Thursday, September 15, 2022

శబ్దచిత్రములో స్థానచిత్రము

 శబ్దచిత్రములో స్థానచిత్రము




సాహితీమిత్రులారా!



వర్ణములు 5 స్థానాలలో ఉత్పత్తి అగును.

కంఠమునందు పుట్టునవు  కంఠ్యములని,

తాలువు(దవడలు)నందు పుట్టునవి తాలవ్యములని,

మూర్ధమునందు పుట్టునవి మూర్ధన్యములని,

దంతములనందు పుట్టునవి దంత్యములని,

ఓష్ఠమునందు పుట్టునవి ఓష్ఠ్యములని

పిలువబడుచున్నవి.

తాలవ్యాక్షరములు - అచ్చులలో ఇ,ఈ

వర్గాక్షరములలో చ వర్గము, అంతస్థములలో - య,

ఊష్మములలో - శ అనునవి.

ఇవి ఉపయోగించక మిగిలిన వాటిని ఉపయోగించి

పద్యము లేక శ్లోకము కూర్చిన అది నిస్తాలవ్యమనబడును.


సరస్వతీకంఠాభరణములోని ఈ శ్లోకం చూడండి-

స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బురః

మేఘనాదోऽథ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ

                                                                                                      (2-268)

ప్రకాశించుచున్న కర్ణభూషణ రత్న సమూహ మనెడి

హరివిల్లుచేత పొడలు గలిగినవాడై సంగ్రామమునందు

మేఘనాథుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము(వర్షర్తువు)

వలె ప్రకాశించెను.

దీనిలో తాలవ్యములుగాక మిగిలినవి ఉపయోగించుటవలన

దీనిని నిస్తాలవ్యము  అంటారు.

ఇది శబ్దచిత్రములో స్థానచిత్రమునకు సంబంధిచినది.

No comments: