Thursday, March 30, 2023

వేదాన్తదేశిక చరితమ్

 వేదాన్తదేశిక చరితమ్




సాహితీమిత్రులారా!

వేదాన్తదేశికుల చరిత్రమ్

సినిమా ఆస్వాదించండి-



Tuesday, March 28, 2023

సుశ్లోక రాఘవం

 సుశ్లోక రాఘవం





సాహితీమిత్రులారా!



సుశ్లోక రాఘవం

1సు శ్లోక= మంచి కీర్తిగల,రాఘవం=  రఘువంశ రాముడు.

  2సుశ్లోక=మంచి సంస్కృత పద్యాలు కలిగిన,లాఘవం=లఘువు

               (చిన్న చమత్కృతి)  {ర,ల-యోరభేదః}

   రచన:పంత విఠల, క్రీ.శ.1853     

కాలం: 19వశాతాబ్దప్రారంభంలోనూ ఉన్నాడు.

సుశ్లోక లా(రా)ఘవంలో 552 ముక్తక శ్లోకాలు కలిగిన రచన.ప్రతి

శ్లోకంకూడ శ్లేష చమత్కారంతో ఉంది. గ్రంథరచన పూర్తికాగానే కవిగారే నాగర

లిపిలో ముద్రణ వేయించినాడు.   ఈ పండితకవివర్యులు మహారాష్ట్రం

వారు.కరహాటక క్షేత్ర నివాసి., గీతా-మహాదేవుల పుత్రరత్నం.ఈ పండితకవి

శ్రీనివాసపండిత ప్రతినిధిధర్మ పరిషత్ లో ప్రధాన పండితవర్యులుగ ఉండినారని తెలియవస్తుంది.

   అన్నిటికిమించి శ్రీరామచంద్రమూర్తిని కులదైవతంగఆరాధించినభక్తితత్పరుడు

  ఈ కవిపండితవర్యుడు శృంగార, వేదాంత,వ్యాకరణ,ఆయుర్వేద,ఖగోళ, శకునశాస్త్ర,భాగవత పురాణాదులకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను విశేషంగ   ఈగ్రంథంలో  శ్లేషచమత్కా రంతో చెప్పినాడు. ఈ గ్రంథానికి పంతవిఠలుని శిష్యు డైన నారాయణులవారు "సద్భక్తి"అనే (శ్రుతలిఖిత)అనే వ్యాఖ్యను రచించి నాడు.

     ఈ వ్యాఖ్యను ఆధారంగ డా.ఆద రాసుపల్లి యజ్ఞరాములు,

                                              డా.కండ్లకుంట అలహసింగరాచార్యులు తెలుగు చేసినారు.

     ఈ గ్రంథాన్ని డా.పుల్లెల శ్రీరామచంద్రుడుగారి "ప్రస్తావన" తో---

     కీ.శే.బ్రహ్మశ్రీ కాసులవిశ్వనాథశాస్త్రి గారు,వారికుమారులు తెలుగులిపిలో

ఆగష్టు1993లో ప్రచురించినారు.

 సుశ్లోక లా(రా)ఘవంలోని మొదటి శ్లోకం---

అలంకృతి పరిష్కృతః  సురసభావన పండితః

ప్రణనష్టఖరదూషణః   ప్రథితచారువృత్త స్థితః l

ప్రమోదయతి యః సతః  సుగుణతః స్వకశ్లోకతః

 ప్రభూ రవికులాగ్రణీః  కవివరేణ్యవద్రాజతే ll

అలంకృతి పరిష్కృతః=

1.అలంకారభూషితుడు/          2.అలంకారశాస్త్రపండితుడు,

సురసభావనే పండితః=

1.దేవసమాజమును రక్షించువాడు 2.శృంగారాదిరసప్రయోగంలోపండితుడు

ప్రణనష్ట ఖరదూషణః=

1.ఖరదూషణులనుసంహరించినవాడు/

2.దుష్టులుచేయునిందలనుతొలగించువాడు,

ప్రథితచారు వృత్తస్థితః=

1.ప్రసిద్ధమైనమంచిశీలం కలవాడు,

2.శార్దూలాదివృత్తప్రయోగనిపుణుడు,

ప్రభూ రవికులాగ్రణీ కవివరేణ్యవ ద్రాజతే=

సత్పురుషులను సంతోషపరచునట్టి

1.సూర్యవంశశ్రేష్ఠుడైన రామచంద్రుడు,

2.కవిశ్రేష్ఠునివలె ,

                ప్రకాశిస్తున్నాడు.

                1.రవివంశ వర్యా!

                  2.సుకవి వర్యా !

వైద్యవేంకటేశ్వరాచార్యులు గారి సౌజన్యంతో

Saturday, March 25, 2023

అప్రస్తుత ప్రసంగి ప్రశ్నలు - కొంటె సమాధానాలు

 అప్రస్తుత ప్రసంగి  ప్రశ్నలు - 

కొంటె సమాధానాలు





సాహితీమిత్రులారా!

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి  అవధాని అంత కంటే కొంటెగా  సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను . 

ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?

జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .

ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది? 

జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .

ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ? 

జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .

ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?

జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు. 

ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది. 

జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’ 

ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు 

జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు 

ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?  

జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .

ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు? 

జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .

ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ? 

జవాబు :- ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .

ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు 

జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .

ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? 

జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .

ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?

జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. 

ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు 

జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను. 

ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .

ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా? 

జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .

ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?

జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .

ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?

జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .

ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? 

జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .

ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?

జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద. 

ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? 

జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .

ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?

జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .

ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు? 

జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’ 

ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? 

జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను. 

ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?

జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.

మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .

ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు

జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని

భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త 

ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?

జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .

ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? 

జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం


సంస్థానాలు సాహిత్యం ముఖపుస్తకం నుండి-


Thursday, March 23, 2023

చిత్రకావ్యం -4

 చిత్రకావ్యం -4




సాహితీమిత్రులారా!

ఈ వీడియోలో స్వర, వర్ణ, సర్వతోభద్ర

మొదలైన చిత్రాలను నందమోహన్ షైనీ గారు

వివరించారు ఆస్వాదించండి-



Monday, March 20, 2023

ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం

 ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం




సాహితీమిత్రులారా!

పుట్టపర్తిలో జరిగిన కవిసమ్మేళనంలో

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు

బాబాగారి ముంగిట చెప్పిన 

ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం

గమనించండి-





Friday, March 17, 2023

మహానాగ బంధం

 మహానాగ బంధం




సాహితీమిత్రులారా!

వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారి

మహానాగ బంధం

ఆస్వాదించండి- 





Wednesday, March 15, 2023

ద్వినాగ బంధం

 ద్వినాగ బంధం




సాహితీమిత్రులారా!

బండ్ల సుబ్రహ్మణ్య కవి గారి

ఆంధ్రాభ్యుదయం నుండి

ద్వినాగ బంధం - ఈశ్వర ప్రార్థన

గమనించండి-



Sunday, March 12, 2023

పుష్పమాలికా బంధం

 పుష్పమాలికా బంధం




సాహితీమిత్రులారా!

బండ్ల సుబ్రహ్మణ్య కవి గారి

ఆంధ్రాభ్యుదయం నుండి

పుష్పమాలికా బంధం

గమనించండి-






Thursday, March 9, 2023

విష్ణు సహస్రనామాలు ఎన్ని రకాలున్నాయి?

  విష్ణు సహస్రనామాలు ఎన్ని రకాలున్నాయి?




సాహితీమిత్రులారా!



విష్ణుసహస్రనామాలు మనకు మూడు విధాలైన విష్ణుసహస్రనామాలుఉన్నాయి.

అయితే-ఆ  మూడింటిలో  ఒకటి మాత్రమే

బహుళప్రచారప్రాచుర్యం పొందింది.

1.విష్ణుసహ్రనామస్తోత్రమ్:

శ్రీమహాభారతంలోని అనుశాసనిక పర్వంలోనిమోక్ష

ధర్మంలో  భీష్మ యుధిష్ఠిర సంవాదంగా

ఉండే విష్ణుసహస్రనామస్తోత్రం బహుళ

ప్రచారం పొందినది.

2.విష్ణుసహస్రనామస్తోత్రమ్: 

శ్రీపద్మ పురాణంలోని  ఉత్తరఖండంలో ఉమాపతి  నారదసంవాదంగ  కూడ  

విష్ణు సహస్రనామస్తోత్రం ఉంది.ఈ స్తోత్రం

మొదట పేర్కొన్న స్తోత్రంలా ప్రాచుర్యం

పొందలేదు.

3.విష్ణుసహస్రనామస్తోత్రమ్:

ఈ స్తోత్రం శ్రీగరుడపురాణంలోని పూర్వఖండంలో

ప్రథమాంశలోనిఆచారఖండంలోఉంది.

 వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో

Tuesday, March 7, 2023

పాదభ్రమకము

 పాదభ్రమకము




సాహితీమిత్రులారా!


గణపవరపు వేంకటకవి కృత

ప్రబంధరాజ వేంకటెశ్వర విజయవిలాసములోని

849వ పద్యం పాదభ్రమకము

ప్రతిపాదం ముందుకు వెనుకకు ఎలా చదివినా ఒకలాగే ఉండే పద్యం

గమనించగలరు -

మానుత ఘనౌఘ తనుమా

యానత సుజనావ భావ నాజ సుతనయా

దీనఖర పాద ఖన దీ

యాన విమదజయ విభావియజదమవినయా


Saturday, March 4, 2023

నాలుగక్షరాల నాలుక కదలని పద్యం

 నాలుగక్షరాల నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!



నాలుగక్షరాలతో కూర్చినది

చదివితే పెదాలు తగిలేది

నాలుక కదలని పద్యం ఇది-

దీనిలో ప,బ,భ,మ  అనే వ్యంజనాలతో కూర్చబడిది

పోకూరి కాశీపతిగారి సారంగధరీయంలోనిది ఈ పద్యం

గమనించండి - ఆస్వాదించండి-

మామమామపాప భీమమౌ ముప్పాపి

పాపమేపు మాపి బాముఁ బాపి

భూమిఁ బబ్బ మబ్బఁ బేము మమ్మోమమి

మేము బోము భామ మేమి భీమ

                                                              (సారంగధరీయము - 2- 127)

దీన్ని పెదవులతో పలుకుతాము కావున సోష్ఠ్యములతో కూర్చినది అంటాం.

అలాగే నాలుగక్షరాలతో కూర్చినది కావున చతురక్షరి అంటాము

అలాగే చదివేప్పుడు నాలుక కదలదు కావున అచలజిహ్వ అంటాం

దీనిలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి 

దీన్ని కూర్చిన పోకూరి కాశీపతిగారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి

Thursday, March 2, 2023

బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యస్వామి

 బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యస్వామి




సాహితీమిత్రులారా!


           ఆత్మకూరు సంస్థాన విద్వత్పండితకవివర్యులు

              బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం

                  శ్రీనివాసాచార్యస్వామివారు

                        (1863-1919)

****************************************

        శ్రీనివాసాచార్యులవారు శా.శ.౧౭౮౫ దుందుభి,చైత్ర- బహుళ నవమి నాడు(క్రీ.శ.1863) జన్మించినారు. వీరి

తిరునక్షత్ర తనియన్:

   శ్రీమద్దుందుభి చైత్రకృష్ణనవమీ పుచ్ఛే ధనిష్ఠర్షగే

   క్ష్మాపుత్రే శశినాసమం మకరగే మేషంగతే పూషణి,

   మందేచైవ తులాంశగే సతితులా లగ్నేవతీర్ణో౭జని

   శ్రీమాన్ బాలసరస్వతీ బిరుదభాక్ శ్రీశ్రీనివాసో గురుః .

పరమపదం: శా.శ.౧౮౪౧ సిద్ధాద్రి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి

    ( క్రీ.శ.1919)

     శ్రీమద్రామానుజ సిద్ధాన్త నిర్ధారణ సార్వభౌమ, సర్వతంత్ర

స్వతంత్ర ,కవితార్కికకంఠీరవ, శ్రీమద్రాజాధిరాజగురుసార్వభౌ

మేత్యాది బిరుదవిభ్రాజితమగు శ్రేష్ఠమైన ఆచార్యపురుషవంశ

మున  ఉద్భవించి,గజ  తురగ  ఛత్ర  చామరాందోళికా దివా ప్రదీప  శ్రీకాహళ  గౌరవ  

కాహళ మకరతోరణ  మయూర చ్ఛత్రాది గౌరవభాక్కులు "శ్రీమాన్ బాలసరస్వతీ శ్రీనివాసాచా

ర్యులవారు.     వీరు శఠమర్షణగోత్రీయులు.అపరవేదాన్తదేశిక శ్రీనివాసాచా ర్యులవారి(సురపురం)  

వంశీయులు.  వీరి  జనని  శేషాంబ, జనకుడు బుచ్చివేంకటాచార్యులు.వీరు ఆత్మకూరు సంస్థాన

ఆస్థాన ప్రధాన విద్వత్పండిత కవివర్యులుగ విరాజిల్లినారు.

    వీరు తన పదకొండవ ఏట తండ్రిదగ్గర సాహిత్యాది

గ్రంథాలను పూర్తి చేసి సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పడా నికి ప్రారంభించినారు.పదహారవఏట మైసూరులో శ్రీరంగనాథ

బ్రహ్మతంత్రపరకాలస్వామివారి దగ్గర తర్కవేదాన్తాలను అభ్య

సించారు.అక్కడే సజ్జయంతాతాచార్యులవారిదగ్గర ప్రాకృతాది

భాషలను నేర్చుకున్నారు.మైసూరు మహారాజా చామరాజేం

ద్రులవారు ఆచార్యలవారి ప్రతిభా పాండిత్యాలకు అబ్బురపడి

"బాలసరస్వతి" బిరుదంతో సత్కరించారు.శ్రీనివాసాచార్యుల

వారు కాశీలో స్వామిశాస్త్రిగారి దగ్గర అద్వైతవేదాన్తాన్ని,కైలాస

చంద్రశిరోమణి భట్టాచార్యుల దగ్గర న్యాయశాస్త్ర క్రోడాలనూ

జగదీశవిరచిత జాగదీశినీఅభ్యసించినారు.ఆ తర్వాత నవద్వీ   పాలలో  మీమాంసాశాస్త్రాన్నీ  ఆపోశనం  పట్టారు. నవద్వీప

పండితమండలివారు  ఆచార్యులవారికి  "తర్కతీర్థ"  బిరుద ప్రదానం చేసినారు.

   శ్రీనివాసాచార్యులవారు దర్భాంగ,జోథ్పూర్,బుందీదత్తియా,

గ్వాలియర్,కోటాంజరీ,ఇందూరు,ధారానగర్,జమ్మూ,కాశ్మీర్,

మొదలయిన  ఉత్తరభారత  సంస్థానాలలోనూ,   మైసూరు, బళ్లారి,కడప , పెనుగొండ ,తాడిపత్రి , ప్రొద్దుటూరు ,మద్రాసు,

బనగానిపల్లి మొదలయిన దక్షిణాది ప్రాంతాలలోనూ అనేక

శాస్త్రార్థవాదనలు,ఘంటాశత కవనాలు చేసి సరస్వతీ అవతా రులుగ కీర్తి గడించినారు. సమకాలీన సంస్కృత విద్వత్కవి

పండితులలో యావద్భారతదేశాన వీరి పేరు ఎరుగనివారు

ఆనాడు లేరనడంఅతిశయోక్తికాదని నాటిపండితుల రచనలు తెలియజేస్తున్నాయి.

   ఆచార్య బిరుదురాజురామరాజుగారు శ్రీనివాసాచార్యుల వారిని గురించి(పాటిబండ మాధవరాయ షష్టిపూర్తిసన్మాన సంచికలోని) ఒకవ్యాసంలో   "తిరుపతివేంకటకవులు ఆత్మ కూరు సంస్థానమునకు పోయి తదాస్థాన విద్వాంసులయిన

శ్రీనివాసాచార్యులతో   తలపడి  శాస్త్రవాదమున నోడిపోయిరి.

