Wednesday, December 28, 2022

శ్రీరామకథ - చిత్రకవిత్వం

 శ్రీరామకథ -  చిత్రకవిత్వం




సాహితీమిత్రులారా!


శ్రీరామకథ -  చిత్రకవిత్వంలో  సంస్కృతాంధ్ర రచనలు.

 శ్రీరామాయణగాథ ప్రభావం

 సాహిత్యప్రక్రియ లన్నిటిపై  ఉందనడం సత్యదూరం  కాదు. 

ప్రస్తుతం రామాయణ సంబంధిత రచనలలో

చిత్రకవిత్వం విలసిల్లిన రచనలను నామ మాత్రంగ స్మరిద్దాం-

               శ్రీ మద్వాల్మీకి రామాయణం

యుద్ధకాండలో-----

శ్లో.మండలాని విచిత్రణి

                          స్థానానివివిధానిచ,

   గోమూత్రికాదిచిత్రాణి

                      గతప్రత్యాగతాని చ.

            - వా.రా.యుద్ధకాం,౪౦-౨౮

అనే శ్లోకంలో గోమూత్రికాబంధచిత్రవిశేషంవలె  

సైన్యం యుద్ధం చేసినారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

  వివిధకవిపండితులురామాయణాన్ని

సంస్కృతంలో చిత్రకవనంలో రచించినారు. ఆ  పేర్లు ----

కవిపేరు                      చిత్రరచనపేరు

వేంకటేశ్వర         --రామయమకార్ణవః

వేంకటేశ               --రామచంద్రోదయం

గోపాలార్య           --రామచంద్రోదయం

కృష్ణమోహన        --రామలీలామృతం

శ్రీకాంత                       --రఘూదయం 

చిదంబరకవి        -శబ్దార్థచింతామణిః

వేంకటాధ్వరి     --రాఘవయాదవీయం

దైవజ్ఞసూరి --రామకృష్ణవిలోమకావ్యం

శ్రీకాంత                     --రఘూదయం

నారాణభట్ట     --నిరనునాసికచమ్పూః

మల్లికార్జున     --నిరోష్ఠ్యరామాయణం

వేంకటార్య--శ్లేషచమ్పూరామాయణ 

ధనంజయ-రాఘవయాదవపాణ్డవీయ

చిదమ్బరకవి  -పంచకల్యాణచమ్పూః

సన్ధ్యాకరనన్దినః           --రామచరితం 

          "   -రాఘవయాదవపాణ్డవీయం

వేంకటాచార్య-శ్లేషచమ్పూరామాయణ

వేంకటేశ్వర-- చిత్రబన్ధరామాయణం

వేంకటాచార్య-కంకణబన్ధరామాయణ

కృష్ణకవి    --క్రియాగోపనరామాయణం

కృష్ణరాయ        --ఆర్యాలంకారశతకం

వీరరాఘవ      --విశేషణరామాయణం

రామభద్ర                 --రామస్తవప్రాసః

నిట్టలఉపమాక}

వేంకటేశ్వర      } -రామాయణసంగ్రహః

భాస్కరసూరి.           --సీతారామీయం

సుబ్రహ్మణ్యసూరి        --రామావతారః

సుబ్రహ్మణ్యసూరి      --సీతాకల్యాణం

సుబ్రహ్మణ్యసూరి-రామాయణడోలగీత

           ,,        -ఆసేచనకరామాయణం

వేంకటేశవామన   --రామచన్ద్రోదయం

ముడుమ్బై వేంకట    }రామచన్ద్ర-

రామనరసింహాచార్య}  కథామృతం

డా.కే.ఎస్.రామానుజాచార్య--శ్రీరామ

                                       బాణస్తవః

 - ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనవి.

---------------------------------------

తెలుగుచిత్రకవనం-రామాయణం:

దశరథరాజనందనచరిత్ర(నిరోష్ఠ్యం)-- -మరింగంటిసింగరాచార్య

శుద్ధాన్ధ్రనిరోష్ఠ్యసీతాకల్యాణం--మరిం గంటి సింగరాచార్యులు

నిరోష్ఠ్యసీతాకల్యాణం   --పిడుపర్తి బసప్ప

నిరోష్ఠ్యరామాయణం--సురపురంకేశవయ్య

నిరోష్ఠ్యజానకీకల్యాణం--పోడూరి  రామన

శివరామాభ్యుదయద్వ్యర్థికావ్యం--    పోడూరి పెదరామామాత్య

నిరోష్ఠ్యదాశరథిశతకం--మండపాక  పేరయకవి

నిరోష్ఠ్యదశరథతనయశతకం--వేదుల నారాయణకవి

అచ్ఛాంధ్రనిరోష్ఠ్యనిర్గద్యదాశరథిచరిత్ర --హనుమంతరాయశర్మ

నిర్వచనభారతగర్భరామాయణం--  రావిపాటిలక్ష్మీనారాయణ

    మొదలయినవి ప్రసిద్ధమైనవి

            

      వైద్యంవేంకటేశ్వరాచార్యులువారి సౌజన్యంతో

No comments: