తాలాంకనందినీ పరిణయములోని
నిరోష్ఠ్య చిత్రం
సాహితీమిత్రులారా!
ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య
ప్రణీతమైన తాలాంకనందినీ పరిణయము లోని
నిరోష్ఠ్య చిత్రం
నిరోష్ఠ్యం అంటే పెదవులతో పలకని లేదా పెదవులు తాకనిది
ఇది ప్రథమాశ్వాసం ఆశ్వాసాంతంలో కూర్చబడినది-
నలినజ శంకర త్రిదశనాధశరణ్య! దయాంతరంగ! స
జ్జలజశరాంగ! సారదరశార్ఙగదాసిజయాగ్రసాధనా!
కలితధగద్ధద్ధగితకాంచనగల! నిశాకరాయతా
స్యలలిత! శేషశైలశిఖరాగ్రనికేతన! తార్క్ష్యకేతనా!
ఇది పెదవులు తాకని అక్షరాలతో కూర్చబడినది.
గమనించగలరు.
No comments:
Post a Comment