
మూడవ పద్యం-
భవనది తరికినిస్తుతముని
కవికిని ధనవిభుపతికినని క్షరదతనునకున్
ప్రవిహిత కరికినుతవా
సవికినిగణరాడ్పతికిని చరణక జునకున్
స్తుతముని కవికిని ధనవిభు
పతికినని క్షరదతనునకును ప్రవిహిత కరికిన్
నుతవా సవికినిగణరా
డ్పతికిని చరణక జునకును భవనది తరికిన్
నాలుగవ పద్యం-
స్తుతముని కవికిని ధనవిభు
పతికినని క్షరదతనునకును ప్రవిహిత కరికిన్
నుతవా సవికినిగణరా
డ్పతికిని చరణక జునకును భవనది తరికిన్
ధనవిభు పతికినని క్షరదత
నునకును ప్రవిహిత కరికిన్ నుతవాసవికిన్
గణరాడ్పతికిని చరణక
జునకును భవనది తరికినిస్తుతమునికవికిన్
ఐదివ పద్యం -
ధనవిభు పతికినని క్షరదత
నునకును ప్రవిహిత కరికిన్ నుతవాసవికిన్
గణరాడ్పతికిని చరణక
జునకును భవనది తరికినిస్తుతమునికవికిన్
క్షరదత నునకును ప్రవిహిత
కరికిని నుతవాసవికిని గణరాడ్పతికిన్
చరణక జునకును భవనది
తరికినిస్తుతమునికవికిని ధనవిభు పతికినన్
ఈ విధంగా చేస్తే 8 పద్యాలు కనిపిస్తాయి.
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం చూడండి-
చెక్కులు పసగలిగుండును
చక్కని గుబ్బలనెసంగ సౌరై యుండున్
చిక్కునొక గడియలోపల
మక్కువసతిగాదు చూడ మహిమండలిలోన్
చెక్కులు (చెంపలు) పసగలిగి ఉంటాయట
గుబ్బలు(పాలిండ్లు) అతిశయించి అందంగా ఉంటాయట
అలాంటిది ఒక గడియకు చిక్కుతుందట
కాని అది సతి(స్త్రీ) కాదట - అదేమిటో చెప్పాలి
సమాధానం - జోడు తలుపులు
తలుపు చెక్కులుంటాయి. గబ్బలుంటాయి
రెండు తలుపులు ఒక గడియకు మాత్రమే చిక్కుతాయి
కాబట్టి సమాధానం సైరైందే.
సాహితీమిత్రులారా!
సాహితీమిత్రులారా!
ఒక ఛందస్సులో మరో ఛందస్సును ఇమిడ్చడం గర్భకవిత్వం
ఇక్కడ మణిగణనికరంలో కందపద్యం ఇమిడ్చడం
కందగర్భమణిగణనికరం దీనికి ఉదాహరణగా
నంది మల్లయ - ఘంట సింగయ
జంటకవులు వ్రాసిన ప్రబోధ చంద్రోదయము
((5-56) పద్యం చూస్తున్నాం-
ఇందులోని ఛందము-
ప్రతిపాదమునకు 4 నగణములు ఒక సగణము
యతి 9 వ అక్షరము
కలికి యొకతె యలక ములలి బలమున్
బలె నలిక తలము పయిఁగడలుకొనన్
గలకల నగియెడు కనుగవతళుకుల్
తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్
ఈ పద్యంలో కందపద్యం ఇమిడి ఉన్నది
ఆ కందపద్యము -
కలికి యొకతె యలక ములలి
బలమున్ బలె నలిక తలము పయిఁగడలుకొనన్
గలకల నగియెడు కనుగవ
తళుకుల్ తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్
ఇలాంటి కందగర్భమణిగణనికరములు
కొన్ని మీరు గమనించిచూచుటకు-
బిజ్జల తిమ్మభూపాలుని అనర్ఘరాఘవములోనిది-
భవహర శ్రితజన భవహర, రవి తా
ర వర శిఖినయన రజతధరణి భృ
ద్భవన భువననుత పరిహృత, సవనా
జవనతురగితవిశదవృష సగణా
(2-412)
పుష్పగిరి తిమ్మన గారి
సమీరకుమారవిజయములోని పద్యం-
తొగదొర జిగిబిగి దొరసిన సిగయున్
సెగగను కనుఁగొన జెనకిన పగయున్
మగువ సగము గలమయి నిగనిగయున్
నెగడిన నిను మది నిలిపెద నభవా
((4-79)
కూచిమంచి తిమ్మకవి
రసికజనమనోరంజనములోనిది-
జయజయ పురహర జయ గిరిశయనా
జయ తలవినిభృత సదమల హరిణా
నయ గుణవిలసిత నయశుభచయదా
జయ మునివర సుతచరణ సరసిజా
(2-55)
పైన నేను చూపిన విధంగా
కందపద్యంలోనికి మార్చి చూడవచ్చు
ప్రయత్నించి గమనించండి.
సాహితీమిత్రులారా!
రెండు దీర్ఘాచ్చులతోటి కూర్చబడిన పద్యం
లేక శ్లోకంను దీర్ఘ ద్వి స్వరచిత్రం అంటాము.
శ్రీ దీప్తీ హ్రీ కీర్తీ ధీనీతీ గీ ప్రీతీ
ఏధేతే ద్వే ద్వే తేయే నేమే దేవేశే
(కావ్యాదర్శము- 3- 86)
(దేవేంద్రుని యందుకూడ లేని శోభాదీప్తులు,
లజ్జాకీర్తులు, బుద్ధినీతులు, వాక్ప్రేమలు
రెండు రెండు నీకు వృద్ధినొందుచున్నవి.)
దీనిలో మొదటి అర్థము అనగా శ్లోకము పూర్వభాగము అంతా ఈ - స్వరంతోను,
రెండవ భాగము అనగా ఉత్తరార్థశ్లోకం అంతా ఏ - స్వరం తోను కూర్చబడినది.
ఈ రెండును దీర్ఘ స్వరములే
కావున
ఇది దీర్ఘ ద్వి స్వరచిత్రం.
సాహితీమిత్రులారా!
మహాకవి నిత్యానంద శాస్త్రి గారి
దేవీస్తవః నుండి ఈ ఛత్రబంధం
ఛత్రబంధాలు అనేక రకాలున్నాయి
వాటిలో ఇదొక రకం.
దేవీస్తవః లోని మొదటి శ్లోకం ఈ ఛత్రబంధం.
జయజయ వార్యా దధి మథి
జన్మా2న్తామేలనం హృదున్మాథి
ఆవాలచిత్రతనుభా
ఆర్యా నవ్యాస్తథా2మ్బాభా
దీనిలో మొదటి పాదం అంతా ఛత్రం పైవైపు వంపులోను
రెండవపాదం వంపుకు క్రింది భాగంలోను
మూడవ పాదం పైన ఆ దగ్గర నుండి గమనిస్తే వా దానిక్రింద ల
దానిక్రింద చిత్ర తను అనే అక్షరాలు నిలువుగా ఉంటుంది.
నాలుగవ పాదం కూడ ఆ తోనే ప్రారంభమై దానిక్రింద నిలువుగా ర్యా న
దానిక్రింద వ్యాస్తథామ్బా నిలువుగా కనిపిస్తాయి చివర మళ్ళీ భాతో పూర్తవుతుంది.
గమనించండి
సాహితీమిత్రులారా!
వచ్చిన వ్యంజనమే పునరుక్తమౌతూ రావడాన్ని ఆవలి చిత్రం
అంటారు. దీన్నే సజాతీయమైన ఒక వర్ణమునకు ఆ వృత్తి
కలిగిన యమకములో ఒక రకమని దానికి
సజాతీయవర్ణనిరంతరయమకమని అంటారు
లక్ష్మీసహస్రములోని ఈ ఉదాహరణ గమనించండి-
మదనార్తావృత్తము-
కాకానన భూభూ మమకాకార రమా మా
కా కావవ రా రామమఘాఘాతతపాపా
కాకానననానాకక కా కాక కమా మా
కా కాగగ వే వేరఱ గాఁ గానన జేజే
అర్థం -
కాకాసురుని బ్రతికించినదానా
భూమినుండి పుట్టినదానా(సీతా రూపమున)
నా దుఃఖములను పూర్తిగా ఖండించుదానా
లక్ష్మీ తల్లీ
విష్ణుపత్నీ రక్షింపవా
రాముని గూర్చిచేయుయజ్ఞములందు పాపములను
విరివిగా(యజ్ఞవిధ్వంసకులను) రక్షింపనిదానా
చెడ్డవైన అడవులందు అనేకములైన దుఃఖములు కలదానా
సీతారూపమున దుర్గమారణ్యముల కష్టములను అనుభవించినదానా
మా ప్రయత్నములకు ఆటంకములు రానీయకుము
మా యొక్క తాపము అడ్డగింపడునట్లుగా
శీఘ్రముగా భేదభావము నశించునట్లుగా
రమ్ము నమస్కారము
ఇందులో ప్రతి అక్షరము పునరుక్తమైనది
అందువలన దీన్ని ఆవలి చిత్రమని అంటున్నారు.
సాహితీమిత్రులారా!
నాటా కన్వెన్షన్ నందు జరిగిన
నరాలరామారెడ్డిగారి అష్టావధానం వీక్షించండి
సాహితీమిత్రులారా!
ఊరపంది, కోడిపెట్ట, జెల్లచేప, కప్ప...
ఈ పదాలతోబ్రాహ్మణ పెళ్లిభోజనంగా
సమస్యను పూరించమని దత్తపది
శతావధాని నరాలరామారెడ్డిగారి విశాఖపట్టణం సభలో
ఇచ్చారట ఒక పృచ్ఛకుడు
దానికి ఆయన పూరణ ఈ వీడియోలో వీక్షించండి-
సాహితీమిత్రులారా!
రెండు హల్లులు ఉపయోగించి కూర్చిన శ్లోకాన్ని ద్వ్యక్షరి అంటారు.
ఇక్కడ "క-ల" అనే రెండు హల్లులను ఉపయోగించి కూర్చిన శ్లోకం
గమనించండి.
ఇందులో హల్లులు రెండే
వాటికి అచ్చులు ఏవైనా ఉండవచ్చు.
కాలేకిలాలౌకికైక
కోలకాలాలకేలల
కలికాకోలకల్లోలా
కులలోకాలిలాలికా
దీని అర్థం-
అలౌకిక = లోకవిలక్షణమైన, ఏక = ముఖ్యమైన,
కోల = ఆదివరాహస్వామియొక్క, కాలాలకే = భార్యవైన,
ఓ లక్ష్మీ,(కాల = నల్లని, అలకే = ముంగురుగలదానా!)
కలి = కలికాలమనే, కాకోల = విషముయొక్క,
కల్లోల = అభివృద్ధిచే, ఆకుల = బాధపడుచున్న,
లోక + అలి = ప్రజాసమూహమును, లాలికా = రక్షించుచున్న,
(త్వమ్) నీవు, కాలేకిల = అపాయసమయమున మాత్రము,
లల = సాక్షాత్కరించి ప్రకాశింపుము.
సాహితీమిత్రులారా!
క్రమంగా క- వర్ణం మొదలు హ - వర్ణం వరకు ఉన్న
అన్ని హల్లులను ఉపయోగించి రచించిన వర్ణచిత్రం
ఈ క్రమస్థ సర్వవ్యంజనం.
కన్నడంలో మురిగా గురుసిద్ధన తన
శివలింగషట్పది లో కూర్చారు దాన్ని గమనించండి
ಕರಿವೈರಿ ಖಟ್ವಾಂಗಿ ಗಳಿತಾಘ ಙವಿಭೀದಿ
ಚರಭುಕ್ತ ಛಂದ್ಯದ ವಿರಾಶಿ ಜನಿಸಂಹಾರಿ
ಝರಿಪು ಞವಿರಾಜಿ ಗಂಗಾಜೂಟ ಸಿತಿಕಂಠ ನಿಬಿಡದೃಢ ಸುಪ್ರವೀಣ
ತರಣಾಬ್ಜ ಮೌಲಿ ಜಿನ್ನಾಥ ನಾದವಿನೋದಿ
ಧರಿತೇಷ್ಟನಮಿತಾಹಿಪ ಫಣಾಹಿ ನೃತ್ಯಬಹು
ಭರಿತಾಮಯಧ್ವಂಸಿ ರಲವಮಿತ್ರಾಕ್ಷ ಶಷದಾಯಿ ಸಪಿತ ಪ್ರಹಸಿತಾ
కరివైరి ఖట్వాంగి గళితాఘ ఙభీది
చరుభుక్త ఛంద్యద విరాశి జనిసంహారి
ఝరిపు ఞవిరాజి గంగాజూట సితకంఠ నిబిడదృఢ సుప్రవీణ
తరుణాబ్జ మౌలి జిన్నాథ నాదవినోది
ధరితేష్టనమితాహిప ఫణాహి నృత్యబహు
భరితామయధ్వంసి రలవమిత్రాక్ష శషదాయి సపిత ప్రహసితా
ఇందులో క్రమస్థముగా హల్లులు ఉన్నాయి గమనించండి-
ಕರಿವೈರಿ ಖಟ್ವಾಂಗಿ ಗಳಿತಾಘ ಙವಿಭೀದಿ
ಚರಭುಕ್ತ ಛಂದ್ಯದ ವಿರಾಶಿ ಜನಿಸಂಹಾರಿ
ಝರಿಪು ಞವಿರಾಜಿ ಗಂಗಾಜೂಟ ಸಿತಿಕಂಠ ನಿಬಿಡದೃಢ ಸುಪ್ರವೀಣ
ತರಣಾಬ್ಜ ಮೌಲಿ ಜಿನ್ನಾಥ ನಾದವಿನೋದಿ
ಧರಿತೇಷ್ಟನಮಿತಾಹಿಪ ಫಣಾಹಿ ನೃತ್ಯಬಹು
ಭರಿತಾಮಯಧ್ವಂಸಿ ರಲವಮಿತ್ರಾಕ್ಷ ಶಷದಾಯಿ ಸಪಿತ ಪ್ರಹಸಿತಾ
కరివైరి ఖట్వాంగి గళితాఘ ఙభీది
చరుభుక్త ఛంద్యద విరాశి జనిసంహారి
ఝరిపు ఞవిరాజి గంగాజూట సితకంఠ నిబిడదృఢ సుప్రవీణ
తరుణాబ్జ మౌలి జిన్నాథ నాదవినోది
ధరితేష్టనమితాహిప ఫణాహి నృత్యబహు
భరితామయధ్వంసి రలవమిత్రాక్ష శషదాయి సపిత ప్రహసితా
సాహితీమిత్రులారా!
పద్యంలో అన్నీలఘువులుగాను
మరియు పెదవులతో పలుకని అక్షరాలతోనూ
కూర్చబడిన పద్యం ఇది దీన్ని సర్వలఘునిరోష్ఠ్య పద్యం అంటారు
ఇది ఇమ్మడి గురుసిద్ధన కూర్చిన హాలాస్య పురాణంలోనిది గమనించండి-
ಗರಧರ ಧರಗರ ಧರನದ ಶರದಕ
ಘನರಥ ಧನದಸ ಹನನಯ ಘನದಯ
ಗತಗದ ನತನರ ಶತದಳ ರತಶಕ
ಧರಧರ ಶರಶರ ಶರಕರ ಶರದಕ
ರಯಗತ ನಯರಥ ಶಯಕಕ ಳಯಸರ
(ಹಾಲಾಸ್ಯ ಪುರಾಣ- 4-17-158 ರಿಂದ 162)
గరధర ధరగర ధరనద శరదశ
ఘనరథ ధనదన హననయ ఘనదయ
గతగద నతనర శతదళ రతశక
రయగత నయరథ శయకక ళయసర
దీన్ని చదివి చూడండి ఒక అక్షరానికైనా పెదవి కలుస్తుందేమో
సాహితీమిత్రులారా!
చిత్రమంజరి పేరుతో శ్రీబోడి వాసుదేవరావుగారు
ఒక పుస్తకాన్ని కూర్చారు. ఇందులో
సాహితీమిత్రులారా!
మొదటి పదానికి మొదట వచ్చిన వర్ణమే
పద్యం లేదా శ్లోకంలోని ప్రతిపదానికి
వచ్చినట్లయిన దాన్ని పదాది వర్ణావృత్తి
చిత్రమంటారు. ఇది శబ్దచిత్రంలోని
అక్షర చిత్ర విభాగానికి చెందినదిగా
పేర్కొన బడుతుంది- దీనికి
ఉదాహరణగా గోపీనాథరామాయణంలోని
ఈ పద్యం చూడండి-
విశ్వాథిప, విశ్వోదర
విశ్వాత్మక, విశ్వసాక్షి, విశ్వాధారా!
విశ్వమయ, విశ్వరూపక,
విశ్వస్థితివిలయకరణ, విశ్వాతీతా!
(1-1349)
ఇందులోని ప్రతిపదానికి మొదట
వి - రావడం జరిగింది. కావున ఇది
పదాది వర్ణావృత్తికి చెందినదే కదా
(ఈ పదాలన్నీ విష్ణుసహస్రనామాలలోనివే కదా)