తిరుపతివేంకటకవులు తెలుగులో  శ్రీనివాసాచార్యులకన్న

మిన్నలైనను,సంస్కృతమున నాశుకవిత్వమును చెప్పుట

యందును, సమస్త  శాస్త్రవైదుష్యమునందును  శ్రీనివాసా చార్యులవారే మిన్నలు. ఆ వాస్తవమెరుగని కొందరు ఇటీవల

పత్రికలందును  గ్రంథములందును  శ్రీనివాసాచార్యులే పరా భూతులైనట్లు వ్రాయుట సత్యదూరము.కీర్తిశేషులను గురిం చిన సత్యాసత్యములు తెలియక,తెలిసికొన ప్రయత్నించక

సాహసోక్తులకుఆధునికులుపూనుకొనరాదని సప్రశ్రయముగ

కోరుచున్నాను" అని తెలిపినారు.ఆచార్య బిరుదురాజు రామ రాజుగారు ఈ వ్యాసాన్ని "మరుగునపడినమాణిక్యాలు" ,

"చరిత్రకెక్కని చరితార్థులు" అనే తమ వ్యాస సంపుటాలలో

కూడా చేర్చడం స్మరణీయం.

      రచనలు:శ్రీనివాసాచార్యులవారి ముద్రితాముద్రిత గ్రం థాలు అనేకం.వాటిలో అధికశాతం ఆత్మకూరు సీతారామ భూపాలుగారు ముద్రింపించారు, కాగా,అముద్రిత రచనల  కాగితప్రతులు  బాలసరస్వతిగారి మనుమడూ, నాకు  గురుతుల్యులూ, ఆత్మీయులూ అయిన  శ్రీమాన్ కవితార్కిక సింహాచార్యులవారి తిరుమాళిగలో భద్రముగాఉండేవి(ఇప్పటి  పరిస్థితి తెలియదు).తెలియవచ్చినంతలో బాలసరస్వతిగారి

రచనలు-

       వీరశైవ శిరస్తాడనం,        దుర్విగ్రహనిగ్రహం,

       నంజరాజచంపూకావ్యం,   తత్త్వమార్తాండప్రభాపటలం,

       కిరీటివేంకటాచార్యవిజయవైజయన్తీనాటకం,

       రాజవంశరత్నావళి(ఆత్మకూరు రాజులు, తెలుగు)

       రాజవంశరత్నావళీ(           ,,         ,సంస్కృతం)

       లక్ష్మీసరస్వతీ దండకావళీ,

       శ్రీ కురుమూర్తి శ్రీనివాస స్తోత్రావలీ,

       లక్ష్మీధ్యానసోపానం  ,శ్రీనివాసధ్యానసోపానం,

       శ్రీనివాస పంచాశత్, లక్ష్మీ పంచాశత్

       అష్టభాషలలోనూ కురుమూర్తిస్వామిస్తుతులు,

       ముకుందమాలా - తొలితెలుగువ్యాఖ్యానం,

       శ్రీకురుమూర్తి శ్రీనివాస సుప్రభాత స్తోత్రం

       స్తోత్రజాలం మొదలయిన రచనలు చాలా ఉన్నవి.

             శ్రీనివాసాచార్యులవారు ఘంటాశతగ్రంథాలను

అనర్గళంగా, అత్యాశువుగా, అష్టభాషలలో సమర్థవంతంగ

వివిధ సంస్థానాదులలో చెప్పినారు.తెలియవచ్చినంతలో

కాలానుక్రమంగా వారి ఘంటాశతగ్రంథకవనాలు-

              మైథిలీకల్యాణం: మిథిలారాజధాని దర్భాంగ

సంస్థానంలో ప్రభువు లక్ష్మీధరసింహగారి కాలాన క్రీ.శ.

1866అక్టోబర్8వతేదీనాడు అష్టభాషలలో చెప్పిన ఘంటా

శతకం ఇది.ఇక్కడి సంస్థాన విద్వత్ప్రభువు,విద్వద్వర్యులు

ఆచార్యులవారికి "కవితార్కికసింహ" బిరుదప్రదానం చేశారు.

ఈ బిరుదనామమే ఆచార్యులవారి పౌత్రునకు'కవితార్కికసిం

హాచార్య' అని పెట్టారు.    

              రుక్మిణీకల్యాణం: దీనికి భైష్మీపరిణయం అని

కూడా నామాంతరం. ధారానగర సంస్థానంలో తత్ప్రభువు

రాజేంద్రసింహ మరియు విద్వత్పండితమండలి సమక్షాన

చెప్పిన ఘంటాశతకం ఇది. ఈ ఘంటాశతగ్రంథ కవనం

క్రీ.శ.1888జనవరి2వ తేదినాడు చెప్పబడింది. ఈ సంస్థానంలో పండితులు బాలసరస్వతిగారిని శ్లోకాలలో

"కువలయామోదకర ద్విజరాజ"అంటూ శ్లేషలో ప్రశంసించి

నారు.

              దమయంతీస్వయంవరం:ఈ ఘంటాశతగ్రంథ

కవనం బళ్లారిలోచెప్పినారు.ధర్మవరంకృష్ణమాచార్యులవారు

ఈ ఘంటాశతావధాన  సభకు  అధ్యక్షులు. ఈ అవధానం 1895 డిశంబరు 31 నాడు జరిగింది.

               లేఖినీ,గంగాభివర్ణనం:ఆత్మకూరు సంస్థానంలో

ఆచార్యులవారికీ తిరుపతివేంకటకవులకూ సాహితీభండనం

జరిగింది.ఆసందర్భాన ఘంటాశతగ్రంథంగా లేఖినినీ గంగాభి

వర్ణననూ  చేయాలని  పండితులు కోరగా  ఘంటాశతగ్రంథ కవనంలో చొరవలేని తిరుపతికవులు మౌనం వహించగా

శ్రీనివాసాచార్యులవారు ఘటికాంతరాళంలో 15శ్లోకాలు

కలాన్నిగురించీ, 50 వసంత తిలకాలు‌ గంగను గురించీ

చెప్పారు.ఈ.  ఘంటాశతకం   క్రీ.శ.1887  మార్చిలో           ఆత్మకూరులో జరిగింది.

              వజ్రనాభచరితం: ప్రొద్దుటూరు పురప్రముఖులు,

విద్వాంసుల సమక్షంలో 1901 సెప్టంబరు 8వ తేదీనాడు

చెప్పబడిన ఘంటాశత గ్రంథం ఇది. సభాధ్యక్షులుగా విద్వత్సంపన్నుడూ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ అయిన బ్రహ్మశ్రీ

సి.సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఉన్నారు.

               ధూమశకటం:కడప పట్టణంలో1902 మార్చి

5వ తేదీనాడు విద్వత్సభలోఈ ఘంటాశతావధానంజరిగింది.

పురాణాంశాలయితే అలవోకగా చెప్పగలడని ఈ అంశాన్ని

ఇచ్చినారు. అయినా బాలసరస్వతిగారు నిర్ణీతసమయానికి

ముందే తమ శతావధానాన్ని పూర్తి చేశారు.

               సముద్రమథనం:1903మార్చి 20 తేదీనాడు

మద్రాసులోని పచ్చయ్యప్పకళాశాల సభాభవనంలో పుర ప్రముఖులు,సుప్రసిద్ధపండితుల సమక్షంలో జరిగిన

అవధానం ఇది. ఈ అవధానాల గురించి అలనాటి ప్రముఖ

ఆంధ్ర,ఆంగ్ల పత్రికలు విశేషంగా వార్తలను ప్రచురించాయి.  అవన్నీ నేను (ఈ వ్యాసకర్తను) సేకరించాను. 

                 బాలసరస్వతిగారి  ఘంటాశతావధానాలను

ఆ నాటి సంప్రసిద్ధ ఆయుర్వేదవైద్యులు పండిత డి.గోపాలాచా ర్యులవారు 1903లో ఆనంద ముద్రణాలయం-మద్రాసులో

ముద్రింపించినారు.

                 బాలసరస్వతివారు తమ అవధానసభలలో

అవధానాన్ని నిర్ణీత వ్యవధికన్నా చాలాముందుగానే అత్యాశువుగ  ముగించేవారట.సభలో ఉండిన ప్రముఖుల

కోరికమేరకు ఆధ్యాత్మి, విశిష్టాద్వైత, వేదాన్తాదులను గురించి

అనర్గళంగ ఉపన్యసించేవారు.సభలో  వివిధరంగాలలో ఉద్దండ పండితులైనవారు తర్క,మీమాంసా,సాంఖ్య, వేదాం తాలలో కొ్న్ని సందేహా లను వెలిబుచ్చి ఆచార్యులవారి నుండి సముచిత సమాధానాలను రాబట్టి, బహువిధాలుగ

బాలసరస్వతిగారిని ప్రశంసించేవారు. ఇవన్నిటికీ ఆ నాటి

పత్రికలు సాక్ష్యం పలుకుతున్నాయి.

            సమకాలీన సంస్కృతపండితులలో ఏనోట విన్నా

ఆచార్యులవారి ఘంటాశతావధానాల చర్చనే ఉండేదని నాడు కొందరు చెప్పిన మాటలు అక్షరంగా దర్శనమిస్తున్నాయి.

           బ్రహ్మామృతవర్షిణీ సభ:      శ్రీనివాసాచార్యులవారు

"బ్రహ్మామృతవర్షిణీసభ" అనే పేరున ఒక సంఘాన్ని స్థాపించి

నారు.దానికి  బాలసరస్వతిగారు అధ్యక్షులుగ,  వనపర్తి సంస్థాన ప్రధానవిద్వాంసులు ఆచార్యరంగాచార్యులవారు

ప్రధానకార్యదర్శిగ,గద్వాలసంస్థానం పేపలి చక్రవర్తి కొండమా

చార్యులుగారు నియత సభాకార్యదర్శిగ ఉన్నారు. "బ్రహ్మామృత వర్షిణి" పత్రిక శ్రీకురుమూర్తి శ్రీనివాస ముద్రాక్షర

శాల,శ్రీమదరచింతాత్మకూరుసంస్థానంలో ముద్రతమైనవి ఒకటి రెండు ప్రస్తుత వ్యాసకర్త దగ్గర ఉన్నవి.

        బ్రహ్మామృతవర్షణి సభవారు ఆత్మకూరుసంస్థానంలోనే

గాక (పాత )పాలమూరుజిల్లాలోనేగాక, రాయలసీమ ప్రాంతంలో కూడ అనేక సభలు సమావేశాలు నిర్వహించి

విద్యార్థులకు పరీక్షలుకూడా జరిపి విశిష్టాద్వైతాన్ని, ధర్మ ప్రచారాన్ని చేసేవారు.ప్రథమకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగా

సారావళీ సహిత శ్రీభాష్యం,పరమతభంగ సహిత శ్రీమద్రహస్య త్రయసారః అనేవాటిని పెట్టేవారు.ఉత్తీర్ణులయినవారికి25,

మధ్యములకు20,అధమస్థాయివారికి15రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు.ద్వితీయకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగ

శ్రీభాష్యం-ప్రథమాధ్యాయం , జిజ్ఞాసాదర్పణః,షష్ఠీదర్పణః.

ప్రథమ,ద్వితీయ,తృతీయస్థానం పొందిన విద్యార్థులకు

రూ15/-,రూ12/-, రూ10/-పారితోషికం. తురీయకక్ష్యకు

పాఠ్యాంశం-నీళాస్తుతి,స్తోత్రజాలం,హరి,గుణదర్పణః,సిద్ధాన్త

చిన్తామణి. పారితోషికం-రూ5/-,రూ3/-,రూ2/-ఇచ్చేవారు.

                       నిర్దిష్టమైన ప్రణాలికతో శ్రీవైష్ణవాన్ని  ప్రచారం చేసిన విద్వత్పండితులు బాలసరస్వతిగారు.

                         సంస్కృత భారతి కృతిరత్నహారంలో

చోటుచేసుకున్న విద్వద్రత్నం మ.న.జిల్లా సంస్థానసంజనిత

రత్నంకావడం మనందరకూ గర్వకారణం.

                          బాలసరస్వతిగారి మరుగునపడిన కృతిరత్నాలన్నీ  ఒకచోటగుదిగుచ్చి హారంగా అందించవలసి ఉంది.

                      

వైద్యం వేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో